Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News కేరళంలోని కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

కేరళంలోని కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

by CVR NEWS

కేరళంలోని కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీపీఐఎం ఏమాత్రం వామపక్ష పార్టీ కాదని, అతివాద రైట్‌వింగ్‌ పార్టీ అని పేర్కొన్నారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు బీజేపీతో జత కట్టారని ఆరోపించారు. అందువల్లే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించాలని ప్రధాని కోరుకుంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మతం, దేవుళ్ల గురించి మాట్లాడే ప్రధాని, కేరళకు వచ్చినప్పుడు మాత్రం శబరిమల ఆలయంలో జరిగిన బంగారు తాపడాల స్కామ్ గురించి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బంగారు తాపడాలు మాయమవడం వెనక సీపీఐ నేతల హస్తం ఉన్నందువల్లే ఈ విషయంలో బీజేపీ మౌనంగా ఉందని రాహుల్‌ అన్నారు. సీపీఐ, బీజేపీతో జత కట్టడం ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు నచ్చలేదని.. అందువల్లే వారు యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ సిటీ మిషన్‌ వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని రాహుల్‌ అన్నారు. కొట్టాయం జిల్లాలోని పుతుప్పల్లి నియోజకవర్గంలో UDF అభ్యర్థికి మద్దతుగా రాహుల్ గాంధీ వీధుల్లో సైకిల్ తొక్కుతూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: