తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలా 5రోజులు కురుస్తాయని చెప్పింది. అయితే ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. అర్థరాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉదయం 8 తర్వాత ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర, కాకినాడలో మోస్తరు వర్షం పడుతుంది. ఉదయం 10 తర్వాత హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వాన పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది రోజంతా కంటిన్యూ అవుతుందని పేర్కొంది. ఇక సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షం పడుతుంది. సాయంత్రం 5 లేదా 6 తర్వాత ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో గంటకు 11 నుంచి 12కిలోమీటర్ల వేగంతో గాలి ఉంటుందని..వర్షం పడే సమయంలో గాలులు వేగం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి