Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Film ఫ్యామిలీ స్టార్ మూవీ కి క్లీన్ యూ సర్టిఫికెట్…

ఫ్యామిలీ స్టార్ మూవీ కి క్లీన్ యూ సర్టిఫికెట్…

by Prakash
Family star Movie


సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”మూవీ (Family star Movie)..

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా (Family star Movie) మరికొద్ది గంటల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ దక్కింది. 2 గంటల 30 నిమిషాల నిడివితో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఫ్యామిలీ స్టార్ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే పాజిటివ్ వైబ్స్ అంతటా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

2 గంటల 30 నిమిషాల నిడివితో అలరించనున్న హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్..

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు ఘనంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

ఇది చదవండి : అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుష్ప‌-2 ది రూల్ టీజర్ విడుద‌ల..

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223701

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: