ప్రకాశం జిల్లాలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా దోర్నాల లో వాసవి లాడ్జి పక్కన భవన నిర్మాణం కోసం గుంతల తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం రహదారిలో ఉన్నటువంటి పేక మెడల వాసవి లాడ్జి. పునాదులు బలహీన పడటం గ్రహించిన లాడ్జి నిర్వాహకులు ముందుగా లాడ్జి లో నుంచి అందరిని కాళీ చేపించారు. దీంతో తెల్లవారుజామున సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Crime
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి శివారు ఆర్యపేట గ్రామంలో కొబ్బరి గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వర కోకోనట్ కొబ్బరికాయల వ్యాపార యజమాని కొడవటి వెంకటేశ్వరరావు నిల్వ ఉంచిన కొబ్బరి గోదాములో రాత్రి ఆకస్మికమంగా మంటలు చెలరేగాయి. గోదాములో వేలాదిగా నిల్వ ఉంచిన కురిడి కొబ్బరికాయలకు నిప్పు అంటుకుని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. నాలుగు అంతస్తుల్లో నిల్వ చేసిన కొబ్బరికాయలు ఈ అగ్నిప్రమాదంలో మాడి మసైపోయాయి. మంటలు ధాటికి సమీపంలోని పలు కొబ్బరిచెట్లు కూడా దగ్ధమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పాలకొల్లు, రాజోలు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను కొంతమేరా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కోటి రూపాయల వరకు నష్టం వాటిని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేసానుపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటిముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అదే గ్రామానికి చెందిన షేక్ రఫీ అనే వ్యక్తి ఆటో నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి ఇంటి ముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. బాధితుడు మాట్లాడుతూ నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెట్రోలు పోసి, ఎవరో తగలబెట్టారని బాధితుడు తెలిపారు. మంటలు చెలరేగే సమయంలో స్థానికలు సమాచారం ఇవ్వటంతో అక్కడకు చేరుకుని మంటలని అదుపు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
కుప్పం నుండి బరుగూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు తమిళనాడు సరిహద్దు కనమూరు వద్ద ప్రమాదశాత్తు బోల్తా పడింది. తెల్లవారుజామున 5: 30 నిమిషాలకు కుప్పం ఆర్టీసీ డ్రైవర్ జై కుమార్ మలుపు తిరిగే సమయంలో బస్సు బోల్తా పడిందని డ్రైవర్ చెప్తున్నారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు కనకరాజు సంఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గ మెరుగైన 120 బస్సులను గ్రామాలకు తరలించారన్నారు. అయితే ఈ జగన్ ప్రభుత్వంలో కుప్పం డిపోలో ఉన్న మంచి బస్సులను పుంగునూరుకు మంత్రి పెద్దిరెడ్డి తరలించుకున్నారు. పుంగునూరు డిపోలో ఉన్న డొక్కు బస్సులు ను కుప్పం డిపోకు వేసి ప్రయాణికుల తో చలగాటమాడుతున్నారు. ఇకనైనా మెరుగైన బస్సులను కుప్పం డిపోకు వేయాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్టణం జిల్లాలో ఓ తహసీల్దార్ అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను ఆయన నివాసం వద్దే దుండగులు హత్య చేశారు. కొమ్మాదిలోని ఆయన నివసించే అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్న దుండగులు ఇనుప రాడ్డుతో ఆయన తలపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, భూ సమస్యల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్, ఉప్పల్ పీస్ పరిధి పరిసర ప్రాంతాల్లో 100కు పైగా సైకిళ్లు ఇతర సామాగ్రి చోరి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇళ్లలోకి దర్జాగా గేటు తీసుకొని ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు. దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరలొ రికార్డ్ అయ్యాయి. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, కోడి పందాల నిర్వహించే వారిపై కూచిపూడి పోలీసులు దాడి. చిన్నముతేవి గ్రామం నుండి అయ్యంకి గ్రామం వైపు వెళ్ళు కాలువ గట్టుపై కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు. 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కోళ్ళు, 23,200/-రూపాయల నగదు, 6 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూచిపూడి ఎస్సై సందీప్. కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి…నిద్రపోతున్న మున్సిపాలిటీ అధికారులు
వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు విడిచాడు. 20 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతిచెందాడు. కుక్క కాట్లకు గురైన ఓ చిన్నారి ఏడాది వయసులోనే కన్నుమూశాడు. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని కుక్కలు రోడ్డుపైకి లాక్కేలి మరీ చంపేశాయి. ఆ బాలుని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పటివరకూ తమతో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండడం చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ హృదయ విదారకర సంఘటన మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ కుటుంబంలో జరిగింది. సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో జీవితం సాగిస్తున్నాడు. పెద్దకుమారుడి పేరు నాగరాజు ఆ బాలుని వయస్సు ఏడాది. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నాగరాజును 20 కుక్కలు ఒకేసారి దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న సూర్యకుమార్ గానీ ఆ బాలుని తల్లిగానీ గమనించలేదు పడుకొని లేచి చూసిన సూర్య కుమార్ కు నాగరాజు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు కంగారు పడ్డారు. తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికిన ఎక్కడ కనిపించలేదు చివరకు రోడ్డుపై వచ్చి చూసేసరికి కుక్కలు లాక్కెళ్ళి చంపేసాయని గుర్తించారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో అనేకసార్లు కుక్కలు చిన్నారులపై దాడి చేసిన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు.