ఏపీలో జనసేనతో తమ పార్టీ పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రెండు పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇతర పార్టీలను కూడా కలుపుకు పోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తామన్నారు. జనసేనతో పొత్తుపై మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్ నుంచి మా పార్టీ బలోపేతం అవడానికి పని చేస్తుంది. ఏపీ అధ్యక్షులు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికే నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉంది. ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్లా పోటీ చేస్తోంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. కమ్యూనిస్టులు దిక్కు తోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు దాదాపుగా కనుమరుగయ్యారు. తెలంగాణలో ఒకటో రెండో సీట్లు పొందారు. ఏపీలో కూడా సీట్ల కోసం కమ్యూనిస్టులు ఇలా మాట్లాడుతున్నారు’’ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
Andhra Pradesh News
మద్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈవాళ మ.2:15 గంటలకు హైకోర్టు విచారించనుంది. నిన్న జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని రెండు బ్రూవరీస్, మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని రాష్ట్ర బ్రూవరీస్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర వేర్వురుగా హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా చంద్రబాబు తరఫున న్యాయనాది నాగముత్తు వాదనలు వినిపించారు.
ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోవు టి20 మ్యాచ్ కి విశాఖపట్నం వైయస్సార్ క్రికెట్ స్టేడియం ముస్తాబయింది. వెయ్యి మందితో స్టేడియం చుట్టూ ప్రహరకాస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, బాంబ్ స్కాడ్ , ఆర్మ్డ్ డ్ రిజర్వ్ టీమ్స్ సంసిద్ధంగా ఉన్నాయి. క్రికెట్ అభిమానులందరూ ఎటువంటి తినుబండారాలు,వాటర్ బాటిల్స్ స్టేడియంలోకి తీసుకురాకూడదని, ట్రాఫిక్ పరంగా అన్ని విధాల డైవర్షన్స్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు తో మా విశాఖపట్నం కరస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్…
ఏపీ సీఎం జగన్ గొప్ప మానవతావాది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. కుల గణన వల్ల రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సంక్షేమం అందుతుందని చెప్పారు. జగన్ నిర్ణయాలను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారని…చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పేదరికంలో ఉన్నవారు కూడా జగన్ పాలనలో డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని చెప్పారు. విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థుల జీవితాలు మారిపోతున్నాయని అన్నారు. విదేశాల్లో ఎక్కడ చూసినా మనవాళ్లే కనిపిస్తున్నారని చెప్పారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని .. తమకు సరైన పదవులు ఇవ్వకుండా అగౌరవ పరిచారని విమర్శించారు.
అక్రమ కేసులో జైలుకు వెళ్లిన ప్రొద్దుటూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు అయింది. వైసిపి కార్యకర్త బెనర్జీ పై జరిగిన దాడి కేసులో నమోదైన హత్యాయత్నం కేసుకు సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డిని మూడవ నిందితునిగా అరెస్టు చేశారు. ఈనెల 13న ప్రవీణ్ ను అతని నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కడప కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి విడుదలయ్యారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెయ్యని నేరానికి అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న అక్రమాలను.. అవినీతిని.. అరాచకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళుతున్నానని… నాపై హత్యాయత్నం కేసు బనాయించి జైలుకు పంపారని ఆయన అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి నాకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించారని ప్రవీణ్ తెలిపారు. ఎమ్మెల్యే నాపై ఎన్ని కేసులు పెట్టించినా… ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని… వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో టిడిపి జెండా ఎగరవేస్తామని ప్రవీణ్ స్పష్టం చేశారు
వైసీపీ పాలనలో మోసపూరిత హామీలు, కక్ష పూరిత రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదని టీడీపీ-జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. నియోజవర్గంలో శిథిలావస్థకు చేరిన రహదారులను అభివృద్ధి చేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. టీడీపీ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ3వేల 200 కోట్ల పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా నేటికీ పనులకు నోచుకోలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ- జనసేనలకు ప్రజలు అండగా నిలవాలన్నారు. జనసేన కన్వీనర్ నాయకర్ మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు సాధ్యం కానీ హామీలతో ప్రజల్ని దగా చేస్తున్నారని మండిపడ్డారు.
బాపట్ల మండలం భర్తీపూడి గ్రామానికి చెందిన కగ్గా శ్రీనివాసరావు అనే వ్యక్తి ధాన్యం వ్యాపారం చేస్తూ తను కొన్న ధాన్యం నెల్లూరుకు చెందిన వ్యాపారులకి అమ్మిన, వారు డబ్బులు ఇవ్వటం లేదని వారిపై ఫిర్యాదు చేయటానికి వచ్చి పోలీస్ స్టేషన్లో అధికారులు అందుబాటులో లేకపోయేసరికి బయట పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం ,పరిస్థితి విషమం . బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రోడ్ల పరిస్థితి గోతుల మయమంటూ మొత్తుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న ప్రభుత్వం.. అస్థవ్యస్తంగా గోతుల బారిన పడిన రోడ్ల దుస్థితిపై అధికార పార్టీపై గతంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు సవాల్ చేశారు.పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఆమడ దూరంలో ఉందంటూ విమర్శలు.. నేడు రహదారిలో పడిన గుంతలను మరమ్మతులు చేయిస్తున్న డాక్టర్ చింతలపూడి అశోక్ బాబు, ప్రజల అవస్థలను పట్టించుకోని వైసిపి వ్యవస్థను చూసి ప్రజల ఆగ్రాహిస్తున్నారన్న అశోక్ బాబు.. గురజాల నియోజకవర్గంలో రోడ్లకు నోచుకోని ప్రతీ గ్రామంలో చింతలపూడి ట్రస్ట్ తరుపున మరమ్మతుల కార్యక్రమాన్ని చేపడుతుందని హెచ్చరించిన అశోక్ బాబు.. గుంతల కారణంగా ప్రయాణికులు,పాదచారులు ఇక్కట్లకు గురవుతున్నా పట్టింకోని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు.ప్రభుత్వం బాధ్యతతో చేయాల్సిన రోడ్ల అభివృద్ధి ట్రస్ట్ లు చేసే దుస్థితికి దిగజారడం వైసిపి పార్టీ వైఫల్యమన్న డాక్టర్. ఇకనైనా రోడ్ల మరమ్మతులపై అధికారులు స్పందించకుంటే మరో ముందడుగు వేసి తమ ట్రస్ట్ తరుపున అన్ని మండలాల్లో అభివృద్ధి పనులకు తామే పూనుకొని చేస్తామన్న డాక్టర్ అశోక్ బాబు.
Read Also..
సీఎం జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమేనని అన్నారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. పదవులు ఇంకా పెరుగుతాయన్నారు. బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగిందని చెప్పారు. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారన్నారు. బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది అంటూ కృష్ణయ్య కొనియాడారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ప్రారంభించారు. అనంతరం తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ…. పార్టీ బలోపేతం చేయడానికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా నందిగామ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని… అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే స్థానం అనేది చాలా విలువైనదని… ఆ పదవిలో ఉంటే ప్రజలకు ఏపని అయినా చేయవచ్చని రమాదేవి అన్నారు.





Total views : 200411