Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ

by Rama
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. పైగా ఈరోజు సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు స్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
    తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
  • నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
    నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
  • రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..
    ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

013933
Total views : 78519

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.