Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు సేవ

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు సేవ

by Satya
కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్​ రెడ్డి బండి సంజయ్​

కాకినాడ జిల్లా పెద్దాపురంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు సేవ చేసేందుకు టిడిపి నేతలు దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇప్పటివరకు జరిగిన పాలన పై సమీక్షిస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చినరాజప్ప ఫోకస్ పెంచారు. ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన రాజప్ప తాజాగా పెద్దాపురం చంద్రబాబు శతాబ్ది పార్కును పరిశీలించి పార్కు లో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు పార్కు మెయింటినెన్స్ చేయకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆషాడ మాసం వస్తుండడంతో పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో శతాబ్ది పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాజప్ప మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

2014 – 2019 మధ్య తాను మంత్రిగా ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సర్వనాశనం చేశారని పార్కులకు సైతం తాళాలు వేశారని వైసిపి నాయకులకు అంటకాగిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on : Facebook, InstagramYouTube & Google News

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: