380
హైదరాబాద్‌లో భారీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. క్యూనెట్ పేరుతో అమాయకులను మోసం చేసిన ముఠాను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.నిరుద్యోగ యువతతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, “లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చు” అంటూ మాయమాటలతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు సీపీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.