తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్’ అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది. ఈ అవార్డును ఆదివారం మోదీకి అందజేసింది. నైజీరియన్లు కాకుండా.. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో విదేశీ వ్యక్తి మోదీనే కావడం విశేషం. ఈ అవార్డును తనకు అందజేసిన నైజీరియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును 140 కోట్ల భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. ఆ దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ తినూబూ ఆహ్వానం మేరకు ఆదివారం నైజీరియా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది.
నైజీరియా ప్రధానమంత్రి నెసోమ్ ఎజెన్వో ఎయిర్‌పోర్టుకు చేరుకుని మోదీని అబుజా నగరంలోకి ఆహ్వానిస్తున్నట్లు సంకేతంగా ఓ తాళాన్ని అందజేశారు. ఓ వ్యక్తిపై నమ్మకం, గౌరవానికి సూచికగా నైజీరియన్లు ఆ తాళాన్ని అందజేస్తారని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఎక్స్‌లో పేర్కొంది. అనంతరం ఆ దేశాధ్యక్ష భవనానికి చేరుకున్న మోదీ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబూతో సమావేశమై ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నైజీరియా పర్యటన అనంతరం జీ- 20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్లనున్నారు. అటు నుంచి గయానా వెళ్లి భారత్‌కు తిరిగి రానున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
- శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులునంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు 40 కిలోమీటర్లు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తూ మల్లన్న దర్శనం కోసం వెళ్తున్నారు. Advertisements
- అసోంలో ప్రధాని మోదీ పర్యటనఅసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భారత ఎయిర్‌ఫోర్స్ విమానంలో వచ్చిన ప్రధాని..రోడ్డుపైనే ల్యాండ్ అయ్యారు. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.…
- ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలుఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్..తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులు తో కలిసి పూజ నిర్వహించారు..బడ్జెట్ కాపీ ని తీసుకుని వెంకట పాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించారు..అక్కడ…
- టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్రTTD నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర. ఏపీ ప్రభుత్వం ఆయన్ను TTD ఈవోగా నియమించడంతో నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న రవిచంద్ర..ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి