Business news
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మజీ సీఎం, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తొలిసారి ప్రజలను కలిశారు. చింతమడక గ్రామానికి చెందిన ప్రజలు ఆయనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు, ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు, 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. అనంతరం కేసీఆర్ తో చింతమడక గ్రామస్తులు మాట్లాడి వెనుదిరిగారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిని హామీ ఇచ్చారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబులం పూజలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి. అయ్యప్ప మాలధారణం నియమాల తోరణమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ని వారి స్వగృహంలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబలం పూజలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. అంబులం పూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 మెట్ల మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అయ్యప్ప మాలధారణ స్వాములు, గురుస్వాముల భక్తి పాటలతో ఈ ప్రాంతం పులకరించింది. పూజ అనంతరం సుదర్శన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భిక్ష ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ఆరోగ్య రక్ష అని అన్నారు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థమన్నారు. ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై సంపూర్ణ ఆరోగ్యం క్రమశిక్షణతో కూడినజీవన విధానం , ధార్మిక భావాలు అలవడు తున్నాయన్నారు. కార్తీక మాసంచాలా విశిష్టమైనదని, నియోజకవర్గంలో కార్తీక మాస శోభ సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య,వైస్ ఎంపిపి సుబ్బరాయుడు, సర్పంచులు వెంకట నారాయణరెడ్డి , జనార్దన్ రెడ్డి, ఎంపిటిసి లు లక్ష్మీ నారాయణ,జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, బలరామ్ నాయక్, సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు. డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్ శాండిల్యా. రేవంత్ రెడ్డిని విమానాశ్రయంలో కలిశారు. అనంతరం నేరుగా ఎల్లా హోటల్ కు వెళ్లనున్నారు.
ప్రకాశం, యర్రగొండపాలెంలో ఓ కేసు విషయమై మోజేశ్ అనే యువకున్ని పొలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. కౌన్సెలింగ్ ఇచ్చారనే అవమానంతో యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన మోజేశ్ అనే యువకుడు. మంటలు అర్పిన పోలీసులు గాయపడ్డ యువకుడు మోజేశ్ ను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురంలోని ఓబుల్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్య యత్నం చేసుకున్న యువకుడి బంధువులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. రోడ్లపై టైర్లు కాల్చి ధర్నా చేస్తున్న యువకుడి బంధువులు, యర్రగొండపాలెం లో ఉద్రిక్త వాతావరణం….
ఈనెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే 2ఏ బొగ్గు గనిపై అర్జీ1 నాయకులు హరిన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో కేంద్ర నాయకులు సారంగపాణి రమాకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. గత కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించేందుకు బిఎంఎస్ కృషి చేస్తుందని అన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ పరంగా పరిష్కరిస్తామని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి ఫలితంగానే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని 27న జరిగే గుర్తింపు ఎన్నికల్లో “కాగడా” గుర్తుకు ఓటు వేసి బిఎంఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం ఉదయం 8.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం చేరుకుని అక్కడ పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు, అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు, అనంతరం తాడేపల్లి చేరుకుంటారు.
Read Also..
కేసీఅర్ ను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి కేసీఅర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు తొమ్మిది బస్సులలో సుమారు 540 మంది గ్రామస్తులు కేసీఅర్ ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు. కేసీఅర్ ను కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఫార్మ్ హౌస్ పోలిస్ సిబ్బంది ఫార్మ్ హౌస్ చెక్ పోస్ట్ వద్ద ఆపేశారు. పర్మిషన్ లేనిది లోనికి అనుమతి లేదని ఫార్మ్ హౌస్ లోపల నుండి మాకు సమాచారం ఇస్తే లోపలకు పంపిస్తామని పోలీసులు గ్రామస్తులకు చెప్పడం తో పర్మిషన్ కోసం గ్రామస్తులు మూడు గంటలు వెయిట్ చేశారు. ఆ తర్వాత కేసీఅర్ ను కలసి వెళ్లిపోయారు