ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది. ఆయకట్టుకు నీరు విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు. పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు. బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలలోని 26 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఇటీవలి ఐఎబి సమావేశంలో టిడిపి నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. రైతుల పట్ల దొంగ ప్రేమ ప్రదర్శించారని ఆరోపించారు. టిడిపి వాళ్లకు ఇన్నాళ్లూ కనబడని ప్రేమ ఎన్నికలు వస్తున్నాయనగా పుట్టికొచ్చిందన్నారు.
Andhra Pradesh News
ఏలూరు శివారు సత్రంపాడులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వాక్ విత్ అంబటి, కోటారు పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు. అనంతరం సియా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ , రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీల మధ్య ఫ్రెండ్ క్రికెట్ మ్యాచ్ ని అంబటి రాయుడు ప్రారంభించారు. వరల్డ్ కప్ లో వరస విజయాలను సొంతం చేసుకున్న భారత్, ఆస్ట్రేలియాతో తలపడి ఓడ పడం చాలా బాధాకరమని అన్నారు. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు కోరిన చోట తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అన్నారు.
తిరుపతి అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని ఎక్కడి నుంచో వచ్చి తిరుపతిలో బిజెపి పార్టీ ద్వారా పరిచయమై అంచలంచలుగా ఎదిగిన తిరుపతి ప్రజలు బిజెపిలో భాను ప్రకాష్ రెడ్డికి ఓ స్థానం కల్పించారు. అలాంటి తిరుపతి ప్రజలకు అన్యాయం చేసే విధంగా భాను ప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నాయకులు అజయ్ కుమార్. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆయా ప్రాంతాలలో ఉన్న వాటిని అభివృద్ధి చేయాలని జీవోనే చెబుతుండగా దీనిని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పేదల పక్షాన నిలబడే శ్రీహరే అభివృద్ధి చేస్తానంటుంటే దీనిని ఓర్వలేక అడ్డుకోవడం మంచిది కాదని, ఒక్క శాతం నిధులు తో తిరుపతి అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనే బిజెపి నాయకులు ఈరోజు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో అనేక డివిజన్లు కనీసం కాలువలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని, స్మార్ట్ సిటీగా ఏర్పడినా.. స్మార్ట్ సిటీ నిధులతో ఆడిటోరియాలు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారే తప్ప స్లమ్మ్ ఏరియాలలో ఉన్న వాటిని డెవలప్ చేయడం కుదరదని, అందుకు టిటిడి నిధులను వాడుకుంటే తప్పేమని ప్రశ్నించారు. తిరుపతిలో ఉన్న డివిజన్లో ఎక్కువ శాతం వెనుకబడిన అన్నగారికి వర్గాలు చెందినవారు ఉన్నారని, అటువంటి ప్రాంతాలను భూమన కరుణాకర్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ఆ ప్రాంతాలను సైతం అభివృద్ధి చేయాలని పాటుపడుతుంటే దీనికి అడ్డు పుల్ల వేయడం బిజెపికి తగదని తనదైన శైలిలో బిజెపి నాయకులపై విరుచుకుపడ్డారు అజయ్ కుమార్.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ఈనెల 21 అనగా రేపు సూళ్లూరుపేట రానున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి కి భారీ బందోబస్తు చేస్తున్న అధికారులు. రేపు సూళ్లూరుపేట కు చేరుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా దాదాపుగా 2,000 మంది పోలీసుల తో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం…….
గుంటూరు జిల్లా సంగం డెయిరీ డైరక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో అరెస్ట్ చేసి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు నమోదైంది. సంగండైరీలో పాల విక్రయానికి సంబంధించి బోనస్ 14 శాతం ఇవ్వమని అడిగినందుకు, డెయిరీ వద్దకు మాట్లాడదామని పిలిచి దాడి చేసినట్లు భాదితుడు రాము ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడిలో 3కార్లు ధ్వంసం చేసి, కర్రలు, హాకీ స్టిక్స్‌తో దాడి చేసారంటూ ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితునిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Read Also..
Read Also..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్ అని అన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు ఒక గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర సంపద దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ అని విమర్శించారు. జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా సీఎం గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థకు జగన్ సర్కార్ ఇప్పటికే 255 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి 7 గ్యారెంటీ లెటర్స్ మంజూరు చేసిందన్నారు. అయినవారికి దోచిపెట్టేందుకు రూల్స్‌కు విరుద్ధంగా గ్యారెంటీ లేఖలు ఇస్తున్న జగన్ సర్కార్. ప్రజాశ్రేయస్సుతో ముడిపడి ఉన్న అనేక పథకాలు. పనులకు మాత్రం వేలకోట్లు బకాయిపెట్టి, రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
మండల కేంద్రం ఉలవపాడు లోని జి. వి.ఎస్.ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జిలానిభాష కళాశాల విద్యార్థుల సంఖ్య గురించి ప్రశ్నించారు కళాశాల విద్యార్థుల సంఖ్య పెంచాలని అందుకు అవసరమైన మౌలికవస్తులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు కళాశాల లో విద్యను మధ్యలో వదిలేసిన విద్యార్థులతో మరల పరీక్ష రాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కళాశాలలో ట్యూబ్ లైట్లు వారంలో బిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయనతో ఆర్ జె డి సుబ్బారావు జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని సబ్ కలెక్టర్ శోభిక డిప్యూటీ శ్రీనివాసులు విద్యాశాఖ అధికారులు ప్రసాద్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు
తిరుపతిలో క్రికెట్ క్రీడాభిమానులకు ఆంద్రా క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా బాయ్స్, అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ వారు తీపి కబురు అందించారు. ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు అతిపెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర క్రీడా మైదానంలో మధ్యాహ్నం 1 గంటల నుంచి మ్యాచ్ ముగిసేంత వరకు నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 12 అడుగుల ఎత్తు 36 అడుగుల వెడల్పు కలిగిన అతి పెద్ద స్క్రీన్ లు, డీజే సౌండ్స్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేశామని, ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ పోటీలను అభిమానులు అందరూ ప్రశాంతంగా వీక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సుమారు 7 వేల నుంచి 10 వేల మంది ఒకే చోటు నుంచి క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అక్కడకు వచ్చిన క్రికెట్ అభిమానులు అందరికీ ఉచిత ప్రవేశం, రాత్రి భోజనం ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆనందంగా క్రికెట్ మ్యాచ్ వీక్షించాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక ఆహ్వానితులు తుడా చైర్మన్ చెవి రెడ్డి మోహిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు
విజయనగరం జిల్లా లక్కవరపుకోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలి 5 గురికి తీవ్ర గాయాలు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. వీరిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించారు. ఉదయం టీ పెట్టుకుందామని గ్యాస్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఘటన జరిగిందని సమాచారం. గాయాలు పడిన వారికి ప్రధమ చికిత్స చేసి విశాఖ కె.జి.హెచ్ కు తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన వారు గాయ పడిన వారి వివరాలు తామరాపల్లి వెంకటలక్ష్మి 50 సం,, ప్రాణవి 7 సం,, కెల్లా మోహన్ 10 సం,, కెల్లా లాష్య 8 సం,, కెల్లా శ్రావణి 30 సం,, సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి.. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఎల్.కోట గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరిగిన గ్యాస్ సిలిండర్ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోని గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి, వెంటనే బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు





Total views : 199245