Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home National ఎస్ జైశంకర్ హాట్ కామెంట్స్..!

ఎస్ జైశంకర్ హాట్ కామెంట్స్..!

by Satya
S Jaishankar

భారతదేశంలో ఏం మారింది అని ఎవరైనా అడిగితే నేను భారతదేశ విజన్ మారిందని చెబుతున్నాను అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. గత పదేళ్లలో భారతదేశం ఎంతో మారిందని, ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌ గురించి చర్చిస్తోందని తెలిపారు. తిరువనంతపురంలో జరిగిన ‘వికసిత్ సంకల్ప భారత్ యాత్ర’లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. గత దశాబ్ద కాలంలో ప్రధాని మోడీ హయాంలో భారత దేశ విజన్ మారిందన్నారు. 10, 20, 30 ఏళ్ల క్రితం ఇదే భారతదేశంలో ఎలాంటి మార్పు కూడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలకు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని అన్ని రంగాల్లో సాంకేతికత వినియోగం గణనీయంగా పెరిగిందని జైశంకర్ వివరించారు. ఆరోగ్యం, నీరు, విద్యుత్, ఇల్లు, విద్య వంటి భారతీయులు ఎదుర్కొనే అనేక సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఉన్నాయన్నారు. 46 ఏళ్ల పాటు విదేశాంగ శాఖలో పనిచేసిన తనకు గత 10 సంవత్సరాలే ఎక్కువ సంతృప్తినిచ్చాయని ఆయన తెలిపారు. ఎందుకంటే ప్రభుత్వం పనితీరులో తాను పెద్ద మార్పును చూశానన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: