Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home National అప్పీల్‌ పై ఖతర్‌ కోర్టు రెండు విచారణలు

అప్పీల్‌ పై ఖతర్‌ కోర్టు రెండు విచారణలు

by Satya
MEA

ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్‌ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ భారత్‌ అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగిందని తెలిపారు. సున్నితమైన ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. నావికాదళ అధికారులకు న్యాయ, దౌత్యపరమైన సాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 3ను వారిని భారత్‌ రాయబారి కలిసినట్లు అరిందమ్ బాగ్చి వెల్లడించారు. అదేవిధంగా ఇటీవల కాప్‌ సదస్సులో భాగంగా దుబాయ్‌ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌ రాజు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అక్కడి భారత కమ్యూనిటీ సంక్షేమం సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు బాగ్చి తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

025424
Total views : 147249

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.