Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Film “నేను-కీర్తన” ఫస్ట్ లుక్ & టీజర్ విడుదల..!

“నేను-కీర్తన” ఫస్ట్ లుక్ & టీజర్ విడుదల..!

by Prakash
Nenu-Kirtana


చిమటా ప్రొడక్షన్స్ “నేను-కీర్తన”(Nenu-Kirtana) ఫస్ట్ లుక్ & టీజర్ విడుదల!!

టీజర్ చూస్తుంటే కొత్త దర్శకుడితో కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)కి చాలా మంచి భవిష్యత్ ఉందని “నేను-కీర్తన”(Nenu-Kirtana) ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టి. ప్రసన్నకుమార్, వీరశంకర్, యాటా సత్యనారాయణ అన్నారు.

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరో హీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, “రజాకర్” దర్శకుడు యాటా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హీరోగా “చిమటా రమేష్ బాబు”(సి.హెచ్.ఆర్)కి ఉజ్వల భవిష్యత్ – అతిధుల అభిలాష

చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) రూపంలో ఓ మల్టీ టాలెంటెడ్ హీరో తెలుగు తెరకు పరిచయమవుతుండడం సంతోషదాయకమని, ఫస్ట్ లుక్ లో, టీజర్ లో సక్సెస్ కళ ప్రస్పుటంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. “నేను-కీర్తన” చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించానని, ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రంగా మలచిన “నేను-కీర్తన” చిత్రం కచ్చితంగా చేరుతుందని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది చదవండి : న్యూ లుక్ లో కనిపించబోతున్న న‌వ‌దీప్ 2.O ల‌వ్, మౌళి…


ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా …
ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది …
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి..
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నేడు ఫిలింనగర్ లోని …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018665
Total views : 89129

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.