దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్ .పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 18వ ఇన్‌స్టాల్ మెంట్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి నుంచే పిఎం కిసాన్ పథకం డబ్బులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకు 2 వేల చొప్పున కేంద్రం తరపున ఆర్థిక సాయం జమ అయ్యింది. ఈ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం కేంద్రం 20 వేల కోట్ల నిధి కేటాయించింది. దేశవ్యాప్తంగా సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో 2018లో ఎన్డీఏ సర్కారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతీ సంవత్సరం సన్నకారు రైతులకు ఏడాదిలో ఒక్కో విడతకు 2 వేల చొప్పున మొత్తం మూడు విడతల కింద 6 వేల ఆర్థిక సహాయం అందించడం ఈ పిఎం కిసాన్ పథకం ముఖ్య ఉద్దేశం. పిఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 17 విడతల్లో ఆర్థిక సాయం అందించారు. నేటితో రైతుల ఖాతాల్లో 18వ విడత పెట్టుబడి సాయం డబ్బులు జమ అయ్యాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 79333