తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ప్రవళిక వంటి యువత ఆత్మహత్యలు జరగకుండా చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అత్యంత అవినీతిమయ ప్రభుత్వం కేసీఆర్‌దే అన్నారు. అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఓవైసీ ఒత్తిడికి లొంగి కేసీఆర్… రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఉమ్మడి ఏపీకి రూ.2 లక్షల కోట్లు ఇస్తే, మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించామని అమిత్ షా వివరించారు.
Bjp
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాసేపట్లో మానిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అన్నివర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలా దశదిశ పేరుతో కమలం పార్టీ మ్యానిఫెస్టోను రెడీ చేసినట్లు తెలిసింది. ధరణి స్థానంలో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటివాటిని మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఇక మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను ఓ సారి పరిశీలిస్తే ధరణి స్థానంలో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత సబ్సిడీపై విత్తనాలు వరి పంటకు బోనస్ ఆడబిడ్డ భరోసా పథకం కింద 21ఏళ్ళు వచ్చేసరికి 2లక్షల రూపాయలు చెల్లించడం. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు. ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు. పీఆర్సీపై రివ్యూ ప్రతి ఐదేళ్లకొకసారి పీఆర్సీ, జీఓ 317 పై పునః సమీక్ష, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు, 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి, రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు, అన్ని పంటలకు పంట భీమా…భీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందేచాలని నిర్ణయం, 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10లక్షల ఉద్యోగాలు
వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం తదితర అంశాలపై బీజేపీ మానిఫెస్టోను ప్రకటించనుంది.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిరణ్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడని పరిగి పట్టణంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పరిగి ప్రజలు గతంలో ఎమ్మెల్యేగా గెలిపించారని అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మారుతి కిరణ్ కు అవకాశం ఇవ్వాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే బిజెపి పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి బిజెపి అభ్యర్థి మారుతి కిరణ్, నాయకులు ఆంజనేయులు, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి. సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆ పార్టీలు తెర ముందు విమర్శలు, తెర వెనక ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. మధ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పిచ్చోళ్లని అన్నారు. కేసీఆర్ సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిందని ఆరోపించారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు విజయశాంతి. తన రాష్ట్రమే తనకు ముఖ్యమని అనుకోని రాజకీయాల్లో ఉన్నానని అన్నారు విజయశాంతి. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా తెలంగాణకు వచ్చినప్పుడు విమర్శలు చేయడం వదిలేయడం ఇదో తంతుగా మారిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన విజయశాంతి కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందన్నారు. కాంగ్రెస్ లో తన పాత మిత్రులను కలుసుకోవడం అనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ను గద్దెదించే పార్టీతోనే తాను నడుస్తానన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికార మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చలమల్ల కృష్ణారెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి… గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ… స్థానికుడినైన తనను గెలిపించాలని కోరారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, కాంగ్రెస్ అహంకార అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండి మునుగోడు నియోజకవర్గాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ప్రభాకర్ రెడ్డి తన సొంతంగా నిధులు తెచ్చిన దాఖలాలు లేవని కృష్ణారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్లి నిద్రపోవడానికి తప్ప నియోజకవర్గ సమస్యలపై పోరాడింది ఏమీ లేదన్నారు. ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మునుగోడును సమగ్రంగా అభివృద్ధి చేస్తానని చలమల్ల కృష్ణా రెడ్డి కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డికి గ్రామ యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన స్థానికుడినైనా తనను గెలిపించాలని ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్ అహంకార అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి మునుగోడు నియోజకవర్గాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ప్రభాకర్ రెడ్డి తన సొంతంగా నిధులు తెచ్చిన దాకాలు లేవని అసెంబ్లీకి నిద్రపోవడానికి తప్ప నియోజకవర్గ సమస్యలపై పోరాడింది ఏమీ లేదని ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో విద్యా, వైద్యం, రోడ్లు, త్రాగునీరు ప్రాజెక్టులు తీసుకొస్తానని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి ఓట్లను అభ్యర్థించారు.
Read Also..
ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం నియోజకవర్గం ఈ నెల 19వ తేదీన హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి స్టార్ క్యాంపైనర్ ఈటెల. రాజేందర్ గోదావరిఖనికి రానున్నారని బిజెపి పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి తెలిపారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మంచిర్యాలకు చేరుకుంటారని అక్కడ సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన గోదావరిఖనికి రానున్నారని మొదటగా గోదావరి నది బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగే సభకు హాజరవుతారని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సంధ్యారాణి ఒక ప్రకటనలో కోరారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మారేడుపల్లి కాలనీలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలను జరిగిన అవకతవకలను సాక్షాదారులతో సహా బయటపెట్టిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయకుండా లక్షల రూపాయల మధ్యవర్తులతో దండుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే స్వర్గీయ సాయన్న కూతుర్లు ఎంత అవినీతికి పాల్పడ్డారని ఈ దుస్థితి తీసుకువచ్చి రోడ్డున పడేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయమని కుండ బద్దలు కొట్టిన స్థానిక ప్రజానీకం రోజు కూలికి పోతేనే పుట్ట గడిచే పరిస్థితులలో ఉన్న మా పొట్ట కొట్టి లక్షల రూపాయలు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని వసూలు చేసిన వారితో పాటు డబ్బులు ఇచ్చిన వారికే డబల్ బెడ్రూంలు మంజూరయ్యాయని అంతేకాకుండా ఇచ్చిన వారికి కూడా ఎటువంటి సదుపాయాలు లేకుండా మంచినీటికి కానీ లిఫ్ట్ కానీ పనిచేయకపోవడం స్థానిక ప్రజానీకం ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. మీకు అండగా నేనున్నానంటూ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ వారికి చేయూతనిచ్చారు. జరిగిన అన్యాయము అక్రమాలను సాక్షాదారాలతో అధికారులకు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని వారు అన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పలు మసీదుల వద్ద వివిధ రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. శుక్రవారం ముస్లింల ప్రత్యేక నమాజు ల అనంతరం పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. పోటాపోటీగా పార్టీల ప్రచార నినాదాలతో మసీదుల వద్ద అభ్యర్థుల అనుచరులు సందడి చేశారు. కాగా అభ్యర్థులు ఒకరికొకరు తారస పడిన ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తమ ప్రచారం ముగించుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also….
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో వేగం పెంచుతూ క్షణం తీరిక లేకుండా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. రోజుకో కొత్త వ్యూహంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితం ఎలా వచ్చినా ప్రయత్నలోపం మాత్రం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రచారంలో ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజవర్గంలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. నేనంటే నేను అనే రీతిలో ఎవరికీ తోచిన విధంగా వారు ఢీ అంటే డీ అంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందన్నారు. రాబోయే కాలంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. భూపాలపల్లిలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న తనను ముచ్చటగా మూడోసారి గెలిపిచాలని గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ సర్కార్ మాటలు తప్ప చేసిందేమీ లేదన్నారు. భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని సత్యనారాయణరావు తెలిపారు. అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని రాష్ట్రంలో బిజెపికి అధికారం అప్పగిస్తే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మీ యొక్క ఆడబిడ్డగా నన్ను గెలిపిస్తే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తానని కీర్తి రెడ్డి తెలిపారు. మొత్తానికి ఎవరూ తోచిన విధంగా వారు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మరి ఓటరు మహాశయుడు ఎవర్ని కరుణిస్తాడో వేచి చూడాలి.





Total views : 90766