Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home International చైనాలో భారీ భూకంపం

చైనాలో భారీ భూకంపం

by Satya
Huge earthquake in China

చైనాలో భారీ భూకంపం సంభవించింది. పలు భవనాలు నేలమట్టం కావడంతో 111 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రిక్కర్ స్కేలు పై దీని తీవ్రత 6.2గా నమోదయ్యింది. డిసెంబర్ 18 రాత్రి చైనాలోని కింగ్ హై ప్రావిన్స్ లో గన్స్ లో భూకంపం సంబవించినట్లు అక్కడి మీడియా తెలిపింది. భూకంపం దాటికి చాలా భవనాలు కూలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న చైనా రెస్క్యూ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల 23 మంది గాయపడ్డారు. భవనాలు కుప్పకూలిపోయాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: