Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home National భగవంత్‌ సింగ్‌ మాన్‌ కీలక వ్యాఖ్యలు..!

భగవంత్‌ సింగ్‌ మాన్‌ కీలక వ్యాఖ్యలు..!

by Satya
Bhagwant Singh Man and Arvind Kejriwal

కోర్టు(Court) అనుమతిస్తే.. జైల్లోనే సీఎం కార్యాలయం..

జైలు నుంచే ఢిల్లీ(Delhi) సీఎంగా అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పరిపాలనను కొనసాగిస్తారని ఆప్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం సాయంత్రం ఆప్ సీనియర్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌(Bhagwant Singh Man) అదే తరహా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కేజ్రీవాల్‌ విడుదలయ్యే దాకా జైలు నుంచే ఢిల్లీని పరిపాలిస్తారు. జైల్లో సీఎం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’’ అని ఆయన చెప్పారు.‘‘జైలు నుంచి ముఖ్యమంత్రి పరిపాలన చేయకూడదని ఎక్కడా చెప్పలేదు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

అయితే జైలుకు వెళ్లినంత మాత్రాన ఏ వ్యక్తి కూడా నేరస్థుడు కాడని చట్టం చెబుతోంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటు చేయించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’’ అని భగవంత్‌ మాన్‌ తెలిపారు. ఆమ్‌ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్‌ స్థానాన్ని ఏ ఒక్కరూ భర్తీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. ఇక కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేయడం సాధ్యమయ్యే విషయమేనని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఇది చదవండి: భారత్‌తో సయోధ్యకు వచ్చిన మాల్దీవులు..


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: