Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Health తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..!

తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..!

by Satya
Joint pain

కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించక పోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందక పోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్-డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదని, సమతుల ఆహారంతో కీళ్లనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి నొప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: