అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో నివాసముంటున్న దంపతులు రవి దేవీలు చిన్నపాటి విషయంపై తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మద్యం తాగినందుకు డబ్బులు ఇవ్వలేదు అంటూ భార్య దేవి పై భర్త రవి గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిలో భార్య తలకు బలమైన గాయమైంది. స్థానికులు కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని దాడికి ఉపయోగించిన గొడ్డలిని దాడికి పాల్పడిన భర్త రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Crime
విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని ఓ ఇంట్లో వంట గ్యాస్ లీకై నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధురవాడ వాంబే కాలనీలో వై.బాలరాజు అనే వ్యక్తి కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు. అయితే.. సరిగా అమర్చకపోవడంతో గ్యాస్ లీకై ఇళ్లంతా వ్యాపించింది. ఈ క్రమంలో దేవుడి చిత్ర పటాల వద్ద దీపారాధన చేయడానికి అగ్గి వెలిగించడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వస్తువులన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Read Also..
Read Also..
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్ గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పీఎస్‌లో సాంబశిరావు కోడలు మాధురి, నిందితులు లొంగిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
పల్నాడు జిల్లా
పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి మూడు దారుణ హత్యలు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి అనంత సాంబశివరావు(50)ను తల్లి అది లక్ష్మి(47) కొడుకు నరేష్(30) ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికిన చంపిన సమీప బంధువులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.
కాకినాడ జిల్లా…
కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు. మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు. ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు. దీంతో మత్స్యశాఖ అధికారులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు .ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారు సూర్యాపేటకు చెందిన గరికెన సత్తిరాజు వయసు56, దుమ్ములపేటకు చెందిన మైలపల్లి కృప దాసు వయసు 35…
నెల్లూరు జిల్లా, ఎస్ పేట మండలం ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గా ప్రాంగణంలో దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్ పై దాడి చేసిన ముగ్గురు యువకులు. అడ్డువచ్చిన సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డ యువకులు. దర్గాలో మహిళలు ఉన్న చోట ఉండకుడదని ఈఓ యువకులకు చెప్పినందుకు వివాదం…
-పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్.
గుంటూరు జిల్లా సంగం డెయిరీ డైరక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో అరెస్ట్ చేసి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు నమోదైంది. సంగండైరీలో పాల విక్రయానికి సంబంధించి బోనస్ 14 శాతం ఇవ్వమని అడిగినందుకు, డెయిరీ వద్దకు మాట్లాడదామని పిలిచి దాడి చేసినట్లు భాదితుడు రాము ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడిలో 3కార్లు ధ్వంసం చేసి, కర్రలు, హాకీ స్టిక్స్‌తో దాడి చేసారంటూ ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితునిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Read Also..
Read Also..
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయాక సెల్ఫీలు దిగి ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనో పెట్టే వారి సంఖ్య పెరిగిపోయింది. కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా.. ఇలా చేసే పనేదైనా సెల్ఫీ దిగడం, దానిని స్నేహితులతో పంచుకోవడం ఎక్కువైంది. నిషేధిత ప్రాంతాల్లోనూ సెల్ఫీలు దిగుతున్న వారు కోకొల్లలు. అయితే, ఈ అలవాటును ఓటేసేటప్పుడు చూపించొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ దిగడం వరకు ఓకే కానీ లోపలికి ఫోన్ తీసుకెళ్లినా, ఓటేస్తూ ఫొటో దిగినా చిక్కుల్లో పడతారని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంపై ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది. పొరపాటునో లేక సిబ్బంది కళ్లుగప్పి లోపలికి తీసుకెళ్లి సెల్ఫీ దిగితే జైలు పాలవుతారని హెచ్చరించింది. ఓటేస్తూ సెల్ఫీ దిగినా. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినా మీ ఓటును పరిగణనలోకి తీసుకోరు. నిబంధనలు అతిక్రమించినందుకు పోలీస్ కేసు నమోదు చేస్తారు. ఆపై జైలుకెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు. మరోవైపు, కళ్లు కనిపించని వారు ఓటేసేందుకు సహాయకుడిని అనుమతిస్తామని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. అయితే, అప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తినే సహాయకుడిగా అంగీకరిస్తామని, సదరు అంధుడు ఎవరికి ఓటేశాడనే విషయాన్ని బహిరంగ పరచబోనని సహాయకుడిగా వెళ్లే వ్యక్తి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
Read Also..
Read Also..
ములుగు జిల్లా మంగపేటలో విషాదం చోటుచేసుకుంది. మల్లూరు అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది.ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా , యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఏటూరునాగారం మండలం కు చెందిన బెజ్జంకి రాజేష్ ,కమలాపురానికి చెందిన మాదరి శిరీష (22) అనే యువతి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నా పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. పెళ్లి చేయరనే మనస్తాపంతో ప్రేమజంట అటవీ ప్రాంతం లోకి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఇక్కుర్తికొండ వద్ద అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం లభ్యం. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు మృతుడు ఇక్కుర్తి గ్రామం గోపనబోయిన వెంకటేశ్వర్లుగా గుర్తింపు చేసారు. నరసరావుపేట లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న మృతుడు వెంకటేశ్వర్లు. సోమవారం నుండి వెంకటేశ్వర్లు అదృశ్యమైనట్లు మృతుని తల్లిదండ్రులు వెల్లడి. మృతుడు వెంకటేశ్వర్లు మరణించి సుమారు మూడు రోజులు అయ్యి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు మృతుడి మరణం ప్రథమశాత్తు జరిగిందా, ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Total views : 90571