కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న నిందితున్ని మదనపల్లి తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నందలూరుకు చెందిన పులి నవీన్ (38) కర్ణాటక నుంచి కర్ణాటక మద్యం తీసుకుని వస్తుండగా, మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో నిందితుడు మద్యంతో సహా పట్టుబడినట్లు తెలిపారు. పట్టుబడ్డ నిందితుని వద్ద రూ 20 వేల విలువ చేసే కర్ణాటక మధ్యం, కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. విచారణ అనంతరం అతనిపై అక్రమ మద్యం తరలింపు పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు.
Crime
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పామిడి మండలం అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు ల్యాండ్ ముటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ల్యాండ్ ముటేషన్ చేయాలంటే 10000 లంచం ఇవ్వాలని ఆర్ఐ క్రాంతి కుమార్ రైతును డిమాండ్ చేశాడు. దీంతో రైతు 6000 రూపాయలు బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఆర్ ఐ క్రాంతి కుమార్ రైతు నుండి 6000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్నిన ఎసిబి అధికారులు. ఆర్ ఐ క్రాంతి కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న 6 వేల రూపాయలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి ఏసిపి కోర్టు లో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసిపి ఏ. బాలాజీ, కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివరాలు తెలియపరుస్తూ
నిందితుల వివరాలు
- గంగులోత్ చంద్రశేఖర్ తండ్రి బాలు, వయస్సు 23 సంవత్సరాలు, గ్రామం కొండాపూర్, మండలం దూల్మిట్ట, జిల్లా సిద్దిపేట.
- అగుళ్ల శ్రీనివాస్ తండ్రి పోచయ్య, వయస్సు 36 సంవత్సరాలు, గ్రామం & మండలం కేశవపట్నం, జిల్లా కరీంనగర్.
- కడారి జలంధర్ తండ్రి పాపయ్య, వయస్సు 34 సంవత్సరాలు, గ్రామం & మండలం హుజురాబాద్, జిల్లా కరీంనగర్.
ఫిర్యాది చిట్టబోయిన బాబు తండ్రి పోచయ్య గ్రామం చిన్నకోడూర్ అతను వెలికట్ట గ్రామ శివారు శ్రీ సిద్ధి రియల్ ఎస్టేట్ వెంచర్లు తేదీ: 19-02-2024 నాడు సాయంత్రం తన యొక్క ఫ్లాట్ దగ్గరికి వెళ్లి చూడగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కరెంటు పోల్స్ కు ఉన్న అల్యూమినియం వైర్ ను కట్ చేసి దొంగలించుకుని పోయినారని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
కేసు పరిశోధనలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో వెలికట్టే X రోడ్డు వద్ద తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేయుచుండగా పై ముగ్గురు నిందితులు ఆటో TS02UA-8364 గల దానిలో అల్యూమినియం వైర్ వేసుకొని వెళ్ళుచుండగా అనుమానంతో ముగ్గురు నిందితులను పట్టుకుని విచారించగా అల్యూమినియం వైర్ దొంగలించినామని ఒప్పుకున్నారు.
పై ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ఎక్కడెక్కడ ఏ దొంగతనాలు చేసినారని విచారించగా ముద్దాయి గంగులోత్ చంద్రశేఖర్ గత కొన్ని రోజుల క్రితం నూతనంగా నిర్మించే ఇండ్లలో కరెంటు వైర్ ఫిటింగ్ చేస్తూ జీవించేవాడు. వచ్చే డబ్బులు తన యొక్క జల్సాలకు సరిపోనందున నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్ల వద్ద కరెంటు అల్యూమినియం వైర్ దొంగలించి అమ్ముతే ఎక్కువ డబ్బులు వస్తాయని నిర్ధారించుకొని తన స్నేహితులు అగుళ్ళ శ్రీనివాస్, కడారి జలంధర్ కు ఈ విషయము తెలియపరచగా వారు కూడా ఒప్పుకున్నారు. ముగ్గురు కలిసి కరెంట్ అల్యూమినియం వైర్ దొంగతనం చేద్దామని అమ్మితే వచ్చే డబ్బులతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకుని.
గుగులోత్ చంద్రశేఖర్ తన మోటార్ సైకిల్ నెంబర్ TS36N-2771 పైన ఎక్కడెక్కడ నూతనంగా నిర్మించిన వెంచర్లు ఉన్నాయో చూస్తూ ఉండేవాడు తరువాత ముగ్గురు కలిసి ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న వెంచర్లో అల్యూమినియం వైర్ కట్టర్ తో కట్ చేసి ఆటోలో వేసుకుని వెళ్ళినారు. వారం రోజుల క్రితం ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న వెంచర్లో కరెంటు కనెక్షన్ లేనిది గమనించి కట్టర్ తో కరెంటు స్తంభాలకు కల అల్యూమినియం వైరు కత్తిరించుకుని ఆటోలో వేసుకుని వెళ్లి జల్సాలకు డబ్బులు లేనందున అమ్ముదామని నిర్ణయించుకుని ప్రజ్ఞాపూర్ స్క్రాప్ దుకాణం యజమాని చేపట్టి వెంకటేష్ వద్దకు వెళ్లి అల్యూమినియం వైర్ అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలకు ఖర్చు పెట్టుకున్నారు.
మరో వారం రోజుల క్రితం ఆటో మోటార్ సైకిల్ పై వెళ్ళచ్చు కుకునూరు పల్లి మండలంలోని తిప్పారం వెళ్లే దారిలో నూతనంగా నిర్మించిన వెంచర్లో కరెంటు అల్యూమినియం వైరు దొంగలించుకొని అటోలో వేసుకొని వెళ్ళినారు. మరో నాలుగు రోజుల క్రితం మెదినిపూర్ గ్రామ శివారులో ఉన్న నూతన వెంచర్లో కరెంటు అల్యూమినియం వైర్ కట్టర్ తో కట్ చేసుకుని ఆటోలో వేసుకొని వెళ్లి సిద్దిపేట మనిషిసింగ్ స్క్రాప్ దుకాణం యజమాని అల్యూమినియం వైరు అమ్మి వచ్చిన డబ్బులు జల్సాలకు ఖర్చు చేసుకున్నారు.
తదనంతరం కుకునూరు పల్లి మండలం వెలికట్ట గ్రామ శివారులో ఉన్న వెంచర్లో కరెంటు అల్యూమినియం వైర్ దొంగలించారు. తరువాత ఎల్కతుర్తి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్లో కరెంట్ అల్యూమినియం వైర్ కట్ చేసి ఆటోలో వేసుకున్నారు. తరువాత మానకొండూర్ గ్రామ శివారులో రైతు వ్యవసాయ పొలాలు ట్రాన్స్ఫారం వద్ద కరెంటు పోల్స్ కు ఉన్న అల్యూమినియం వైర్లు కట్ చేసుకుని ఆటోలో వేసుకుని అల్యూమినియం వైర్ అమ్మడానికి ఈరోజు ప్రజ్ఞాపూర్ కు వెళ్లుచుండగా పోలీసులు పట్టుకొని 1280 కేజీల అల్యూమినియం కండక్టర్ వైర్, ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, రికవరీ చేసి పై నిందితులను కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరుగుతుంది. కేసు విచారణ కొనసాగుతుంది.
ఇది చదవండి:
ఇది చదవండి: రాజమండ్రి ఎంపీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident).. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి:
సంగారెడ్డి జిల్లాలో నాందేడ్ అఖోలా 161 వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఈ ఘటన అందోల్ మండలం మాసాన్ పల్లి హైవే బ్రిడ్జి కింద చోటుచేసుకుంది. జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు చాయ్ తాగేందుకు జోగిపేట నుండి కారులో ముందుగా చౌటకూర్ దాబాకు వచ్చారు. అక్కడ దాబా బంద్ ఉండడంతో అదే కారులో మాసన్ పల్లి వద్ద హైవే పక్కన హోటల్ వెళ్లి చాయ్ తాగారు. తిరిగి వెళ్తున్న క్రమంలో మాసాన్ పల్లి బ్రిడ్జి కింద కారు ఆపి వారు మూత్ర విసజ్జన చేస్తుండగా వెనకనుండి వచ్చిన టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
అయితే కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్న ముగ్గురు యువకులపై ఢీకొట్టిన టిప్పర్ లారీ మరియు కారు రెండు వారిపై వెళ్ళడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా జోగిపేటకు చెందిన మైనారిటీ యువకులు వీరంతా మెకానిక్ వర్క్ చేస్తుంటారు. మృతి చెందిన యువకులు జోగిపేటకు చెందిన వాజిద్ (28) హాజీ(28) బుక్రాన్ (29) కాగా మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా అతడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలు కావడంతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి వేళల్లో జోగిపేట పరిసర ప్రాంతా ఏరియాల్లో భారీగా అక్రమ మోరం రవాణా జరుగుతుంది.
అయితే కారును డికొట్టింది మోరం టిప్పర్ లారీ అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మర్చ్యూరికి తరలించారు. 161 వ జాతీయ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మొన్న రెండు రోజుల క్రితం ఇదే రహదారిపై సంగుపేట వద్ద కారు బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు కూడా 161 నేషనల్ హైవే బ్రిడ్జి కింద ప్రమాదం జరిగింది. 161 జాతీయ రహదారి గత కొంత కాలంగా రోడ్డుప్రమాదాలతో రక్తసిత్తమవుతుంది.
ఇది చదవండి: తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిత్తూరు జిల్లాలో ఏనుగులు సైర్వ విహారం చేస్తున్నాయి. కుప్పం మండలంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. అడవిలో నీరులేక పంటపొలాలను సర్వ నాశనం చేస్తున్నాయి. గజరాజులను అడవిలోకి మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ వేకువ జామున పైపాళ్యం గ్రామానికి చెందిన మునిరత్నంపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో రైతు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయడంతో కిందపడి గాయాలయ్యాయి. ప్రస్తుతం రైతు కుప్పం వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.
ఇది చదవండి: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రోడ్డు ప్రమాదం (Road Accident):
రామాపురం మండలం ఐరిస్ గ్రాండ్ హోటల్ సమీపంలో నిలబడి ఉన్న లారీని వెనుక వైపు నుంచి స్కూటర్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి రామాపురం మండలం సరస్వతి పల్లెకు చెందిన కృష్ణ బాబు వరుసకు చిన్నమ్మ అయిన గంగాభవాని కూతురు వినితలు కలిసి రాయచోటికి స్కూటరు పై వస్తుండగా ఐరిస్ గ్రాండ్ హోటల్ సమీపంలో లారీని ఢీ కొట్టి కృష్ణ బాబు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నమ్మ అయిన గంగాభవాని కూతురు వినిత ను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీబీఐ కి ఎమ్మెల్సీ కవిత లేఖ..!
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హత్యాయత్నం (Attempted murder):
కర్నూలు నగరంలో నిన్న రాత్రి బావమరుదుల పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రోజా వీధికి చెందిన ఉప్పరి పెద్ద మూర్తి, (25) ఉప్పరి సాయి(19) రాత్రి ఆటోలో గ్రంథాలయం వైపు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి దుండగులు పరారైయ్యారు. భాదితులను ఆసుపత్రికి తరలించగా బావమరిది ఉప్పరిసాయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెద్ద మూర్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)
16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident). ఆగివున్న లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ డీ కొట్టడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏలేశ్వరం మండలం చిన్నంపేట పాదాలమ్మ గుడి దగ్గర నలుగురు ని ఢీకొన్న బస్సు. నలుగురు అక్కడకక్కడే మృతి. లారీ టైర్ పంచర్ అవ్వడంతో టైర్ మారుస్తుండగా ఢీకొన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. మృతులు దాసరి ప్రసాదు, దాసరి కిషోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు లాగా గుర్తించిన పోలీసులు. మృతి చెందిన ముగ్గురూ బాపట్ల జిల్లా నక్క బొక్కల పాలెంకి చెందిన వారు. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడు. ప్రమాద స్థలం చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on :Facebook, Instagram&YouTube.
పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పులికొండ గ్రామానికి చెందిన వరదరాజులు కూతురును కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సత్యం నాయుడు కిడ్నాప్ చేశాడు. తన కూతురుకు ఆరోగ్యం బాగా లేకపోతే పత్తికొండలో వైద్యం చేయించడానికి ద్విచక్ర వాహనం పై వస్తున్న వరదరాజులును సత్యం నాయుడు మార్గ మధ్యలో స్కార్పియోతో ఢీ కొట్టి.. తుపాకీతో బెదిరించి వరదరాజులు కూతురును కిడ్నాప్‌కు యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకున్న వరద రాజులపై దాడి చేసి గాయపరిచాడు.దీంతో పత్తికొండ పోలీసులకు వరదరాజులు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అయితే వరదరాజులు కుమార్తె ఆచూకీ దొరికిందని ప్రసుత్తం యువతి క్షేమంగా ఉందని…కాగా సత్యం నాయుడు పరారీలో ఉన్నట్లు…కిడ్నాప్ చేసేందుకు వినియోగించిన స్కార్పియోను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి తుపాకిని కూడా స్వాధీనం పరుచుకుంటామన్నారు.
గుంటూరు, ఐపిఎస్ ఇంట్లో చోరీ (Robbery At IPS House)…
గుంటూరు(Guntur) నంభూరు శివారు ప్రాంతాల్లో అర్థరాత్రి దొంగ హల్ చల్. ఏకంగా ఐపిఎస్ ఇంట్లో చోరీ చేసిన ఘనుడు. బదిలీల్లో బాగంగా అనంతపురం వెళ్ళిన పోలీస్ ఉన్నత అధికారి అమిత్ బర్దర్. ఇంటి తాళం పగుల గొట్టి విలువైన వస్తువులు చోరీ చేసినట్లు గుర్తింపు. నిందితుడు మంగళగిరి కి చెందిన నిందితుడు గా విచారణ లో వెల్లడి. గతంలో నిందితుడు పై పలు స్టేషన్ కేసులు ఉన్నట్లు అంచనా. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on :Facebook, Instagram&YouTube.