సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన ఆరో శతాబ్దం నాటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం లో మహాశివరాత్రిని పురస్కరించుకొని నేటి నుండి ఉత్సవాలు మొదలయ్యాయి. మహాశివరాత్రి ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి శశిధర్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, క్యూ లైన్ లో భక్తులకు మంచినీటి సౌకర్యం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐదు రోజుల పాటు నిర్వహించే జాతరకు సుమారు 5 లక్షల మంది స్వామివారికి దర్శించుకోనున్నారని అన్నారు.
Devotional
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రంప గ్రామంలో అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివరాత్రి మహోత్సవాలు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు 12వ శతాబ్దానికి చెందిన దేవాలయం ఇది చోళ రాజులు పరిపాలించినప్పుడు ఈ దేవాలయం నిర్మించబడింది. అంతేకాకుండా ఈ దేవాలయం అల్లూరి సీతారామరాజు ఇక్కడ పూజలు నిర్వహించి తన స్వతంత్ర యాత్రను ఈ మన్యంలో కొనసాగించారని ఇక్కడ పెద్దలు అంటారు. అంతేకాకుండా ప్రతి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి ఈ పురాతన శివాలయాన్ని సందర్శించడానికి భక్తులు శివరాత్రి రోజు వస్తారు. సుమారు శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని వేళలో భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అంతేకాకుండా భక్తుల కోర్కెలను నెరవేరిచే దైవంగా ఇక్కడ మన్యం ప్రజలు కొలుస్తారు.
వేములవాడ రాజన్న (Vemulawada Rajanna Temple) గుడికి పోటెత్తుతున్న భక్తులు
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువబడుతున్న వేములాడ రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు నుంచి ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాల్లో అధికార యంత్రాంగం ఉంది. భక్తులకు రాజన్న లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్చార్జీలు రెండురోజులుగా పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం ఉన్న లేబర్‌కు తోడు మరింత మందిని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గోదాంలోని ఓ గది నిండా ట్రేలలో తయారు చేసిన లడ్డూలు సిద్ధం చేశారు. 2 లక్షల 50 వేల లడ్డూలు సిద్ధం, 10 క్వింటాల పులిహోర చేసి ఉంచుతామని, 7, 8, 9 తేదీల్లోనూ భక్తుల రద్దీని బట్టి మరో లక్ష లడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత శివరాత్రి జాతరలో 3 లక్షల పైగా లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాజన్న లడ్డూ ప్రసాదం రుచిగా ఉండేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ అందుకు అనుగుణంగా దిక్టం (ప్రసాదాల్లో వాడే వస్తువుల కొలతలు) రూపొందించింది. దీని ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన శనగపప్పు, కాజు, మిష్రి, కిస్మిస్, బాదాం, యాలకులతో పాటు సుగంధ ద్రవ్యాలను సైతం ఇందులో పొందుపరుస్తుండటంతో రాజన్న లడ్డూ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మార్కెట్లో చక్కెర ధర అధికంగా ఉన్నా భక్తులకు తక్కువ ధరకే లడ్డూ ప్రసాదం అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర దేవాదాయశాఖ రూ.20కు ఒక లడ్డూ చొప్పున విక్రయించాలని ఆదేశించింది. ఆమేరకు ప్రసాదాల విక్రయాల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్‌కు చేరుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
ఇది చదవండి: బుల్లెట్ మంత్రిగా మారిన అంబటి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
మహాశివరాత్రి (Mahashivratri) :
మహాశివరాత్రి (Mahashivratri) సందర్భంగా కాకినాడ జిల్లాలోని పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ బుధవారం నుంచి 11వ తేదీ సోమవారం వరకూ మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళ నీలకంఠం తెలిపారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకార్యార్థం అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈవో నీలకంఠం మీడియాతో మాట్లాడుతూ 6వ తేదీ బుధవారం ఉదయం 9.25 గంటలకు విగ్నేశ్వర పూజ, అంకురార్పనతో మహా శివరాత్రి పూజలు ప్రారంభిస్తుండగా రాత్రి 9.20 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణం జరగనున్నట్టు చెప్పారు. అలాగే 7వ తేదీన స్వామి వారికి, అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, సాయంత్రం నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించనున్నట్టు చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ముఖ్యంగా 8వ తేదీ మహా శివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారు జాము ఒంటి గంట నుంచి స్వామివారి మూల విరాట్ నందు అభిషేక పూజలు జరగనున్నట్టు చెప్పారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భావ కాల పూజ, పిఠాపురం రాజా వారి గోత్ర నామాలతో నిర్వహించనున్నట్లు చెప్పారు. 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి స్వామివారి రధోత్సవం కన్నుల పండుగగా పుర వీదుల్లో నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. 10వ తేదీన స్వామివారికి, అమ్మవారికి త్రిసూల స్నానం, తీర్దపు సేవ నిర్వహించనున్నట్టు చెప్పారు. తదుపరి 11వ తేదీ సోమవారం రాత్రి 7.45 గంటల నుంచి స్వామి వారికి, అమ్మవారికి శ్రీ పుష్ప యోగోత్సవం పూజలు ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పూజాలతో ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారి నీలకంఠం వివరించారు. అలాగే ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కాగా మహా శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రానుండడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, సేవా కార్యక్రమాలు, భారీ బందోబస్తు, స్వచ్ఛంద సంస్థల సేవలు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నీలకంఠం తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు పూర్తయింది. మొత్తం 540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించారు. హుండీల ద్వారా రూ.13కోట్ల25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2022 మేడారం జాతర కంటే ఈ ఏడాది జాతరకు రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజుల పాటు మేడారం హుండీలను లెక్కించారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరిగింది. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నోట్లు, కాయిన్స్ కలిపి మొత్తం 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు వచ్చాయి. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి వచ్చింది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కోలాటాలు డమరక నాధాలు పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు. గంగాధర మండపం వద్ద పుష్పపల్లకిలో ఉన్న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి అనంతరం అంకాలమ్మ గుడి, నంది మండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. పుష్ప పల్లకిపై ఉన్న శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. శ్రీశైల క్షేత్రమంత శివనామస్మరణతో మారు మ్రోగింది. పుష్ప పల్లకి సేవలో ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్టు బోర్డ్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీ కామాక్షింబ సమేత పరాశర్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులు పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాంలో స్వామి అమ్మవార్లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ రామచంద్రారెడ్డి సూచనలతో మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మహాశివరాత్రి రోజు ఉదయం రెండు గంటల 30 నిమిషాలకు ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తామని, స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించిన, అనంతరం ఐదు గంటలకు సర్వదర్శనం, మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ప్రత్యేక ప్రదోష అభిషేకం ఉంటుందని, కావున భక్తులందరూ స్వామి, ఆమ్మవారిని దర్శించుకొని, వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలను మంచి నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కోటప్ప కొండ (Kotappakonda) :
పల్నాడు జిల్లా, నరసరావు పేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్ప కొండ శైవక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు. ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవక్షేత్రాలలో కోటప్ప కొండ శైవక్షేత్రం ఒకటిగా విరజిల్లుతుంది. త్రికుటచల నామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు. పావన కృష్ణ నది తీరాన దక్షిణ భాగాన యల్లమంద, కొండకావురు మధ్య గల పర్వత రాజే ఈ త్రికుటచలం.
ప్రతి ఏడాది కోటప్ప కొండ తిరినాళ్లకు లక్షలాది మంది భక్తుల రాకతో కోటప్పకొండ శివనామ స్పరణతో మారుమోగుతుంది. కోటప్ప కొండలో నిర్వహించే మహా శివరాత్రి తిరునాళ్ల 2008 లో రాష్ట పండుగ హోదా సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం అనేకమంది భక్తులు కోటప్ప కొండ తిరినాళ్లకు తరలి వస్తారు. వేసిన పంట చేతికి రావాలని రైతులు, కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చే వారు ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందంటే త్రికుతాచలేశ్వరుడి మహత్యం ఏపాటిదో అర్ధం అవుతుంది. అడుగడుగునా శివ నామస్మరణతో కోటప్ప కొండ ఆలయం నిత్యం మారుమ్రోగుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరినాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన కోటప్ప కొండ తిరునాళ్లకు సంబంధించి రివ్యూ మీటింగ్ లో అన్ని శాఖల సమన్వయంతో పని చేసేందుకు కలెక్టర్ శివ శంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు. తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3000 వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిసి కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాట్లు చేస్తున్నారు కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువ భాగం నుండి కొండ పైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు తెలిపారు.
స్వామి వారి దర్శనార్థం కొండకు వచ్చే భక్తుల కోసం మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈ వో గొల్లమారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి మంచి నీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. అదే విధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు, పాలు సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలి వేంద్రాలు అలాగే ఘాటు రోడ్డు నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2 లక్ష 50 వేల లడ్లు, 1 లక్ష అరిసెలు సిద్ధం చేశామని ఆలయ ఈ వో తెలియచేసారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి…
మహా శివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచ హారతులు, మహా నివేదనములు, అష్టోత్తరములు, దీపోత్సవములతో స్వామి వారికి పండుగ నాడు పూజలు నిర్వహిస్తారని ఆలయ ఆర్చకులు తెలిపారు. పండుగ నాడు త్రికోటేశ్వరుని ప్రీతి ఐన ప్రభలతో అనేక గ్రామాల నుండి భక్తులు చేరుకో కోటయ్య అంటూ కోటప్ప కొండకు తరలి వస్తారు. పండుగ నాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు, అనేక రకముల వినోద భరిత ప్రదర్శనలతో కోటప్ప కొండ తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతాయి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి పంచారామక్షేత్రాల లో ఒక్కటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. రామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలైన్లు ఏర్పాటు చేశామని, భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలతో పాటు చిన్న పిల్లలకు పాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వామి వారికి ప్రత్యేక పూజలతో రుద్రాభిషేకం, స్వామివార్ల గ్రామోత్సవము, శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి పాంచాహ్నిక దీక్షా కళ్యాణ మహోత్సవము, రధోత్సవము, తెప్పోత్సవము జరుగుతాయన్నారు. భక్తులంతా పాల్గొని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆశీస్సులు పొందాలన్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు(Shivratri Brahmotsavam)
శ్రీశైల మహాక్షేత్రంలో(Srisailam temple) బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలి వస్తారన్న అంచనాతో ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. బ్రహోత్సవాల సందర్భంగా స్వామి వారి ప్రసాదం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో దేవస్థానం సుమారు 35 లక్షల లడ్డులను అందుబాటులో సిద్ధం చేస్తున్నట్లు ఆలయం అధికారులు తెలిపారు. మల్లన్న భక్తులందరికి అడిగినన్ని లడ్డూ ప్రసాదాలు ఇచ్చేందుకు అధికారులు రోజు వారీగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
లడ్డు తయారీ కోసం దేవస్థానం సిబ్బందినే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లడ్డు తయారీకి సుమారు 200 మంది సిబ్బందిని పిలిపించి,రోజుకు సుమారు 3 లక్షల లడ్డూలు చొప్పున తయారు చేయిస్తున్నారు.ప్రస్తుతానికి సుమారు 24 లక్షల లడ్డులను సిద్ధం చేయగా. అందులో 15 లక్షల లడ్డులు ఇప్పటికే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు భక్తులు కొనుగోలు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం 35 లక్షల లడ్డూలు తయారు చేయాలని నిర్ణయించారు. అలాగే లడ్డు విక్రయ కేంద్రాలు మొత్తం 20 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు ఏర్పాటు చేసి రద్దీని బట్టి క్షేత్రంలో పలుచోట్ల ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని అలానే ప్రత్యేకంగా 3 కౌంటర్లు మహిళలు,దివ్యాంగులకు అందుబాటులో ఉంచమన్నారు ఆలయ ఈవో పెద్దిరాజు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి