Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana కాసేపట్లో బీజేపీ ఎన్నికల మానిఫెస్టో విడుదల

కాసేపట్లో బీజేపీ ఎన్నికల మానిఫెస్టో విడుదల

by Satya
Amit Shah

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాసేపట్లో మానిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అన్నివర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలా దశదిశ పేరుతో కమలం పార్టీ మ్యానిఫెస్టోను రెడీ చేసినట్లు తెలిసింది. ధరణి స్థానంలో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటివాటిని మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఇక మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను ఓ సారి పరిశీలిస్తే ధరణి స్థానంలో మీ భూమి యాప్‌, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత సబ్సిడీపై విత్తనాలు వరి పంటకు బోనస్ ఆడబిడ్డ భరోసా పథకం కింద 21ఏళ్ళు వచ్చేసరికి 2లక్షల రూపాయలు చెల్లించడం. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్‌లు మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు. ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటు. పీఆర్సీపై రివ్యూ ప్రతి ఐదేళ్లకొకసారి పీఆర్సీ, జీఓ 317 పై పునః సమీక్ష, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు, 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి, రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు, అన్ని పంటలకు పంట భీమా…భీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందేచాలని నిర్ణయం, 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10లక్షల ఉద్యోగాలు
వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం తదితర అంశాలపై బీజేపీ మానిఫెస్టోను ప్రకటించనుంది.

Advertisements

You may also like

Our Visitor

026145
Total views : 149967

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.