ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టిడిపి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్ టిడిపి ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నారా లోకేష్ హిందూపురం బయలుదేరి వెళ్లారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అతిధి గృహంలో బస చేయనున్న నారా లోకేష్ గురువారం ఉదయం హిందూపురం జిటిఎం లే అవుట్, లోటస్ పబ్లిక్ స్కూలు దగ్గర ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందనలు తెలియజేయునన్నారు. పదిన్నర గంటలకు శంఖారావం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. 10:56 నిమిషాలకు పార్టీ నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. 11.26 పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్లను అందజేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు శంఖారావం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఐదు గంటలకు పెనుగొండకు చేరుకుని ఐదున్నర గంటలకు శంఖారావం సభలో ప్రసంగించనున్నారు. 6 గంటలకు పార్టీ నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరున్నర గంటలకు రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
Anantapur District news
అనంతపురం జిల్లా సరిహద్దులోని చెరువు తాండా గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుంతకల్ మండలం మైనాపురం తండాకు చెందిన రంజిత్ నాయక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మైనాపురం తండా నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రోడ్డు రవాణా శాఖ భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. జనవరి 14వ తేదీన ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలను.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు RTO ఆఫీసులో ఆయన రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని.. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రాజా గోపాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, ట్రైని డీఎస్పీ హేమంత్, తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. వినాయక సర్కిల్లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గం శాంతినగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. తన అభిమాన నాయకుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సవంతో జరుపుకున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులను ఆదుకోవాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చేతకాని ప్రభుత్వం రైతులను తీరని అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకొని పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వలన రైతులకు తీవ్రం నష్టం చేకూర్చిందని వాపోయారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత చేస్తామని హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36రోజులుగా అంగన్వాడీ టీచర్లు నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు రామ్మూర్తి తెల్లవారుజామున తన వ్యవసాయ తోటలో బహిర్భూమికి వెళ్ళగా, పొదల మాటున ఉన్న చిరుత ఒక్కసారిగా వెనుకనుండి దాడి చేయడంతో, భయంతో రైతు గట్టిగా కేకలు వేయడంతో చిరుత దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలోకి పరుగు తీసిందని రైతు తెలిపాడు. రైతును స్థానికులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాది మహల్ లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని షాదీ మహల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అజీజీయ షాది మహల్ లో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ మాట్లాడారు. వైసీపీ పాలనలో ముస్లిం మైనారిటీల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసిపికి తొత్తుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా కొన్ని మైనారిటీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బేల్ రద్దు కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి తొత్తుగా మారాడని మండిపడ్డారు. పార్లమెంటులో మైనారిటీల వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందేందుకు వైసిపి ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి మైనారిటీలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధం తండ్రి కొడుకుల బంధం అని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడంలోనే వైసిపికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనకు టికెట్ రాలేదన్న అసూయతో మూడు దపాలుగా ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని దిక్కరించి మాట్లాడడం పై రాయదుర్గం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి సెగ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు అంపారెడ్డి కుమారుడు నవీన్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశంలో వెల్లడి.
వైసీపీ యువనేత నవీన్ కుమార్ రెడ్డి కామెంట్స్:-
కాపు రామచంద్రారెడ్డి టికెట్ నెపంతో జగన్మోహన్ రెడ్డి గొంతు కోశారు అనడం విడ్డూరం.
ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసుకొని 2009 నుండి 2019 వరకు మూడు దపాలుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకే ఎమ్మెల్యేగా గుర్తింపు పొందలేదా ? అన్యాయమైన దుర్మార్గమైన సర్వే అంటావా ? మీరు చేసిన అవినీతి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి మీతో చర్చించ లేదా ఇది వాస్తవం కాదా ?
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో క్రియాశీలకంగా పని చేసిన పార్టీ నాయకులను నీ స్వలాభం కోసం అడ్డొస్తారని, పార్టీ కార్యక్రమాలకు దూరం చేయలేదా ?
నియోజకవర్గంలోని కనేకలు బొమ్మనహాలు మండలాల్లో కార్యకర్తలపై అక్రమ కేసులులో విరికించి హింసించలేదా ?
కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నావే ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో నీ వెంట ఎంతమంది ఉన్నారో చూసుకో!
రాయదుర్గం సబ్ రిజిస్టర్ ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని అధికారులను హింసించలేదా తద్వారా ఆరు నెలలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రభుత్వ నిధి గండి కొట్టలేదా?
రామచంద్ర రెడ్డి ఇప్పటికైనా ప్రజా సుపారీలకు పాలన కోసం వైయస్సార్ లో ఉండి ఐక్యత కోసం పోరాడు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మా ఇంట్లో ఉన్నాయని చెప్పుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనాలు గుండెల్లో ఉండాలి.






Total views : 75454