ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు భూతల దాడులు మొదలైనప్పటి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. మరో వైపు అంతర్జాతీయ సమాజం క్రమంగా విచక్షణా రహిత దాడులను నిరసిస్తూ దూరమవుతోంది. ఈ ఘటనలు ఆ దేశానికి మింగుడు పడనివే. గాజాపై వైమానిక దాడుల విషయంలో ఇజ్రాయెల్ ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టిగానే హెచ్చరించారు. పౌర మరణాలను తగ్గించకపోతే ప్రపంచ దేశాల మద్ధతు కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. మరోచోట ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 115 మంది ఇజ్రాయెల్ సైనికులు యుద్ధంలో మరణించారు.
Crime
నెల్లూరులోని, దేవ రెడ్డి వారి వీధి లో బంగారు దుకాణ యజమాని విమల్ జైన్ ఇంట్లో భారీ దోపిడి. యజమాని ఇంట్లో ఉండగానే లోపలికి జొరబడి దోపిడీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు. దంపతులు బంధించి బీరువాలోని బంగారు నగలను దోచుకెళ్లినట్లు సమాచారం. 100 కి కాల్ చేసిన కుటుంబ సభ్యులు. ఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపు చర్యచేపట్టిన పోలీసులు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు ఎమ్మార్వో కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన సత్యవాణి, మన్మోహన్ అను వారు ఇటీవల పోలవరం గ్రామం లో 738/1 సర్వే నెం లో 88 సెంట్లు ఎర్రచందనం మొక్కలు ఉన్న పొలంను కొనుగోలు చేయగా ఆ పొలం ను కన్వర్షన్ చేయమని విఆర్వో రవిశంకర్ ను కోరారు. విఆర్వో 40 వేలు లంచం డిమాండ్ చేయగా వారు అంత డబ్బులు ఇవ్వలేం అని తెలపటంతో విఆర్వో రవిశంకర్ 35 వేలు ఇస్తేనే చేస్తా లేకుంటే లేదని అనడంతో వారికి ఏం చెయ్యాలో తెలియక ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డిఎస్పీ వల్లూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతుల వేషం లో ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ సిబ్బంది 35 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నమని ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తెలిపారు. విఆర్వో ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తామని తెలిపారు.
ప్రకాశం జిల్లా.. పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోలేరో వావానం , బైక్ డీ కొని తండ్రి, కుమారుడు, అక్కడక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. కురిచేడు మండలం నాయుడు పల్లి పంచాయతీ సంఘం గ్రామానికి చెందినవారుగా గుర్తింపు, స్వగ్రామం నుండి మార్కాపురం వచ్చి గ్రామంకు తిరిగి వెళ్లే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also….
Read Also….
పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also..
Read Also..
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది, అప్పు చెల్లించలేదని తిరుమలేష్ అనే వ్యక్తిని గదిలో బంధించారు. డిపికి చెందిన బుజ్జి అనే వ్యక్తి మూడురోజులుగా గదిలో బంధించి వేధింపులకు గురి చేశారని తిరుమలేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదని మండిపడ్డారు. మూడురోజులుగా అన్నం పెట్టకుండా కొట్టారని తిరుమలేష్ కన్నీటి పర్యంతమయ్యాడు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామ శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది, ప్రమాదానికి గురైన లారీని వరుసగా మరో ఆరు లారీలు ఢీకొట్టడం తో నలుగురు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా అమానుష ఘటన చోటుచేసుకుంది. బైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన. నాలుగు వానరాలను చంపి కాల్చి వండుకొని తింటున్న నలుగురిని పట్టుకున్న గ్రామస్తులు, వారి వద్ద లభించిన కాల్చిన వానరం తల,కళ్ళు,చేతులు. వారిని పట్టుకొని నిలదీయడంతో నిజం ఒప్పుకున్న వ్యక్తులు. తాము పూజించే వనారాన్ని ఎందుకు చంపారు అని పట్టుకున్న గ్రామస్తులు.
పార్వతిపురం మన్యం జిల్లా. నర్సిపురం గ్రామంలో అగ్నిప్రమాదం. పెద్ద వీధిలో మాచర్ల శ్రీరాములు గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు. ఇంటి నుంచి భారీ మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి.. సమాచారం అందించిన గ్రామస్తులు. సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధం.
అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గo అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో పశువుల వైద్యశాలలో సిబ్బంది నిర్వాకం బయటపడింది. పశువులకు ఇచ్చే నుశిపురుగు నివారణ కోసం ఇచ్చే మందు వికటించి నాలుగు పశువులు మృతి చెందినట్లు బాధితుడు ఆరోపించాడు. గత నాలుగు సంవత్సరాల నుండి పశువైద్యశాలలో వైద్యడు లేడు. ఆసుపత్రి వద్ద పాడి రైతులు నిరసన వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అర్భాటంగా ప్రారంభించిన పశువులకు అత్యవసర చికిత్స అందించేందుకు ప్రారంభించిన 1962 అంబులెన్స్ కు డ్రైవర్ లేకపోడంతో వైద్యశాల ఆవరణలో వాహనం నిర్వీర్యంగా పడి ఉంది. పాడి పశువులు చనిపోవడంతో పెదలంక గ్రామానికి చెందిన పాడి రైతులు లబోదిబోమంటున్నారు. డా.వై.యస్.అర్.సంచార పశు ఆరోగ్య సేవ వాహనం మూలాన పడి వేశారు.