ప. గో. జిల్లా, పెనుగొండ జగన్నన్న కాలనీలో ఒక కుటుంబం పై మరొక కుటుంబ సభ్యుల దాడి. పక్కింటి నుంచి పొగ వస్తుందనే కారణంతో తల్లీ కొడుకులపై నలుగురు దాడి. విచక్షణ రహితంగా సుత్తి తో దాడి చేయడంతో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలు. ఇరు కుటుంబాలు పరస్పర దాడి కి దిగటం తో పరిస్థితి తీవ్రంగా మారింది. తల్లీ కొడుకులు ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు.
Crime
పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కోదాడకు చెందిన గంగినేని గణేశ్ (27) పదేళ్ల కిందట నగరానికి వచ్చి యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేశ్. ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది. ఆమె గర్భం దాల్చగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు. ఇదిలా ఉండగా వరంగల్‌కు చెందిన మరో యువతితో సుమారు ఏడేళ్లుగా గణేశ్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది. ఈ విషయం పై నిలదీసేందుకు ఈనెల 8న అతడి గదికి వెళ్లింది. అలాంటిదేమీ లేదని, పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ పగలగొట్టారు. ఈ ఘటనపై బాధితురాలు రెండురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా. నేరం అంగీకరించాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. బాధితురాలు బుధవారం మరో ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చింది. దీంతో గణేశ్‌తో పాటు ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అనధికార లావాదేవీల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ శాఖ మేనేజర్ గా పని చేసిన వ్యక్తి రూ.4.75 కోట్ల నిధుల స్వాహా. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్ డివిజన్లో ఉన్న SBI బ్యాంకులో ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ఖాతాదారులకు తెలియకుండా డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్. సుమారుగా 4.75 లక్షల రూపాయలు ఖాతాదారుల సొమ్ము కాజేసినట్లు పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఖాతాలోనే సుమారుగా 48 లక్షలు కాజేసినట్లు ఆ అమ్మాయి ఆరు నెలలుగా అడుగుతున్న ఇవ్వకపోవడంతో సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. ఖాతాదారుల నగదును మాయం చేసిన బ్యాంక్ మేనేజర్ తో పోలీసులు విచారణ చేపట్టారు. లక్షలాది రూపాయలు ఖాతాదారుల డిపాజిట్ నుంచి విత్ డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా, ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి. గోరంట్ల మండలం కనగానపల్లి లో ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని కాగానపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం రెండేళ్ల ధనుష్ అనే బాలుడి పై పిచ్చి కుక్క కరుస్తుండగా అడ్డు వెళ్లినటువంటి అవ్వ బురగ గంగులమ్మ తో పాటు మనుమరాలు గౌతమి ( 11) పై కూడా దాడి చేయడంతో గంగులమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో వెంటనే చుట్టు ప్రక్కల వారు పిచ్చి కుక్క ను తరిమివేసి, వెంటనే గాయపడిన వారిని గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినోద్ కుమార్ ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పల్నాడు జిల్లా ప్రవైట్ బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులు తాళేలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 7 లక్షల రూపాయలు విజయవాడ లోని ఓ ప్రవైట్ బ్యాంక్ లో లోను తీసుకున్న గొల్ల అజయ్ కుమార్( 25) రుణం క్రమం తప్పకుండా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ వచ్చాడు. అజయ్ 88 వేలు నవంబర్ నెలలో కూడా EMI బ్యాంకు వారికి చెల్లించాడు. ఆర్థిక ఇబ్బంది దృష్ట్యా డిసెంబర్ నెలలో EMI చెల్లించకపోవడంతో రోజుకి 40 నుంచి 50 సార్లు కాల్ చేసి EMI కట్టాలఅని బ్యాంక్ రికవరీ ఏజంట్లు తీవ్ర ఒత్తిడికి గురిచేయడంతో, తీవ్ర మానసిక వేదనకు గురైన అజయ్ దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ దాచేపల్లి మండలం నడికూడి గ్రామం లో ఘటన చోటుచేసుకుంది. దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు వద్ద గల సూపియాన్ కట్టే మిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. జనావాసాల మధ్యనే కట్టే మిషన్ దుకాణం ఉండడంతో ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటివరకు ఎగిసిపడిన మంటలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది .కాలిపోయిన కర్ర విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. రెబ్బన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో బస్సులో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్ స్కూల్ కు చెందిన బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో, కొండపల్లి గ్రామంలో కొంత మంది పిల్లలను దింపాల్సి ఉండటంతో రాంగ్ రూట్ లో వెళ్లారు. దీంతో ఎదురుగా వస్తున్న లారీ – బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులను కాగజ్ నగర్ కు, మరికొంతమంది విద్యార్థులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెద్దపల్ల వద్ద ఆర్ అండ్ బి రోడ్డు పై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆలమూరు ఎస్సై ఎల్ శ్రీను నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన ఈతకోట శ్రీనివాసరావు (45) ఎలక్ట్రికల్ స్కూటీ పై వెదురుమూడి వైపు నుండి కొత్తూరు సెంటర్ వైపు వెళ్ళుచుండగా మార్గమద్యంలో పెదపల్ల కోళ్ళ ఫారం సమీపంలో వెనుక నుండి లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈతకోట శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి తరలించారు.
ఇటీవల కాలంలో ప్రైవేట్ నెట్ వర్క్ సంబంధించిన కేబుల్ నెట్వర్క్ వైర్ తెగిపడి దానికి విధ్యుత్ ప్రవహించిగా అది మేనేజర్ కి తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ కేసు విషయం లో కేబుల్ కి సంబంధించిన మేనేజర్ స్థాయి ఉద్యోగి ని బ్యాంకు మేనేజర్ మృతి కి కారణం గనుక మాకేంటి అని సుచాయగా అడిగారు. ఇందులో కానిస్టేబుల్ ప్రసాద్ డబ్బా రైటర్ గా వ్యవహరిస్తూ ఉండడం తో కేబుల్ కు సంబంధించిన మేనేజర్ ను రెండు లక్షలు లంచంగా ఇస్తే మీకు అనుకూలం గా కేసు వ్రాస్తాను అని చెప్పాడు. అంత మొత్తం లో మేము ఇచ్చుకోలేము అని చెప్పగా చివరకు ఇరవై ఐదువేలు కు ఒప్పుకున్నారు. ఈ లంచం సొమ్ము ఎవరికి అని అడుగగా ఎస్సై వెంకట రమణ కు అని చెప్పాడు. ఈ రోజు రాజమండ్రి ఏసీబీ అధికారులను కేబుల్ మేనేజర్ సంప్రదించగా సాయంత్రం వారు ఆధ్వర్యం లో కెమికల్ పూసిన ఐదు వందలు నోట్లు ఇచ్చి స్టేషన్ కి కేబుల్ మేనేజర్ ఉద్యోగిని వెళ్ళమనగా, ఎస్సై వస్తారు అని కానిస్టేబుల్ ప్రసాద్ చెప్పాడు. కొద్దిసేపటికి ఎస్సై వెంకటరమణ స్టేషన్ కు రాగ, కేబుల్ మేనేజర్ రసాయనం పూసిన నోట్ల ను కానిస్టేబుల్ ప్రసాద్ కు ఇవ్వగా కానిస్టేబుల్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. పధకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి చేసి, రసాయనం ముట్టుకున్నా చేతులను కడిగి నిర్ధారించుకుని కానిస్టేబుల్ ప్రసాద్, ఎస్సై వెంకట రమణ లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రవేట్ కంపెనీలో పనిచేస్తున్న బూడిద పాటి ప్రవీణ్ కుమార్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతుడి ఆత్మహత్య కు వివరాలు తెలియాల్సి ఉంది. నోట్లో గుడ్డలు కుక్కి ఉండడంతో తమ కుమారుడి మృతి పై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పక్కనే ప్రైవేట్ కంపెనీలో పనిచేసి జీవనం సాగిస్తున్నారు. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం రాగానే కుమారుడు శవమై వేలాడుతూ ఉండడం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతేదేహాన్ని స్థానిక పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.