Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత…

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత…

by Prakash
Sit on the floor and protest

పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడి పట్టాల పంపిణీకి సిద్ధపడగా తాను స్థానిక ఎమ్మెల్యేని, సభాధ్యక్షుడని చెప్పి నిమ్మల గుర్తు చేశారు. తాను మాట్లాడిన తర్వాత పట్టాలు పంపిణీ చేద్దురుగాని అని ఎమ్మెల్యే నిమ్మల అనడంతో ప్రసాద్ రాజు తనకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని వెళ్ళిపోతానని ఒక లబ్ధిదారునికి పట్టా అందించి ప్రసాద్ రాజు వెళ్లిపోయారు. దీంతో సభ వేదిక ముందు నేలపై కూర్చుని నిమ్మల నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీ నేతల నాయకుల నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి నిమ్మల మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులు అందరినీ మోసం చేసిందని బ్యాంకులకు తాకట్టు పెట్టిందని ఆరోపణ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: