కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల..
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో కోడంగల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ కు మద్దతుగా కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, బిజెపి నాయకులు చీకోటి ప్రవీణ్ కుమార్ లు హాజరై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రచార సభలో మాట్లాడుతూ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేశారని అన్నారు… ప్రపంచంలోని దేశాల్లో భారతదేశం ఆర్థిక రంగంలో ఐదవ స్థానంలో ఉందని, వచ్చే ఐదేళ్లలో మూడవ స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ ను గెలిపిస్తే, రైల్వే లైన్ తో పాటు, పలు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.అనంతరం చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ….ధర్మం కోసం, దేశం కోసం పోరాడే బంటు రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ లో అందరూ c m క్యాండెట్ లే నని ఎద్దేవా చేశారు.హిందూ మిత్రులారా మీరు తప్పకుండా బా జ పా కి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
Bjp
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 25వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడులో రోడ్ షో, ఈనెల 28న నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ భారీ బహిరంగ సభ ఉంటుందని బిజెపి అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి తెలిపారు. అమిత్ షా.. రోడ్ షో లో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, కన్వీనర్ దూడల బిక్షం పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ప్రచారం పూర్తయిందని, కేవలం మున్సిపాలిటీల్లో మాత్రమే ప్రచారం మిగిలి ఉందని చల్లమల్ల అన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా… ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని… ఈసారి మునుగోడు గడ్డపై కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని చల్లమల్ల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బండి కి జాకీలు వేసి బిజెపి, జనసేన పార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీకి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నాయని. ఇందులో భాగంగా బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలనుకుంటుంన్న శ్రీవారి ఒక శాతం నిధులను వ్యతిరేకించడం లోనే అంతరార్థం బయట పడింది అని వైసీపీ నేతలు ముద్ర నారాయణ, బాలిశెట్టి కిషోర్, వాసు యాదవ్, దొడ్డ రెడ్డి మురళి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత చరిత్రలో భాను ప్రకాష్ రెడ్డి కౌన్సిలర్ గా, టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసిన కాలంలో కమిషన్ లేనిదే పనిచేయ డన్న కీర్తిని గడించారన్నారు. దీనిని బట్టి చూస్తే నేడు ఎంత సంపాదించడానికి ఒక శాతం నిధులకు అడ్డుపడుతున్నాడని అనుమాన వ్యక్తం చేశారు. దీనివలన ప్రత్యక్షంగా కారు తదితర ప్రైవేటు వాహనాల కార్మికులు, పరోక్షంగా తిరుపతి ప్రజలు, భక్తులు, ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భానుకు కళ్ళు తెరిపించాలని వెంకన్నను వేడుకుంటున్నాము అన్నారు.
Read Also…
Read Also…
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1200 మంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి కృష్ణమాచార్యులను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదే నా ఇజం హ్యూమనిజం అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు జనసేన అండగా ఉంటుందని వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చలమల కృష్ణారెడ్డి సతీమణి రజిత రెడ్డి గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. మునుగోడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఇక్కడ యువకులలో నూతన జోష్ కనిపిస్తుందన్నారు. ఇక్కడ పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు మునుగోడు లో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. నూతన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
ఏపీలో జనసేనతో తమ పార్టీ పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రెండు పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇతర పార్టీలను కూడా కలుపుకు పోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తామన్నారు. జనసేనతో పొత్తుపై మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్ నుంచి మా పార్టీ బలోపేతం అవడానికి పని చేస్తుంది. ఏపీ అధ్యక్షులు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికే నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉంది. ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్లా పోటీ చేస్తోంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. కమ్యూనిస్టులు దిక్కు తోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు దాదాపుగా కనుమరుగయ్యారు. తెలంగాణలో ఒకటో రెండో సీట్లు పొందారు. ఏపీలో కూడా సీట్ల కోసం కమ్యూనిస్టులు ఇలా మాట్లాడుతున్నారు’’ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో ప్రగతి మైదానంలో లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రగతి మైదానం నుండి భారీ కాన్వాయి తో ప్రకాశం మైదానానికి చేరుకోనున్నారు. బీజేపీ బలపరిచిన జనసేన కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి లక్కినేని సురేందర్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంల నలుమూలల నుంచి పవన్ కళ్యాణ్అ భిమానులు సభకు హాజరుకానున్నారు. బీజేపీ, జనసేన కార్యకర్తలు సుమారు 80 వేల మంది వరకు పవన్ సభకు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు పార్టీ నేతలు.
Read Also..
Read Also..
తెలంగాణ ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని, కానీ ప్రజలు మోసపోవద్దని బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. కర్ణాటకలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విఫలమైందన్నారు. అక్కడ ఐదు హామీలను అమలు చేయలేకపోయిందని, తెలంగాణ ప్రజలు ఆరు హామీలతో మోసపోవద్దని హెచ్చరించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తోందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి కాలనీలు, బస్తిలలో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఐదేళ్ళపాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలే గెలిపిస్తాయంటున్న బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి.
ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మ్యాచ్‌ను వీక్షించేందుకు మోదీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందని ఆయన విమర్శించారు. ఇండియా దాదాపు ప్రపంచకప్‌ను గెలుచుకుందని కాకపోతే ఓ చెడు శకనం వారిని ఓడిపోయేలా చేసిందని మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో ఈ విషయం చూపించరని కానీ దేశ ప్రజలకు అది తెలుసని అన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన జట్టు గెలిచేదేనని అయితే ఓ చెడు శకనం మ్యాచ్‌కు రావడం వల్ల మనోళ్లు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని, ఖండించదగినవని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మానసిక అస్థిరతకు ఆయన మాటలు అద్దంపడుతున్నాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.
Read Also..





Total views : 91154