Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్..

పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్..

by Satya
Derailed Charminar Express

హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. రైలు ఇంజన్ ప్లాట్ ఫాం సైడ్ వాల్ ను ఢీ కొట్టిందని చెప్పారు. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఓ అంచనాకు రాలేదని తెలిపారు. స్టేషన్ ప్లాట్ ఫాం రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇంజిన్ తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: