Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

by Satya
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు .తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమైన తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగుతుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019111
Total views : 89923

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.