వేరొకరి ఆధార్ గుర్తింపుతో కారు అద్దెకు తీసుకుని ఉడాయించిన ఇద్దరిపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసిపి వై.వి. రావు కథనం ప్రకారం జహనుమకు చెందిన మహ్మద్ ఆమేర్ అలీ ఉద్యోగాన్వేషణలో భాగంగా ఓఎల్ఎక్స్లో ఆధార్ పత్రాన్ని అప్లోడ్ చేశాడు. బండ్లగూడకు చెందిన ఉస్మాన్అలీ, అమేర్అలీ ఆ ఆధార్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అందులో పేరు తన పేరుతో కలుస్తుండటంతో నిందితుల్లో ఒకరైన ఆమేర్అలీ జూమ్ కార్ లో మోహన్ రెడ్డి అనే యజమాని నుంచి కారు అద్దెకు తీసుకుని కనిపించకుండా పోయాడు. ఇటీవల కారు యజమాని మోహన్ రెడ్డి ఎస్సార్ నగర్ సమీపంలో నిందితుడిని చూసి వెంబడించాడు. దీంతో కారుతో వేగంగా దూసుకెళ్లిన ఆమేర్ అలీ పంజాగుట్ట ప్రాంతంలో కొందరిని ఢీకొట్టాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి తప్పించుకుపోయాడు. ఈ కేసులో, తన ఆధార్‌తోనే కారు అద్దెకు తీసుకుని చోరీ చేశారని బాధితుడైన మహ్మద్ ఆమెర్ అలీ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఆమేర్అలీ, ఉస్మాన్అలీ పై కేసు నమోదుచేశారు. వీరు మరి కొన్నిచోట్ల ఇలాగే కార్లు చోరీ చేసినట్లు తెలిపారు. Read Also..
Crime
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ముచ్చివోలు గ్రామంలో విషాదం..ఆగని మైనింగ్ మాఫియా ఆగడాలు…
మైనింగ్ మాఫియా ఆగడాలతో రెండు నిండు ప్రాణాలు బలి. నిద్రా వ్యవస్థలో అధికార యంత్రాంగం. చెరువుల్లో ఇష్టానుసారంగా వైసీపీ నాయకులు జెసిపిలు పెట్టి చెరువు మట్టిని తవ్వేస్తుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటూ ముచ్చివోలు గ్రామస్తులు మండిపడుతున్నారు
శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ముచ్చివోలు గ్రామంలో విషాద ఘటన గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తెలిసిన సమాచారం ప్రకారం పశువులు మేపడానికి రోజువారీ దినచర్యలో తల్లి రామలక్ష్మమ్మ వయసు 55, కుమార్తె మునిరత్నమ్మ 26 సోమవారం ఉదయం అసలు మేపడానికి సమీపంలోని చెరువు దగ్గరికి వెళ్లడంతో గ్రామానికి చెందిన తల్లి కుమార్తె మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే వారి తినుబండారాలు ఆహార పదార్థాలు చెరువు గట్టుమీద ఉండడంతో స్థానికులు గుర్తించి సమాచారం స్థానిక సచివాలయ వాలంటీర్లకు పోలీస్ సిబ్బందికి అందించిన కనీసం స్పందించలేదని గ్రామస్తులు వాయుపోయారు.
అయితే మృతి చెందిన మునరత్నమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. జీవనోపాధి కోసం గ్రామంలో పశువుల మేపుకుంటూ జీవనం సాగించుకుంటూ ఉన్నతరణంలో మైనింగ్ మాఫియా చెరువులో ఎక్కడపడితే అక్కడ మట్టి తరలించడంతో గుంతులు లోతు ఉండలేదని తెలియడంతో చేతులు కడుక్కొని దిగడంతో తల్లి కుమార్తెలు మృతిచెందండం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
దీనిపై రూరల్ పోలీసులు వివరణ అడగా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. సచివాలయ పోలీస్ వివరణ అడగ్గా పై అధికారులకు తెలిపామని వారి ఆదేశాల మేరకే కేసు నమోదు చేయడం జరుగుతుందని సచివాలయ పోలీస్ అధికారి అనూష తెలపడం విశేషం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్న శ్రీశైలం పోలీసులు. క్షేత్రంలోని టోల్గేట్ సమీపంలోని ఓ మహిళ ఇంట్లో లో 166 క్వాటర్ బాటిళ్లు స్వాధీనం. పక్కా సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మద్యం పట్టుకున్న పోలీసులు. మున్ననూర్ నుండి అక్రమ మద్యం తెచ్చిన మహిళ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు. క్షేత్రపరిధిలో నిబంధనలను అతిక్రమించి మద్యం, మాంసం తెస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: సిఐ ప్రసాదరావు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
విశాఖ జిల్లాలో దారుణ హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో చెన్నై వెళ్లిన బృందం.. గంగారావును అదుపులోకి తీసుకొని రాష్ట్రానికి తీసుకొచ్చింది. సీపీ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. స్థిరాస్తి లావాదేవీలే హత్యకు కారణం. నిందితుడి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశాం. హత్య చేసిన తర్వాత నిందితుడు విమానంలో విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాడు. తర్వాత చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తుంటే పట్టుకొని విశాఖ తీసుకొచ్చాం. గంగారావు ఓ స్థిరాస్తి సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడిపై హైదరాబాద్, విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది అని సీపీ వివరించారు. విశాఖ రెవెన్యూ అసోసియేషన్ వినతిపత్రం ఇచ్చిందని.. రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై కలెక్టర్‌తో చర్చించామని తెలిపారు. Read Also..
శ్రీ సత్య సాయి జిల్లా (Sri Sathya Sai Dist), పెనుకొండ ఆర్టిఓ చెక్ పోస్ట్ దగ్గర్లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత (Leopard) తలపై తీవ్ర గాయాలు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుత. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఘటన. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో చిరుత దగ్గరకు వెళ్ళని వాహనదారులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వాహనదారులు.
Read also SR Nagar – ఫేక్ ఆధార్ తో అద్దె కార్లు చోరీ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హైదరాబాద్ ( SR Nagar ) లో వేరొకరి ఆధార్ గుర్తింపుతో కారు అద్దెకు తీసుకుని ఉడాయించిన ఇద్దరి పై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసిపి వై.వి. రావు కథనం ప్రకారం జహనుమకు చెందిన మహ్మద్ ఆమేర్ అలీ ఉద్యోగాన్వేషణలో భాగంగా ఓఎల్ఎక్స్ లో ఆధార్ పత్రాన్ని అప్లోడ్ చేశాడు. బండ్లగూడకు చెందిన ఉస్మాన్అలీ, అమేర్అలీ ఆ ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో పేరు తన పేరుతో కలుస్తుండటంతో నిందితుల్లో ఒకరైన ఆమేర్అలీ జూమ్ కార్ లో మోహన్ రెడ్డి అనే యజమాని నుంచి కారు అద్దెకు తీసుకుని కనిపించకుండా పోయాడు. ఇటీవల కారు యజమాని మోహన్ రెడ్డి ఎస్సార్ నగర్ సమీపంలో నిందితుడిని చూసి వెంబడించాడు. దీంతో కారుతో వేగంగా దూసుకెళ్లిన ఆమేర్ అలీ పంజాగుట్ట ప్రాంతంలో కొందరిని ఢీకొట్టాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి తప్పించుకుపోయాడు. ఈ కేసులో, తన ఆధార్‌తోనే కారు అద్దెకు తీసుకుని చోరీ చేశారని బాధితుడైన మహ్మద్ ఆమెర్ అలీ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఆమేర్అలీ, ఉస్మాన్అలీ లపై కేసు నమోదు చేశారు. వీరు మరి కొన్నిచోట్ల ఇలాగే కార్లు చోరీ చేసినట్లు తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. కొంగర మల్లయ్య గట్టు మీద అనుమానస్పద స్థితిలో మహిళ హత్యకు గురైనంది. ఈ నెల 4వ తేదీ పెనుగంచిప్రోలు పియస్ లో భర్త పద్మాల సురేష్, భార్య త్రివేణి కనిపించడం లేదని త్రివేణి తండ్రి ఫిర్యదు చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ సుతారి మేస్త్రి పని చేస్తుంటాడని, మృతురాలు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నట్లు సమాచారం అందిదని పోలీసులు తెలిపారు. విజయవాడ హైదరాబాద్ హైవే పక్కన టోల్ ప్లాజా వద్ద కొంగర మల్లయ్య గట్టు పై మృతదేహం లభ్యమైందని తెలిపారు. భర్తే హత్య చేసి ఉంటడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. Read Also..
అనంతపురం జిల్లా సరిహద్దులోని చెరువు తాండా గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుంతకల్ మండలం మైనాపురం తండాకు చెందిన రంజిత్ నాయక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మైనాపురం తండా నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని కాంటారం గ్రామంలో డొంకా లక్ష్మి అనే మహిళ కు చెందిన పూరిల్లు దగ్ధం. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదవశాత్తు ఈ సంఘటన చోటు చేసుకుంది జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు, పాక పూర్తిగా దగ్ధం అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్న ఉప సర్పంచి కాళ్ల వనంబాబు, స్థానికులు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ఆదుకుంటామని చెప్పిన ఉప సర్పంచి వనంబాబు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటున్న పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థినుల హాస్టల్ గదిలో దొరికిన సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉంటూ భువనగిరిలోని పట్టణంలోని బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. అయితే శనివారం రోజున స్కూల్‌కు వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం హాస్టల్‌కు వచ్చారు. అయితే శనివారం సాయంత్రం భవ్య, వైష్ణవిలు మాత్రం ట్యూషన్‌కు వెళ్లలేదు. మిగిలిన విద్యార్థులు అడగగా.. తర్వాత వస్తామని చెప్పారు. అయితే వీరు ట్యూషన్‌కు రాకపోవడంతో ట్యూషన్ టీచర్.. వారిని తీసుకురావాలని ఇతర విద్యార్థినులను పంపించారు. అయితే వారు ఉన్న హాస్టల్ గది తలుపులు వేసి ఉండటంతో.. కిటికీలో నుంచి చూడగా.. వారు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. దీంతో విద్యార్థినులు వెంటనే ట్యూషన్ టీచర్‌కు ఈ విషయం చెప్పారు. ఈ ఘటనతో ఉలిక్కపడ్డ హాస్టల్ సిబ్బంది.. బలవంతంగా తలుపులు తీసి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్టుగా వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినుల గదిలో దొరికన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాము వెళ్లిపోతున్నందుకు అందరూ క్షమించాలని కోరారు. తాము చేయని తప్పుకు అందరూ మాటల అంటుంటే.. పడలేకపోతున్నామని పేర్కొన్నారు. తమను హాస్టల్ వార్డెన్ శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మడం లేదని వాపోయారు. తమ బాధ ఎవరికి చెప్పుకోలేక వెళ్లిపోతున్నామని…. తమను ఒకే దగ్గర సమాధి చేయండి.. ఇదే తమ ఆఖరి కోరిక అని సూసైడ్ నోట్లో భవ్య, వైష్ణవిలు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజను, ట్యూషన్ టీచర్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే హాస్టల్లో విద్యార్థినుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. భవ్య, వైష్ణవిలు తమను వేధింపులకు గురిచేస్తున్నారని అదే హాస్టల్లో ఉంటున్న జూనియర్ విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో.. హాస్టల్ సిబ్బంది వారిని మందలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనను వారు అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..మరోవైపు మృతులు ఇద్దర్ని హత్య చేసి..ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. Read Also..