Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర – కూన రవికుమార్

జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర – కూన రవికుమార్

by Prakash
kuna ravikumar

రాష్ర్టంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది‌. దళితులను , బిసిలను అవమానించే యాత్ర జరుగుతుంది. జగన్ అరాచకాలు , దోపిడీ, అత్యాచారం ప్రశ్నిస్తే , అలా ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పొస్ట్ లు పెట్టించారు. ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు పెట్టిన వారిపై నొ యాక్షన్. ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని , గౌతు శిరీష , పంచుమర్తి అనురాధ లు పొలీసులకు పిర్యాధు చేస్తే పట్టించుకునే వారు లేరు. బిసి మహిళలను అవమానించి , రోతపుట్టించే రాతలు రాయించి , నా బిసిలు అని మాట్లాడటానికి సిగ్గుందా..? పేరుకే బిసి మంత్రులు , పెత్తనం అంతా రెడ్లదే..? జిల్లాలను సామంత రాజులుగా రెడ్లు పంచుకున్నారు. బొత్స , ధర్మాన , సీదిరి , తమ్మినేని రెడ్ల బూట్లు నాకడానికి తాపత్రయ పడుతున్నారు. వైసిపి ప్రేరేపితంగా హత్యగావింపబడ్డవారు 74 మంది బిసిలు, 28 మంది దళితులు ఉన్నారు. రజక , యాదవ , నాయిబ్రాహ్మన , మత్స్యకార , గీత కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం. మత్స్యకార పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసాం. టిటిడి చైర్మెన్లుగా బిసిలకు పెద్ద పీట వేసింది టిడిపినే. వైసిపి రెడ్డిలకు మాత్రమే టిటిడి చైర్మెన్ చేసింది. అన్ని పధకాలలో అవినీతి చేసి వేసిన ఎంగిలి మెతుకలు అశపడాలా.? బిసి పధకాలు ముప్పై రద్దు చేసారు. ధర్మాన , బొత్స , తమ్మినేని నిజమైన బిసిలు కాదు. ఉత్తరాంధ్ర మంత్రులంతా బూర్జువా మంత్రులు. 12 యూనివర్సిటీలలో తొమ్మిది మంది విసిలు రెడ్లేనా? బిసి నాయకులపై తప్పుడు కెసులు పెట్టారు. బిసిలకు వెన్ను దన్నుగా ఉన్నారనే చంద్రబాబు పై కుట్ర చేసారు. బిసిలు బాగుపడితే జగన్ కు కడుపు మంట. బిసిల అత్మాభిమానం తాకట్టు పెడుతున్న వారిని బవిష్యత్ క్షమించదు. బిసిలకు అండగా ఉన్నారనే బాబు పై అక్రమ కేసులు పెట్టారు‌.

Advertisements

You may also like

Our Visitor

025402
Total views : 147172

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.