గత ప్రభుత్వంలో ప్రజాభిప్రాయాలు లేకుండానే నాలుగు గోడల మధ్య నిర్ణయాలు జరిగేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పాలకులు తీసుకున్న నిర్ణయం ప్రజలపై బలవంతంగా రుద్ధారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. రైతు బంధుపై అభిప్రాయాల సేకరణల మేరకే నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలు వివిధ రూపాల్లో కడుతున్న డబ్బేనని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తేనే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తుందన్నారు. రాష్ట్రమంతటా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఏం చేసిందో ప్రజలే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. ప్రజల మనోగతానంతా అసెంబ్లీలో చర్చకు పెడతామని పొంగులేటి స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90765