Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home National మళ్లీ పోరుబాట పట్టిన అన్నదాతలు..

మళ్లీ పోరుబాట పట్టిన అన్నదాతలు..

by Rama
Farmers

అన్నదాతలు (Farmers) ఢిల్లీ వైపు పాదయాత్ర:

కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు మళ్లీ పోరుబాట పట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. అయితే రైతుల ముసుగులో అరాచక శక్తులు విధ్వంసం సృష్టించే అవకాశముందని కేంద్ర నిఘా సంస్ధలు భావిస్తున్నారు. దీంతో పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. శంభు బోర్డర్ నుంచి రైతులు ఢిల్లీ రావడంపై లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించొద్దని లేఖలో కోరింది. రైతుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు.. అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించింది. 14 వేల మంది రైతులు 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 బస్సుల్లో శంభు బోర్డర్ దగ్గరకు చేరుకున్నారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసే అంశంపై తమ డిమాండ్లపై కేంద్రం ప్రకటన చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. భారీగా రైతులు శంభు బార్డర్‌కు చేరుకోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
    గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
  • తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
    తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…
  • ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
    భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్‌ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: