బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 25 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Andhra Pradesh News
నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్, అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు, అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్ సైట్‌కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు, అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
టిడిపి నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి కేసులో తన అనుచరులను అదుపులోకి తీసుకున్నారని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరినీ చట్టపరంగానే విచారణ చెయ్యాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ఒత్తిడితో పోలీసులు వారిని ఇబ్బందులకు గురిచేస్తారనే అనుమానాలు ఉన్నాయి… బెనర్జీనే మొదట రామ్మోహన్ రెడ్డి పై దాడి చేయబోయాడని, తప్పుడు కేసులు నమోదు చేయించడంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దిట్ట… దాడితో ఎలాంటి సంబంధ లేకపోయినా నాపై కేసు నమోదు చేశారు… నందం సుబ్బయ్య హత్య కేసు నిందితుడు బెనర్జీ పై దాడి అనుకోకుండా జరిగిన ఘటనే… నందం సుబ్బయ్య హత్య, బెనర్జీ పై జరిగిన కేసులను సి.బి.ఐ తో విచారణ కోరేందుకు సిద్దం… ఆ రెండు కేసుల పై సీబీఐ విచారణ కోరేందుకు ఎమ్మెల్యే రాచమల్లు సిద్దమా…
గుంటూరు పట్టణం గాంధీ పార్కులోని సెల్పి పాయింట్ వద్ద మహిళల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు జుట్టు పట్టుకొని దాడి చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి గాంధీ పార్కు నగర పాలక సంస్థను ప్రారంభించారు. అక్కడ పాలక సిబ్బంది లేకపోవడంతో మహిళల మధ్య వివాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ. స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ ఏపీ హైకోర్టు మంజురు చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. బెయిల్ మంజురులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది.
ఫ్యాక్టరీ వద్దు..మా పొలాలు మాకే కావాలంటూ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద గోపిశెట్టిపల్లి రైతులు సుమారు 150 మంది ధర్నానిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తరచూ పేపర్లలో మా గోపిశెట్టి పల్లి గ్రామానికి చెందిన వందలాది ఎకరాల్లో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయని, తమకు అధికారులు ఎవరు ఈ విషయమై అధికారికంగా ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ఎన్నో దశాబ్దాలుగా తాత ముత్తాతల నుండి ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నామని. భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమన్నారు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడబోమన్నారు..ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో రైతులు సిబ్బందికి వినతి పత్రం అందించారు.
స్కిల్ స్కాంలో నిజంగానే అవినీతి జరగకపోతే చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి జైలులో ఉండాల్సిన అవసరం ఏముందని నారా లోకేష్ ను ప్రశ్నించారు ఎంపీ భరత్. నారా లోకేష్ స్కిల్ స్కాం వ్యాఖ్యలపై ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. స్కిల్ స్కాం కేసును కోర్ట్ లో ఏం కొట్టేయలేదని, కేసులో ఉన్న గ్రావిటీని బట్టి బెయిల్వస్తుంటాయి. మేము డే వన్ నుండి సిమెన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ 3 వేల కోట్లు ఎంవోయూ రాసుకున్నామని చెప్పారు. సిమెన్స్ డబ్బులు రిలీజ్ చేయకుండా ప్రభుత్వమే 370 కోట్లు డిజైన్ టెక్ కు పంపించారన్నారు. జీవో కూడా రిలీజ్ చేసారని, 164 సీఆర్పీసీ కింద అడిగినప్పుడు మాకు ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని సిమెన్స్ చెప్పిందన్నారు. డిజైన్ టెక్ పేరుతో షెల్ కంపెనీకి నిధులు మళ్లాయని, వాస్తవాలను లోకేష్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Read Also..
Read Also..
నరసరావుపేట లో విషాదం నెలకొంది. స్థానిక NEC కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రేచల్ రెడ్డి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని కాలేజి యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్నినరసరావుపేట ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
Read Also..
రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో మళ్లీ తొలి అడుగుపడింది. రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభమైన యాత్రకు జనం పోటెత్తారు. తాటిపాక సెంటర్లో జరిగిన బహిరంగ సభకు జనం సునామీలా వచ్చారు. కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంఘీభావంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. లోకేశ్ మాట్లాడుతూ తనపై ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చంద్రబాబును జైలుకు పంపితే తన పాదయాత్ర ఆగుతుందని భ్రమపడ్డారని ఎద్దేవా చేశారు. స్కిల్ ఖాతాలో ఒక్క ఆధారమైనా చూపించలేకపోయారని ధ్వజమెత్తారు.
శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందచేస్తున్నారు. శని,అది,సోమవారాలలో స్పర్శ దర్శనం,సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేశారు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.





Total views : 200999