విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక మత్స్యకారులు వాసుపల్లి నాని, అతని మామ సత్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు సీపీ రవి శంకర్. వీరిద్దరూ అల్లిపల్లి వేంకటేశ్ చెందిన 887 బోటులో మద్యం తాగారని పేర్కొన్నారు. అనంతరం సిగరెట్ కాల్చి పక్కనే ఉన్న 815 నెంబర్ బోటులో వేశారని అన్నారు. మంటలు బాగా వ్యాపించడంతో ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారని తెలిపారు. ఈ ఇద్దరిపై ఐపిసి సెక్షన్ 437,438,285 కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు అనుమనితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారని సిపి తెలిపారు. విచారణలో భాగంగానే యూట్యాబర్ నానిని తీసుకొచ్చామన్నారు. విచారణలో అతని ప్రమేయం లేదంటే తాము ప్రోసిజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్ళమన్నారు. ఈ కేసుకు సంభందించి 50 కు ఫైగా సిసి కెమెరాలను పరిశీలించామని తెలిపారు. నిందితులు సిగరేట్ విసిరివేయ్యడంతో వలలకు నిప్పు అంటుకుందని ఆ సమయంలో గాలులు కూడా బాగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయని వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ మోనటరింగ్ చేస్తామని సీపీ రవి శంకర్ తెలిపారు
Andhra Pradesh News
మాజీ మంత్రి నారాయణపై నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ఇల్లిళ్లూ తిరిగి సంక్షేమ పథకాలు అందిస్తుంటే వారిపై టీడీపీ విమర్శలు చేయడం దారుణమన్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు నెల్లూరు నగరంలో ప్రయివేట్ వ్యక్తులను ఇంటింటికీ ఎలా తిప్పుతున్నారని ప్రశ్నించారు. జనం వివరాలు సేకరించడం దేనికి సంకేతమో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు. నగరంలోని 52వ డివిజన్ రంగనాయకులపేటలో ఆయన పర్యటించారు. గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పాలనను వివరించారు.
Read Also..
Read Also..
ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పలు శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. విశాఖకు పాలనా రాజధానిని మారుస్తున్నట్టు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు? దేని కోసం వస్తున్నారని గంటా ప్రశ్నించారు. అడ్డదారిలో విశాఖకు రావాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఇందులో రాజకీయ లబ్ధి తప్ప, ప్రజలకు ఉపయోగపడేదేమీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతోందని ఈ 3 నెలల ముచ్చట కోసం ప్రజాధనాన్ని తగలేస్తున్నారని విమర్శించారు. విశాఖలో పులివెందుల పంచాయితీలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. విశాఖ ప్రజల ఆవేదన వైసీపీకి పట్టడం లేదని అన్నారు.
విశాఖ హార్చర్ అగ్నిప్రమాదం పై చిక్కుముడి వీడింది. రాజకీయ రంగు పులుముకున్నఈ ఘటనలో అసలు విషయం బయటకు వచ్చింది. విశాఖ ఫిషింగ్ హార్చర్ చరిత్రలో ఎన్నడూ జరగని ఈ భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి ఉప్పు చేప కాదు చిన్న సిగరెట్ ముక్క కారణమని తేలింది. ప్రధాన నిందితులు వాసుపల్లి నాని, అతని మామ వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. ఈనెల 19న రాత్రి కొందరు వ్యక్తులు హార్బర్లో పార్టీ చేసుకున్నారు. మందులో నంజుకోవడానికి ఉప్పుచేపను వేయించారు. ఆ చేపను తిన్న తర్వాత మద్యం మత్తులో కాల్చిన సిగరెట్ ముక్క పక్క బోటులోకి విసిరేశారు. సిగరెట్ ముక్క బోటు ఇంజిన్ పై పడింది. అలా ఆ సిగరెట్ నుంచి మొదలైన చిన్న నిప్పు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో 19 బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. మద్యం మత్తులో చేసిన ఈ చిన్న తప్పిదం గంగపుత్రులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కళ్లెదుటే తమ జీవనాధారం బూడిదవ్వటంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే ప్రభుత్వం వేగంగా స్పందించి 49 మంది బాధితులకు ఏడు కోట్ల పదకొండు లక్షల నష్టపరిహారాన్నిఅందించి ఆదుకుంది.
టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ కీ 11లక్షల 16రూపాయల విరాళాని ఇచ్చిన తిరుపతికీ చెందిన భక్తుడు మైలు ప్రణీత్,నిహారిక దంపతులు.టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో ధర్మారెడ్డి కి చెక్ ని ప్రణీత్ దంపతులు అందజేశారు. ఈ సందర్బంగా దాతను ఈవో ధర్మారెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో పాల్గొన్న దాత తండ్రి మైలు మధు,జ్యోతి పాల్గొన్నారు.
రాష్ట స్థ్రాయి బాల బాలికల కబాడీ పోటీలను చౌడేపల్లి లో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి కబ్బడి పోటీల ను చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కబాడీ సంఘం అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో జరగనున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు 13 జిల్లాల బాల బాలికలు పాల్గొంటారని నిర్వాహకులు, పాఠశాల పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కబాడీ పోటీలను చిత్తూరు జిల్లా ఎం.పి.రెడ్డెప్ప ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి ,ఎం.పి.పి.రామ్మూర్తి, జెడ్పిటిసి దామోదర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి, టిడిపి పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరొ సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకుల ఆగడాలు, ఆకృత్యాలు రోజురోజుకు హెచ్చు మీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు బీసీలు బలి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల్లో కనేకల్ మండలంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. కనేకల్ మండలం గరుడచేడు గ్రామంలో మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల భూ సర్వేలో జోక్యం చేసుకొని తన అనుచరునికి కొంత భూమిని కట్టబెట్టేందుకు ప్రయత్నం చేయడంతో బాధితుడు సురేష్ ఆత్మహత్య తనకు శరణ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు పంపిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందన్నారు. అదేవిధంగా జక్కల వాడికి గ్రామ సర్పంచ్ భర్త హనుమంత్ రెడ్డి భూమి ఆక్రమించేందుకు మహిళను కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడుతూ విచక్షణ రహితంగా దాడికి చేయడం జరిగిందన్నారు. జగనన్న భూహక్కు భూ రక్షణ రీసర్వే పేరుతో భూముల వాస్తవ హద్దులను అధికారులు మార్చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా వైసిపి నాయకులు కనుసన్నుల్లొ భూముల రి సర్వే జరుగుతుందని విమర్శించారు.
రైల్వే కోడూరు టిడిపి క్యాంప్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన టిడిపి సాంస్కృతిక విభాగాల శాఖ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్, వైసిపి పరిపాలన పై వినూత్న రీతిలో విరుచుకుపడ్డారు పంతగాని నరసింహ ప్రసాద్. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలను మాయ మాటలతో మబ్బి పెడుతున్న వైసిపి ప్రభుత్వం, వైసీపీ ఇస్తున్న వాగ్దానాలను విని విని విసికెత్తిపోయిన ప్రజలు ఐదు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త పథకాలకు కాగితాలపై జీవోలు అంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్న వైసిపి ప్రభుత్వం అని, 4 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే 215 కోట్ల తో సోమశిల బ్యాక్ వాటర్ రైల్వే కోడూరు నియోజకవర్గానికి తీసుకుని వస్తామని చెప్పి ప్రజల చెవులలో పెద్ద కాలిఫ్లవర్ పెడుతున్నారని పంతగాని నరసింహ ప్రసాద్ రైల్వేకోడూరు వ్యంగీకరించారు. నియోజకవర్గంలో కనీసం 10 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం సోమశిల బ్యాక్ వాటర్ తో సస్యశ్యామలం చేస్తామనడం విడ్డూరం అన,. ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క చెరువు కైనా మరమ్మత్తులు మొదలు పెట్టారా పూర్తి చేశారా అని ఎద్దేవ చేసారు. చిట్వేలి మండలం ఎల్లంరాజు చెరువు మొండిగట్టు మరమ్మత్తు కు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దాని పని పూర్తి చేస్తామని మీ హామీలో కూడా ఉందని అయినా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పుల్లంపేట మండలంలో నూకనపల్లి, అనాసముద్రం, వత్తలూరు చెరువులకు మరమ్మత్తులు చేయలేదు అయినా కొత్త ప్రాజెక్టులు తెస్తామని ప్రజలను మోసం చేస్తున్న వైసిపి ప్రభుత్వం అని, రైల్వే పనులు, రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కు సంబంధించి చేసిన భూమి పూజలు మళ్ళీ మళ్ళీ చేసి ప్రజలను మోసం అని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని చెప్పి అనేక నిబంధనలతో అడ్డుకుంటున్న వైసిపి ప్రభుత్వం. ఈ విధంగా ప్రజలను అనేక రకాలతో మోసం చేస్తూ ప్రజల చెవుల్లో పూలు పెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నదని ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోరని ఇకపై వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని పంతగాని నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు.
సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్లుతో చర్చిoచగా వైసీపీ ప్రభుత్వం లో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో ఆటో డ్రైవర్ల నుండి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నారని ,అధిక డీజిల్ ధరలతో ,రోడ్లు సరిగా లేక ఆటోలు రిపైర్లు రావడంతో కుటుంబ పోషణ గడవడం చాలా కష్టంగా ఉందని వాపోయారు, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల జీవితాలు మార్చేస్తానన్న జగన్ ఇప్పుడు వాళ్ల పాలిట యముడి లా తయారు అయ్యారని డ్రైవర్లు వాపోయారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ అసలే అంతంత మాత్రం బతుకులు, నిబంధనల పేరుతో అడుగడుగునా పోలీసుల వేధింపులు,ఆపై జరిమానాలు. పెట్రోలు, డీజిల్ ధర మంటలు నెల తిరిగే సరికి అప్పుల వారి ఒత్తిళ్లు ఇవీ ఆటో, క్యాబ్, ట్రక్కు డ్రైవర్ల కష్టాలు. వారి సంక్షేమాన్ని పట్టించుకునే స్థితిలో ఈ వైసిపి ప్రభుత్వం లేదన్నారు. గ్రామీణ ప్రాతాల్లో కనీసం ఓ కిలోమీటరైనా సరిగా లేని రొడ్లు.! ఆపై పొరపాటున ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్లపై తీవ్ర భారంతో వారి కుటుంసభ్యులు కోలుకునేందుకు ఏళ్ల వ్యవధి పడుతోందనీ దీనికి తోడు కేసులతో పాటు జరిమానాలు చెల్లించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి వస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డ సవితమ్మ. ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, నల్లూరు మాజీ సర్పంచ్ గోపాల్, త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి, సనాఉల్లా బాలాజీ నాయక్, మారుతి ప్రసాద్, వాసుదేవరెడ్డి రాంపురం అంజి, మంజు, గోవిందప్ప, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గన్నారు.
ఈనెల 26,27న ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిని సందర్శిస్తున్నారు. 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమాశ్రయానికి చేరుకుంటారు. తిరుమల వెళ్ళి రాత్రి బస చేసి, 27వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదుకు బయలుదేరి వెళతారు. ప్రధాన మోదీ పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.






Total views : 200828