Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News యుద్ధం ఆపేసినట్టు అమెరికా కాంగ్రెస్‍కు వెల్లడి ..

యుద్ధం ఆపేసినట్టు అమెరికా కాంగ్రెస్‍కు వెల్లడి ..

by CVR NEWS
యూరోపియన్‌ యూనియన్‌పై ట్రంప్‌ సుంకాల మోత

ఇరాన్ తో యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేసినట్లు వైట్ హౌస్ తాజాగా వెల్లడించింది. యుద్ధం నిలిపివేసినట్లు అమెరికా కాంగ్రెస్ కు కూడా సమాచారం అందించింది. 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యుద్ధం కొనసాగించాలంటే, వారు ప్రారంభమైన 60 రోజుల్లో కాంగ్రెస్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అయితే ఆ గడువు నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేసినట్లు వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా చేసిన ప్రకటన వైరల్ గా మారింది. ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయిల్ తన అత్యాధునిక ఐరన్ బీమ్ లేజర్ ఆయుధాన్ని యూఏఈ కి పంపినట్లు తెలుస్తోంది. డ్రోన్లు, క్షిప‌ణులను క్షణాల్లోనే కరిగించే శక్తి ఈ లేజర్ సిస్టంకు ఉంటుంది. అబ్రహం ఒప్పందం తర్వాత ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో జరిగిన అతిపెద్ద సహకారం ఇదే. ఐరన్ డోమ్ తో పాటు స్పెక్ట్రో అనే నిఘా వ్యవస్థను అందిస్తుంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేయ‌డంలో వీటిదే కీల‌క‌ పాత్ర.

Advertisements

You may also like

Our Visitor

039485
Total views : 197108

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: