యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మ కత్వ సమీపంలో పిలాయి పల్లి కాలువలో గుట్టు చప్పుడు కాకుండా వ్యర్థ రసాయనాలను పారబోస్తున్న ట్యాంకర్ ను పోచంపల్లి పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. వెంటనే ట్యాంకర్ డ్రైవర్ని విచారించగా హైదరాబాదు లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల నుండి వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల లో తెచ్చి పిలాయి పళ్లి కాలువలో పారబోస్తున్నట్లు పోలీసుల ప్రథమ విచారణ లో తేలింది. ఎవరికి అనుమానం రాకుండా పెట్రోల్ ట్యాంకర్ల లా పోలి ఉన్న ట్యాంకర్లలో వ్యర్థ రసాయనాలను తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ ను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసారు.
Crime
కడప జిల్లా.. జమ్మలమడుగులోని రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామం, రాజీవ్ కాలనీకి చెందిన మహబూబ్ బాషా(50) గా పోలీసులు నిర్ధారించారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య రెండు సంవత్సరాల క్రితం మృతి చెందగా.. ఇద్దరు కుమారులు మేనమామ వద్ద ఉన్నారు. ఆస్తికి సంబంధించిన వివాదమే ఈ హత్యకు దారితీసిందా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్.. క్లూస్టిం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉదయం పొలం పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లే సరికి మంట కనిపించడంతో వైర్లు దొంగలించేందుకు వచ్చారని వాళ్లపైకి వెళ్లడంతో అప్పటికే ఒక మగ శవాన్ని కాలుస్తున్న వారు వెంకటేశ్వరరావు ని కొట్టి ఆటోలో తీసుకుని పీడింగొయ్యి వద్ద పొలాల్లో వదిలి వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ పూర్తిగా కాల్చి ఉన్న శవం పక్కన వెంకటేశ్వరరావు చెప్పులు, ఫోన్, బండి చూసిన బంధువులు వెంకటేశ్వరరావు శవం గా భావించి చనిపోయాడు అని భావించారు. అనంతరం కొద్ది గంటల సమయం తరువాత వెంకటేశ్వరరావు వాళ్ళ భార్యకు ఫోన్ చేసి నేను బ్రతికె వున్నానని చెప్పేసరికి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నేరస్తులను పట్టుకుంటామని తెలిపారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో విధ్యుత్ శాఖ వారి నిర్లక్ష్యంతో కౌలురైతు దాసరి నాగేంద్ర కు చెందిన మూడెకరాల మినుము పైరు దగ్ధం అయింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు తెగి మంటలు చేలరేగి వరిగడ్డికి అంటుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. చేతికందిన మినుము పైరు కాలి బూడిదవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూమారు మూడు లక్షల అస్థి నష్ఠం జరిగింది.
Read Also..
అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బయలుదేరిన ఇన్నోవా కారు లోయలోకి దూసుకుపోవడంతో ఘోర రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులను స్థానిక అరుకు ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు అందరూ ఒకే కుటుంబంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం, మాధవధారకు చెందిన వారుగా గుర్తింపు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కలికిరి పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం కలికిరిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. కార్వేటినగరం మండలం, ఈదురు వారిపల్లికి చెందిన పెయింటర్ వెంకటేష్ కుమార్తె పవిత్ర అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం, కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ చదువుతోంది. హాస్టల్ గదిలో ఆమె ఉరి వేసుకుని మృతి చెందడంతో సహచరులు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. ప్రిన్సిపాల్ సమాచారం అందించడంతో వారు ఘటన స్థలము దగ్గర చేరుకునే మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఏసీపీ హరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. హిట్ అండ్ రన్ కేసులో ఐదు మందిని అరెస్ట్ చేశాము. A1 గా కొవ్వూరి రిత్విక్ రెడ్డి, A2 వైష్ణవి, A3 పొలుసాని లోకేశ్వర్ రావు, A4 బుల్లా అబిలాష్, A5 అనికేత్ అరెస్ట్ హిట్ రన్ కేసులో తారక్ రామ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు, ఏసు రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు పట్టుకుంటారనే భయం తో A1 రిత్విక్ రెడ్డి పరారు అయ్యాడు. కారును BHEL లో దాచి పెట్టారు. నిందితులు కోసం గాలించి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేశాము. రిత్విక్ రెడ్డి అమెజాన్ లో జాబ్ చేస్తున్నాడు, ఆఫీస్ చూపిస్తానని మిగిలిన ఫ్రెండ్స్ ను తీసుకెళ్లాడు. రిత్విక్ రెడ్డి మధ్యంలో ఉండి డ్రైవ్ చేశాడు, అలాగే మద్యం మత్తులో ఉన్నాడని తెలిసి కారూ లో ప్రయాణించారు. దీంతో కారులో ప్రయాణించిన వారిని కూడా నిందితులు గా చేర్చాము. ఈ హిట్ అండ్ రన్ కేసులో A1 రిత్విక్ రెడ్డి పై 304 ( 2) కింద కేసులు నమోదు చేశాము. దీంతో పాటు 337 ఐపీసీ, 337, 187 MV Act కింద కేసులు నమోదు చేశాము. తుకారం గేట్ వద్ద మద్యం కొనుగోలు చేశారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి పాని పూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారు జామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో మృతి చెందారు. చిన్నారులు తిన్న ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల మృతి చెంది వుండవచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందిన రామ కృష్ణ(10), విజయ్ (6) లు అని రూ.100 ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి ఉపాధి కోసం కుటుంబంతో జంగారెడ్డిగూడెం వచ్చారని బంధువులు తెలిపారు. చిన్నారుల మృతికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో మిరపకళాల్లో కుప్పబోసిన 20 క్వింటాల ఎండుమిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామనికి చెందిన ఢీకొండ. రమణ అనే రైతు తన పొలంలో పండిన మిర్చిని కల్లంలో ఆరబెట్టగా, మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. మూడు ఎకరాల మిర్చిని సాగు చేసిన రైతు.. నాలుగు లక్షల రూపాయల విలువ గల మిర్చికి నిప్పు అంటించారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం పట్టణంలోని ముక్కిడి పేటలో గల మున్సిపల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్ కు తెలపడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు అయితే మంటలు పెరిగిపోవడంతో పూర్తిగా దగ్ధమైంది మున్సిపల్ అధికారులు పరిశీలించి పాతయంత్ర సామాగ్రి, రీసైక్లింగ్ అట్టపెట్టెలు రేకుల షెడ్డు మొత్తంగా 16 నుండి 18 లక్షల వరకు హిందూపురం మున్సిపాలిటీకి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.