Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Main News బాలికల గురుకుల విద్యాలయంలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు..

బాలికల గురుకుల విద్యాలయంలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు..

by Rama
Annual Day Celebrations

బాలికల గురుకుల విద్యాలయం (Girls Gurukula Vidyalaya):

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల బాలికల గురుకుల విద్యాలయంలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు. యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు అంతా పండగ వాతావరణం లో సందడి చేస్తూ విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానందుకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఎమ్మెల్యే పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఉండదని.. అనేక రకాల సాంస్కృతిక, వైజ్ఞానిక వంటి కార్యక్రమాలతో విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఉత్తేజపరిచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఎమ్మెల్యే రాగమయి దయానంద మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో యాన్యువల్ డే అంటే మీలాగే ఎంజాయ్ చేసే దానిని అంటూ తన స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఇక్కడ విద్యార్థులు కూడా అంతే స్థాయిలో యాక్టివ్ గా ఉన్నారని ప్రశంసించారు. పాఠశాలకు కావలసిన ప్లే గ్రౌండ్, వాటర్ సమస్య ను అప్పటికప్పుడే అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. చదువులు పట్ల ఆడవారిపై ఉన్న అపోహలు తొలగిపోయేలా ప్రతి ఒక్కరూ మంచిగా చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల ఆర్ సి ఓ, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Read Also..

  • ఐదో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
    తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న గందరగోళం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్పీకర్‌ పోడియంను ముట్టడించి నిరసన తెలిపినందుకు కేటీఆర్‌, హరీశ్‌రావు సహా 22…
  • ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.
    ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆరు…
  • ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.
    శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు. భూముల కేటాయింపుల విషయంలోనూ పూర్తి వివరాలతో సమాధానాలు ఇస్తున్నామని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: