నరసరావుపేట ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అమెరికా వెళ్లేందుకు పల్నాడు జిల్లాకు చెందిన హేమనాథ్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 16న చెన్నై యూఎస్ కాన్సులేట్ లో ఇంటర్వ్యూకి హేమనాధ్ హాజరయ్యాడు. ధ్రువ పత్రాలను పరిశీలించిన యూఎస్ కాన్సులేట్ అధికారులు …హేమనాధ్ సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీ ధృవపత్రాలుగా గుర్తించి…చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు …యూఎస్ కాన్సులేట్ ఫిర్యాదు చేసింది. వెంటనే హేమనాధ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నరసరావుపేటకి చెందిన ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు నకిలీ ధ్రువ పత్రాలు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. హేమనాధ్ తో పాటు మరికొందరు విద్యార్థులకు కూడా హరిబాబు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నర్సారావుపేటలోని ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ లో పోలీసులు తనిఖీలు చేసి కంప్యూటర్, రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని హరిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు. నకిలీ సర్టిఫికెట్లు ఎవరైనా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Andhra Pradesh News
ఒంగోలు మెడికల్ కాలేజీలో జరిగిన గంజాయి బ్యాచ్ దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రజల ఆరోగ్యాలు కాపాడే భావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆస్పత్రిలో పేషెంట్లు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా మారాయని ఆరోపించారు. మత్తుకు బానిసైన కొంతమంది మెడికోల హింసాప్రవర్తన చూశాక రాష్ట్రంలో పరిస్థితిపై భయమేస్తోందన్నారు. స్కూల్లో విద్యార్థులు గంజాయికి బానిసలు కావడం యువగళం పాదయాత్రలో చూశానని చెప్పారు. ఈ క్రమంలో యువత భవిత నాశనం అవుతుందనే ఆందోళనతో ఏపీలో డ్రగ్స్ దందాలను కట్టడి చేయాలని గతంలో ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. అయినా ఏపీలో గంజాయి తీవ్రత తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు టీడీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
Read Also..
Read Also..
పొట్లూరు గ్రామంలో 2.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ను ప్రారంభించిన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి . పొట్లూరు సబ్ స్టేషన్ ప్రారంభించడం వలన దాదాపు 6 గ్రామాలకు గృహ మరియు రైతు అవసరాలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు నేటితో ఆరు గ్రామాల రైతుల కష్టాలకు మరియు లో వోల్టేజ్ సమస్య తీరనుంది, ఒక్క గుడ్లూరు మండలంలోనే 5వ సబ్ స్టేషన్. సబ్జేషన్ ప్రారంభోత్సవంలో కేవీజీ సత్యనారాయణ ( ఎస్ ఈ ) ఒంగోలు. అత్తంటి వీరయ్య (ఈ ఈ ) కందుకూరు. కట్టా వెంకటేశ్వర్లు (ఈ.ఈ ) శ్రీనివాస రావు (ఏ.ఈ ) గుడ్లూరు వైస్ ప్రెసిడెంట్ పులిపాటి ఈశ్వరయ్య, ఎంపీపీ పులి రమేష్, జెడ్పీటీసీ కొర్శిపాటి బాపిరెడ్డీ, ఎంపీటీసీ జనిగర్ల రాజ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ గుడ్లూరు మండలం కన్వీనర్ కాపులురి కృష్ణ,గుడ్లూరు మండల జేసీస్ కన్వీనర్ గాజుల కిషోర్, మాజీ ఏఎంసీ చేరుకురి సూర్యనారాయణ చిరువెళ్ల శ్రీనివాసరాజు, ఉమ్మడి పోలు సుబ్బారావు,కర్పూరపు వెంకట రమణయ్యా, కంపరజు రామరాజు,చేవురు జైపాల్, పులిపాటి శ్రీరాములు,షేక్ రహ్మతుల్ల,కంపరాజు సాంబశివరాజు,చలంచర్ల శ్రీనివాసరావు,గుడ్లూరు మండలం అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, నక్కల శ్రీనివాసులు,నక్కల రామకృష్ణ,పాటి వెంకటేశ్వర్లు, చిత్తారి మాధవ, చిత్తారి మల్లికార్జున, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
కాణిపాకం దేవస్థానం సమీపంలో అన్య మతా ఫోటోలు ఉంచారని బిజెపి నాయకులు ఆందోళన చేయడం జరిగింది, ఈ విషయంపై దేవస్థానం చైర్మన్, ఈవో వివరణ ఇవ్వడం జరిగింది, నవ్య అనే మహిళ తన ఇంటిలో ఉన్న దేవుల్లా ఫోటో ఫ్రేమ్ విరగడంతో ఉంచకూడదని కారణం చేత దేవస్థానం సన్నిధిలో ఉంచానని వేరే కారణం అంటూ ఏమీ లేదుఅని తెలియకుండా తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది, ఈ విషయంపై దేవస్థానం ఈవో తెలియకుండా పొరబాట్లు కొన్ని జరుగుతుంటాయి, దేవస్థానం పవిత్రతను కాపాలని అందరూ సహకరించాలని కోరడం జరిగింది.
ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ గుంతకల్ పరిధిలో ఎస్పీ అనంతపూర్ వారి ఆదేశాల మేరకు మరియు ASP SEB అనంతపూర్ వారి సూచనలతో కర్ణాటక అక్రమ మద్యం రవాణాపై దాడులు నిర్వహించడమైనది. ఈ దాడులలో ధోనిముక్కల ఏరియాకు చెందిన బోయ భాస్కర్ అతని తండ్రి బోయ ఓబులేషు మరియు బోయ నాగరాజు అనే ముగ్గురు వ్యక్తులను హంద్రీనీవా కాలువ కసాపురం వద్ద అదుపులోకి తీసుకుని వారి నుంచి మొత్తం 30 బాక్సుల కర్ణాటక మద్యం మరియు ఆ మద్యం బాక్సులను రవాణా చేయ డానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొనడం అయినది. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడమైనది. ముద్దాయిలు కర్ణాటక మద్యం ను రాయచూరు జిల్లా గిలక సుగుర్ మద్యం షాప్ ల నుండి కొని వాటిని ఓపెన్ wagan గూడ్స్ రైలు లో మంత్రాలయం రోడ్ స్టేషన్ వద్ద లోడ్ చేసుకొని గూడ్స్ కు వాక్యూమ్ తిసియేయడం ద్వారా గూడ్స్ ను ఆపి నంచర్ల స్టేషన్ వద్ద మద్యం బాక్సులు దింపుకొని ఆటో లో గుంతకల్ కు తీస్తుండగా పట్టుకొనడం జరిగింది. మొత్తం 2880 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొనడం అయినది. దాడులలో ఎస్సై చంద్రశేఖర్ మరియు సిబ్బంది రంగనాయకులు, సురేష్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ ఈరోజు హుండీ లెక్కింపు (21-11-2023): 20 రోజులకు నగదు: రూ.3,34,32,887/- లు, కానుకల రూపములో బంగారం: 935 గ్రాములు, వెండి: 7 కేజీల 328 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు. ఈరోజు హుండీ లెక్కింపు నకు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ కె.ఎస్ రామారావు గారు, దేవాదాయ శాఖ అధికారులు, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. online నందు e – హుండీ ద్వారా రూ. 89,817/-లు విరాళముగా భక్తులు చెల్లించుకొన్నారు
రాష్ట్రంలో ఈ చలనా కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ ని అరెస్టు చేశాం. ఈ చలనా కేసులో మరో ఇద్దరు డైరెక్టర్ల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది.. ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఈ చలనాలు nic అనే కంపెనీ ద్వారా నుంచి కట్టే విధంగా రూప కల్పన చేస్తున్నారు. ఈ చలనా కేసులో టెండర్ల ప్రక్రియను కుంభ కోణం కేసులో డిజిపి ఆధ్వర్యంలో లోతైన విచారణ జరుగుతుంది.. ఈ చలనా కేసులో 36.58కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చలనా కేసులో 16ఆస్తులను గుర్తించి సిజ్ చేశాం వాటి విలువ 13కోట్ల రూపాయలు ఉంటుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఎదుట మావోయిస్టు పప్పులూరు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పాడేరు ఎస్పీ కార్యాలయంలో తూహిన్ సిన్హా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వచ్చందంగా లొంగిపోయిన వారిని ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం పప్పులూరు దళానికి చెందిన సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యులు కిల్లో త్రినాద్ అలియాస్ రాజేష్… కిల్లో బాబూరావు అలియాస్ సుత్తి వీరు మల్కానగిరి జిల్లా ఈతలంక గ్రామస్థులు కాగా, వీరిద్దరూ పప్పులూరు ఏరియా దళ కమాండర్ పార్వతి ప్రోద్బలంతో 2008 సంవత్సరంలో మిలీషియా సభ్యులుగా చేరి, సంవత్సర కాలంలో మావోయిస్టు పార్టీ పప్పులూరు దళంలో కలిమెల, ఏఒబి ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పులు, మందుపాతర పేలుళ్లు, కరువు దాడుల్లో పాల్గొన్నారు. అదే విధంగా లొంగిపోయిన ముగ్గురు మిలీషియా సభ్యులైన కిల్లో రాజు. వంతల భగత్ రామ్, పాంగి సదునో పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. ఇటీవల మావోయిస్టు పార్టీకి ఆదరణ తగ్గిపోవడం, పోలీస్ కాంపులు పెరగడంతో, స్వేచ్ఛగా తిరగలేక ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు కమ్యూనిటీ పోలిసింగ్, ఫ్రెండ్లీ పోలిసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు కల్పిస్తున్న ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు, నిరుద్యోగ గిరిజన యువతకు వ్యాపార నిమిత్తం బ్యాంక్ రుణాలు అందించే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయంతో స్వచ్చందంగా లొంగిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భముగా ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిశోర్, జీ.కే.వీధి సిఐ జి.అశోక్ కుమార్, సీలేరు ఎస్సై జె.రామకృష్ణల సేవలను కొనియాడారు.
పెదనందిపాడు మరియు కాకుమాను మండలాలకు కలిపి ఓట్లు సవరణ మరియు చేర్పుల నిర్వహణ కమిటీ పర్యవేక్షణ. ఇందులో భాగంగా పంచాయతీ సెక్రటరీలు వీఆర్వోలు గ్రామ సచివాలయ సిబ్బంది లు అందరితో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఆర్డిఓ పీ శ్రీకర్ పెదనందిపాడు ఎమ్మార్వో ఎస్ కే మహబూబ్ సుభాని కాకుమాను ఎమ్మార్వో ప్రసాద్ కలిసి పెదనందిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో ఓట్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా దొంగ ఓట్లు చేర్చకుండా జాగ్రత్తగా పరిశీలించాలని వీఆర్వోలకు సచివాలయ సిబ్బందికి ప్రతి గ్రామంలో ఓట్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని దీనికిగాను మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మునిసిపల్ అధికారులు చేపట్టిన ఫ్లెక్సీలు తొలగింపు వివాదం గా మారింది. అధికార వైసిపి పార్టీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించకుండా టిడిపి జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని టిడిపి జనసేన నేతల ఆందోళన కు దిగారు. మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు దీంతో నర్సాపురం పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితిలు నెలకొన్నాయి. ఫ్లెక్సీలు తొలగింపు నిలుపుదల చేయాలని రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిడిపి జనసేన నేతలు మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని వైసిపి బస్సుయాత్రకు పెట్టిన ఫ్లెక్సీలను తొలగించుకుండ జనసేన ఇన్చార్జ్ బోమ్మడి నాయకర్, చాగంటి మురళీకృష్ణ, టిడిపి కి చెందిన కొవ్వలి నాయుడు ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ సంఘటన ప్రాంతానికి రావాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో రహదారి కి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.





Total views : 199274