కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతోంది. ఇటీవల పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. కొత్తపల్లి మండలంలో వైసీపీలోని రెండు వర్గాలు కేసులు పెట్టుకునే పతాక స్థాయికి అసమ్మతి చేరింది. గృహ లబ్ధిదారులకు పట్టాలిచ్చినా స్థలాలు ఎక్కడున్నాయో చూపించలేదని నాగులాపల్లి లో ఎమ్మెల్యేను నిలదీశారు. ఇక్కడ ఎమ్మెల్యే దొరబాబును పరుగులు పెట్టించే వరకు పరిస్థితి దారితీయటంతో అధికారులు సైతం నివ్వెరపోయారు. దీనికి తోడు ఆయన సొంత అల్లుడు జనసేనలో చేరారు. ఈసారి దొరబాబుకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh News
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే యువకుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువకుడికి మూడు రోజుల నుంచి హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్ కి తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేసిన తిమ్మాపూర్ విజ్ఞాన్ కాలేజ్ యాజమాన్యం. బంగారు భవిష్యత్తు ఉన్న యువకుడుని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని వారు అర్ధనాళాలు పెడుతున్నారు. మూడు రోజుల నుంచి బాగోకపోతే స్కూలు యాజమాన్యం ఏం చేస్తుంది? వీళ్ళకి సెక్యూరిటీగా ఉన్న వార్డెన్ ఎందుకు నిర్లక్ష్యం వహించాడు. తల్లిదండ్రులకి చెప్పాల్సిన యాజమాన్యం ఎందుకు ఇంత గోప్యతగా ఉంచుతున్నారని వారన్నారు. ఈ విషయాన్ని బయటికి రాకుండా రాత్రికి రాత్రే అక్కడనుంచి ఆ మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఎవరిని దగ్గరికి రాకుండా మేనేజ్ చేశారని వారు చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యం పోలీసులతో కుమ్మక్కై ఈ విషయాన్ని బయటకి తెలియకుండా ఉంచారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యాజమాన్యం స్కూల్ లైసెన్స్ ని రద్దు చేసి ఇంత నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై డీఈవో తక్షణ చర్యలు తీసుకుని వీళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని మా కుమారుడికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదని మాకు పుత్ర శోకం కలిగించినవంటి యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీకాకుళం జల్లా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు, సభలు ఊరికి బయట ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు. దానికి విరుద్ధంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్ని, సర్కిల్‌ను బ్లాక్ చేసేసి మరీ వేదికను ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని తుడ్డలిలో వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర అరాచకమే సృష్టించిందని చెప్పవచ్చు. ప్రధాన రహదారిపై స్టేజి వేయటంతో పాలకొండ-రాయఘడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. చల్లపల్లి మండలంలోని నాలుగు లంక గ్రామాల రైతులకు లీజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, బందరు ఆర్డీవో ఎం.వాణి హాజరయ్యారు. లంక భూములు సాగు చేసుకుని జీవిస్తున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మేలు కలిగేలా లీజ్ ను రెన్యూవల్ చేశామని సభాముఖంగా ఎమ్మెల్యే తెలిపారు. అర్హత కలిగిన 838 మంది లంక భూముల రైతులకు 760 ఎకరాల లీజు పట్టాలు పంపిణీ చేశారు. చల్లపల్లి మండలంలోని పాగోలు, మాజేరుల్లో 158 మందికి అసైన్డ్ భూములు, 39 ఎకరాలను 22ఏ నుంచి తొలగించి ధృవీకరణ పత్రాలు సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు.
విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయియ. ఈ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించారు. ఆంధ్రా వర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో కొన్ని శాఖలకు భవనాలు కేటాయించారు. పలు శాఖలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది.
తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుందని టీడీపీ చేసిన ఆరోపణలు ముమ్మాటికి అబద్దం అన్నారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేకుండా మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్లో 241 కోట్ల రూపాయలు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? అని బుగ్గన నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజలలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలకు స్పష్టమవుతుంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
పల్నాడుజిల్లా రాజుపాలెం మండలం అంచులవారి పాలెం గ్రామంలో చోరీలకు పాల్పడుతున్న వేపూరి శరత్ బాబును వినకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేపూరి శరత్ బాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలలో చెడు వ్యసనాలకు బానిసై,డబ్బు సంపాదించాలని ఆలోచనతో ఏటీఎంల దొంగతనం,ఆన్లైన్ మనీ ట్రాన్స్లేషన్ దొంగతనాలకు పాల్పడ్డాడు… దొంగతనాలకు పాల్పడుతున్న శరత్ ని అదుపులోకి తీసుకొని చోరీ కాబడిన 11,19,000 నగదు నుండి అందులో 8,66,600 రికవరీ చేశామన్నారు… శరత్ బాబు మీద మొత్తం19 కేసులు నమోదయ్యాయి… ప్రజలు ఎవరు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు… ఎవరైనా సైబర్ నేరగాళ్ళ బారిన పడి డబ్బును పోగొట్టుకుంటే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయండి…
పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అర్హులైన 10,511 జంటలకు 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించామన్నారు. గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో ఇలాంటి పథకాలు తీసుకురాలేదన్నారు. పేదలకు మంచి జరగాలని అడుగులు వేయలేదన్నారు. తమ ప్రభుత్తవం మంచి సంకల్పంతో ఈ పథకాన్ని అమలుచేస్తుందన్నారు.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు మంత్రి అప్పలరాజు బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ ప్రమాదంలో హార్బర్ లోని 30 బోట్లు మంటల్లో కాలిపోయాయి. మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ ఖాతాకు నిధులు జమచేశారు. ఈ మొత్తాన్ని మంత్రి అప్పలరాజు బాధితులకు అందజేశారు. కాలిపోయిన బోట్ల విలువలో 80 శాతం పరిహారంగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ హార్బర్ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. సీఎం జగన్ ఎలాంటి వివక్ష చూపకుండా పరిహారాన్ని అందజేశారన్నారు.





Total views : 200816