ఆటో మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నా నిందితులను జనగామ పోలీసులు అరెస్టు చేసారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న రెండు బజాజ్ ఆటోలు, రెండు మోటార్ సైకిల్ వాటి విలువ 730000 వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ కి చెందిన నలుగురు వ్యక్తులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస దొంగతనాలకు పాల్పడుతూ 2022, 2023 సంవత్సరంలో బంజారాహిల్స్ మేడిపల్లి చిలకలగూడ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక మరల జల్సాలకు అలవాటు పడి మూడు రోజుల క్రితం నలుగురు బస్సులో జనగామ వచ్చి జనగామ నగరంలో ఇంటి ముందు పార్కు చేసి ఉన్న బజాజ్ ఆటోను, పెంబర్తి గ్రామంలో మరో ఆటోను తీసుకొని వెళ్లి నిర్మానుస్య ప్రాంతంలో పెట్టి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో పెంబర్తి వై జంక్షన్ వద్ద జనగామ పోలీసులు తనిఖీ చేస్తూ ఉండగా పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ పోలీసులను డిసిపి సీతారాం అభినందించారు.
Crime
రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి ఆస్నాద్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. పదిమంది జూదగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి 14 లక్షల 48 వేల నగదును, పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులు ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. గోవాలో జరిగే క్యాసినో మాదిరిగా చిప్స్ లు , కమిషన్లు, లక్షల పెట్టుబడులతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారని అన్నారు. గత కొంతకాలం నుంచి మహారాష్ట్ర సరిహద్దుల్లో పేకాట నిర్వహిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వీరికి స్థావరాలకు సెక్యూరిటీగా సెంట్రీలను ఏర్పాటు చేసుకొని పేకాట నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఎలాంటి వ్యక్తులనైనా వదిలేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జాతీయ పక్షి నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి పేరే షికార్ అన్న బిరుదును తెచ్చుకున్న ఘరానా హంటర్ అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కాడు. గతంలో దుప్పుల వేట కేసులో నిందితునిగా ఉన్నప్పటికి తన పద్దతి మార్చుకోలేదు… నుండి…. ములుగు జిల్లాలో పని చేస్తున్న డీఎస్పీకి ఈయన తండ్రి కావడం మరో విశేషం. జగిత్యాల డిఎస్పీ రము చందర్ ఈ మేరకు మీడియా తో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నెమళ్లను వేటాడి తన వాహనంలో తీసుకొస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని పట్టుకున్నారని… నిందితుడిని అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో పోలీసులు విచారించారని…. పెగడపల్లి మండలంలోని దోమలకుంట సమీపంలో నెమళ్లను వేటాడిన వాటిని తీసుకుని తన స్వగ్రామానికి వెల్తుండగా పోలీసుల తనిఖీల్లో రెడ్ హైండడ్ గా పట్టుకున్నారని తెలిపారు.
అదేవిధంగా నిందితుని నుండి 0.22 ఎంఎం ఆయుధం, 34 రౌండ్ల తూటాలు, ఒక గొడ్డలి, కారు స్వాధీనం చేసుకున్నామని… నిందితుడు సత్యనారాయణ గతంలో పెద్దపల్లి జిల్లా బేగంపేట ప్రాంతంలో నివాసం ఉంటూ సింగరేణిలో ఉద్యోగం చేసేవాడని డిఎస్పీ రము చందర్ తెలిపారు… 2017లో రాష్ట్రంలోనే సంచలనం కల్గించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వాయిపేట శివార్లలో దుప్పుల వేట ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో దుప్పులను వేటాడుతున్న క్రమంలో అటవీ అధికారులు దాడులు చేయడం… సినిమా ఫక్కీలో వేటగాళ్లు తప్పించుకోవడంతో వేటకు బలైన దుప్పులను, కారును అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత పోలీసు అధికారులు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న క్రమంలో షికార్ సత్యం కూడా ఈ కేసులో ఉన్నాడని గుర్తించారు. అప్పుడు భూపాలపల్లి ఉమ్మడి జిల్లాలోనే షికార్ సత్యం తనయుడు సీఐగా పనిచేస్తున్నారు.
బీజేపీ నేత బండి సంజయ్ ఈ కేసును సీరియస్ గా తీసుకుని శాసనసభ పక్ష నేతగా ఉన్న జి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు అటవీ అధికారుల తీరుపై కూడా బీజేపీ ఎమ్మెల్యేలంతా ముక్త కంఠంతో ఆరోపించడంతో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో మహదేవపూర్ ప్రాంతానికి చెందిన వారితో పాటు షికార్ సత్యం కూడా ఉన్నాడని వెలుగులోకి వచ్చింది. తాజాగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద వాహనాల తనిఖీలో జాతీయ పక్షి నెమళ్లను వేటాడి పట్టుకొస్తూ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో నివాసం ఉంటున్న ఆయన వద్ద అనుమతి లేకుండా వినియోగిస్తున్న తుపాకితో జాతీయ పక్షులను వేటాడుతున్నట్టు తేటతెల్లమైంది. అయితే షికార్ సత్యం తనయుడు పోలీసు విభాగంలో డీఎస్పీ స్థాయిలో పనిచేస్తున్నట్టుగా సమాచారం. ఆయన నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసి ఆక్సిలరీ ప్రమోషన్ పొందాడని పోలీసు వర్గాల సమాచారం.
భర్త పై భార్య దాడి..
నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేని ఓ భార్య అతడ్ని దారుణంగా హతమార్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు(Sri Potti Sriramulu) నెల్లూరు జిల్లా(Nellore District) బండారు మాన్యం వద్ద అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తరచూ మద్యం సేవించి వేదింపులకు గురిచేస్తున్నాడని ఇంట్లో గొడవలు జరుగుతుండేవని ఇదే క్రమంలో భార్య పద్మ భర్త అయ్యప్పను రోకలితో కొట్టడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. పోలీసు(Police)లు మృతుని భార్యను అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: వైద్యుల నిర్లక్ష్యంతో పసిప్రాణం తల్లి గర్భంలో మృతి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
సంగారెడ్డి జిల్లా వెలిమల సేల్ స్టీల్ కంపెనీ నుంచి పెద్ద ట్రాలీ లారీల్లో లోడింగ్ చేసుకుని మధ్యలో ఒక దగ్గర ఆపి కొంత అన్ లోడ్ చేసి డబ్బులు దండుకుంటున్న నలుగురు లారీ డ్రైవర్లను బీడీఎల్ భానూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్థరాత్రి ఐరన్ రాడ్ లోడ్ తో వెళ్తూ మధ్యలో డంపింగ్ చేస్తున్న నాలుగు లారీలను పట్టుకుని సీజ్ చేశారు. సీఐ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వెలిమల SAIL స్టీల్ కంపెనీ నుంచి అపర్ణ, కల్పతరువు కన్ స్ట్రక్షన్ కు నాలుగు ఐరన్ లోడ్ లారీలు వెళ్లాల్సి ఉండగా వెలిమల శివారులోని ఒక సిమెంట్ బ్రిక్స్ కంపెనీ లో అర్థరాత్రి ఒక్కొక్క ట్రాలీ నుండి సుమారు 300 నుండి 500 కిలోల రాడ్స్ ను లారీ డ్రైవర్లు దొంగతనం గా కొన్ని రోజుల నుంచి అన్లోడింగ్ చేస్తున్నారన్నారు. గుర్నాథ్ రెడ్డి, రాజేష్ ఫిర్యాదు మేరకు నిన్న అర్థరాత్రి మోహన్ రెడ్డికి చెందిన సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో అన్ అన్ లోడ్ చేస్తుండగా 4 ట్రాలీ వెహికల్ లను అదుపులోకి తీసుకుని బీడీఎల్ బానూర్ పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఎవరు అన్ లోడ్ చేస్తున్నారనే విషయంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసిప్రాణం తల్లి గర్భంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మోరి.. అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన కుడిపూడి రాజేశ్వరి అనే గర్భిణీ స్త్రీకి వైద్యం వికటించి గర్భంలో ఉన్న బేబీ మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు లత వైద్యం సక్రమంగా అందిచక పోవడంతో గర్భంలో ఉన్న బేబీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ ఆదేశాలు కూడా లెక్కచేయలేదని మండిపడుతున్నారు. తమకు ఏం చేయాలో తెలీయక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తే అప్పటికే బేబి మృతి చెందినట్లు తెలిపారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లతపై కఠినచర్యలు తీసుకోవాలని రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు(Palnadu) జిల్లా, పట్టణంలో కారుకి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. మాచర్ల పట్టణంలోని 10వ వార్డు, తెదేపా కార్యకర్త వీర్ల సురేష్ కి చెందిన మారుతి బ్రీజా వాహనాన్ని తగలబెట్టిన(Car Fired) గుర్తు తెలియని దుండగులు. తన ఇంటి ముందు కారు నిలుపు చేసేందుకు స్థలం లేక పోవడంతో. ఇంటికి సమీపంలోని సెయింట్ జే వి ఆర్ స్కూల్ గేట్ ముందు పార్కింగ్ చేసిన సురేష్. అర్ధ రాత్రి సుమారు 1 గంటల సమయంలో కారు తగల బడతు ఉండటాన్ని గమనించిన సురేష్ కూతురు. తండ్రికి సమాచారం ఇచ్చిన కూతురు. అప్పటికే పూర్తిగా దగ్ధమైన కారు. పోలీసులకు పిర్యాదు చేసిన సురేష్. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కడప జిల్లా(kadapa)…
తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లికి, చెల్లికి అండగా ఉండాల్సిన బాబాయ్ కాలయముడై కుమారుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన పులివెందుల(Pulivendula)లో చోటు చేసుకుంది. పట్టణంలోని నగరిగుట్టకు చెందిన రెడ్డి బాష ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రెడ్డి భాష తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో. తల్లి, చెల్లెలతో కలిసి బాబాయి ఇంట్లో ఉంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈరోజు పదవ తరగతి పరీక్షలు కావడంతో రెడ్డి భాష పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నాడు. దీంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్న కుమారుడిని బాబాయి దారుణంగా చితక బాదాడు. బాబాయ్ దెబ్బలు తట్టుకోలేక రెడ్డి భాష అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన పులివెందులలో సంచలనంగా మారింది. ఎవరైనా తమ కుమారుడు బాగా చదివి మంచి ప్రయోజకుడు కావాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుకుంటారు. కానీ వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి ఇలాంటి ఘటనకు పాల్పడడం పట్ల స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంఘటన చూసిన పలువురికి విస్మయం కలిగిస్తోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
మోసపూరితంగా 60 కోట్ల విలువగల భూమిని కాజేయాలని చూసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి గ్రామ పరిధికి చెందిన సర్వేనెంబర్ 334, 335 గల 5 ఎకరాల 12 గుంటల భూమి దాని విలువ సుమారు 60 ఇట్టి భూమిని విజయవాడ ప్రాంతానికి చెందిన ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ మరియు అతని మిత్రులు కలిసి కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు 2014 ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆయన పేరుకు కలిసే విధంగా అతని కొడుకుల వ్యవరించే వీర వెంకట వర ప్రసాద్ ను వొప్పించి అతనికి 20 లక్షలు ఇస్తామని చెప్పి ఈ భూమిని మహబూబ్ నగర్ బేబ్బెర ప్రాంతానికి చెందిన నీలం గౌడ్, రవీందర్ కుమార్, ప్రశాంత్ మరియు కాటూరి హరిరంజని కి ఐదు కోట్లకు అమ్మడానికి చూపడంతో ఇట్టి విషయమై హరి రంజనీ అనే మహిళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ యొక్క భార్య అయితే ఈ నేపథ్యంలో కేవైసీ కాకుండా భూమి రిజిస్ట్రేషన్ అవ్వడానికి వీలుగా తన పై అధికారి మాటలను విని శంకర్పల్లి సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావు ఈ విషయంపై సస్పెండ్ కాబడిండనీ నార్సింగ్ ఏసిపి వెంకటరమణ గౌడ్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నార్సింగ్ ఏసిపి తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ కాకినాడ ప్రాంతానికి చెందిన ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి మరియు అతని స్నేహితులు కలిసి ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్ ఫరం పేరు మీద 2005 సంవత్సరంలో శంకర్పల్లి ప్రాంతంలో గల సర్వేనెంబర్ 334 మరియు 335 మొత్తం భూమి 5 ఎకరాల 12 గుంటలు భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి భూమిని కాకినాడ విజయవాడ మరియు మచిలీపట్నానికి చెందిన కొందరు వ్యక్తులు భూమిని కాజెయాలని కుట్రపూరితముతో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ గారు 2014లో చనిపోయారని ఒక నకిలీ డెత్ సర్టిఫికెట్ ను క్రియేట్ చేసి అతని నకిలీ కొడుకుగా ముద్దాకుల వరప్రసాద్ అనే వ్యక్తిని క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేద్దామనుకున్న సమయంలో కేవైసీ రాకపోవడంతో అనుమానంతో వచ్చిన వ్యక్తులు పట్టాదారుకు కాల్ చేయగా అతను శంకరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయించడం జరిగింది. ఇందులో నలుగురు వ్యక్తులను పట్టుకోగా ఇంకా కొంతమంది వ్యక్తులు పరారిలో ఉన్నట్టు నార్సింగ్ ఏసిపి తెలిపారు.
ఇది చదవండి : కవిత అరెస్టుకు నిరసనగా చేవెళ్ల ఎమ్మెల్యే ప్రెస్ మీట్…
అందులో అరెస్ట్ అయిన వ్యక్తులు :-
1. దేవగానుగుల రామ వీర వెంకట వర ప్రసాద్ మచిలీపట్నం 2. పరశురాం పార్థసారథి విజయవాడ 3. పోతులూరి త్రినాథ్ విజయవాడ 4. పరశురాం విజయబార్గవాన్ విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తులు గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. మిగతా వ్యక్తుల గురించి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఏసిపి వెంకటరమణ గౌడ్ తెలిపారు.. మోసపూరితంగా కాజేయాలని చూసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించడం జరిగింది..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కర్నూలు (Karnool) జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బంగారం కోసం సొంత అవ్వనే చంపాడు (Murder) ఓ మనవుడు. వివరాల్లోకి వెళితే గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో వృదురాలైన నాగమ్మ అనే మహిళను ఇంటి వద్దే వదిలి కుటుంబ సభ్యులు బ్రతకడానికి వేరే ఉరికి వలస వెళ్లారు. అయితే చెడు అలవాట్లకు బానిసైన మనవడు వెంకటేష్, నాగమ్మ వద్ద ఉన్న బంగారు నగలపై కన్నేశాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎలాగైనా ఆ బంగారాన్ని తీసుకునేందుకు పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ నేల 5 వ తేదీన నాగమ్మ ను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టి బంగారం తీసుకుని అమ్మి జల్సాలు చేస్తూ ఏమి తెలియనట్లు నాటకం ఆడాడు. అయితే ఈ నెల 13 న ఇంటికి వచ్చిన నాగమ్మ కుమారుడు ఇంట్లో నాగమ్మ కనపడకపోవడంతో మొత్తం ఆరా తీసాడు. ఎక్కడా కనపడకపోవడంతో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాగా, విచారణలో భాగంగా వెంకటేష్ ని అదుపులోకి తీసుకొని తమ దైన శైలిలో విచారించగా బంగారం కోసం తన నాన్నమ్మను చంపిన విషయం చెప్పాడు. వెంకటేష్ పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి