222
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. వైద్య సహాయం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు, మసీదు నిర్మాణం, భూముల నమోదు వంటి పలు అంశాలపై ప్రజలు విజ్ఞప్తులు చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో 713 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన బోయ మంజునాథ్‌ను అభినందించి, అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.