తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల అనంతరం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు.
ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని, కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని, జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు.
గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని, తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తాను, రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రూ. 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
cvr
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం అవుతుంది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌కు తెలియజేస్తారు. అయితే, పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది. నిజానికి గత రాత్రే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.
సీఎల్పీ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపి.. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌కు తెలియజేస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను నేడు గవర్నర్‌కు ఈసీ అందిస్తుంది. ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసిన అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది.
నల్లగొండ బైపాస్ లో ట్రావెల్స్ బస్సు దగ్ధం. ఘటనలో మంటల్లో ఓ ప్రయాణికుడు దుర్మరణం. పట్టణ సమీపంలోని నార్కెట్‌పల్లి-అద్దంకి హైవేపై.. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ట్రావెల్స్ బస్సు. ఏసీ డెమో నుంచి మంటలు రావడంతో బస్సును నిలిపేసి. ప్రయాణికులను దింపిన డ్రైవర్. నిమిషాల్లోనే దగ్ధమైన ట్రావెల్స్ బస్సు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడటంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే పరిస్థితి వున్న దృష్ట్యా సోమవారం 4.12.2023 ఒకరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వులను తూ.చా తప్పకుండా పాటించవలసిందిగా ఆ ప్రకటనలో ఆదేశించడం అయినది.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు సందడి చేశారు కార్తీక మాసం మూడవ సోమవారం మల్లికార్జున స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలాగే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించరు కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ లో పాలు, బిస్కెట్లు, అల్పాహారం, మంచినీరు అందిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
నెల్లూరుకు 250 కి.మీ, దూరంలో కేంద్రీకృతమై ఉన్న మీచౌంగ్ తుఫాన్…గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను. రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్. తీవ్రవాయుగుండం కారణంగా శనివారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా నమోదు కురుస్తున్న భారీ వర్షాలు. తీరం దాటే సమయంలో గంటకు 80 -100 కీమీ వేగంతో గాలులు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక…. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న నెల్లూరు జిల్లా యంత్రాంగం. ఇప్పటికే నెల్లూరు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు. మీచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో కోవూరు నియోజవర్గంలో పలు మండలాల్లో ఈదురుగాలితో కూడిన బారి వర్షం. కురుస్తున్న వర్షం దాటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు పలు మండలాల్లో కరెంట్ అంతరాయం.
శివుడు హిందూమతంలో ఒక ముఖ్యమైన దేవుడు. అతను శివలింగం రూపంలో పూజించబడతాడు. శివుడికి అభిషేకం చేయడం ఒక ముఖ్యమైన పూజా విధానం. అభిషేకం అనేది శివుడిని పవిత్రమైన ద్రవాలతో అభిషేకించడం. శివుడికి అభిషేకం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.
- శివుడి అనుగ్రహం పొందడానికి: శివుడు దయగల దేవుడు. అతనిని భక్తితో పూజిస్తే, అతను తన భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. శివుడికి అభిషేకం చేయడం వల్ల అతని అనుగ్రహం పొందవచ్చు.
- పాపాలను పోగొట్టుకోవడానికి: శివుడు పాపాలను పరిహరించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల పాపాలు పోగొట్టుకోవచ్చు.
- మోక్షాన్ని పొందడానికి: శివుడు మోక్షాన్ని ప్రసాదించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల మోక్షాన్ని పొందవచ్చు.
- ఆరోగ్యం మరియు సంపదను పొందడానికి: శివుడు ఆరోగ్యం మరియు సంపదను ప్రసాదించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం మరియు సంపదను పొందవచ్చు.
- కష్టాలను తొలగించడానికి: శివుడు కష్టాలను తొలగించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల కష్టాలను తొలగించవచ్చు.
శివుడికి అభిషేకం చేయడానికి అనేక రకాల ద్రవాలను ఉపయోగించవచ్చు. వాటిలో పాలు, నీరు, పంచామృతాలు, చందనం, పూలు, పువ్వుల రేకులు, ధూపం, దీపాలు మొదలైనవి ఉన్నాయి. శివుడికి అభిషేకం చేయడానికి సరైన సమయం ఉదయం లేదా సాయంత్రం. అభిషేకం చేయడానికి ముందు, శివలింగం శుభ్రంగా ఉండాలి.
శివుడికి అభిషేకం చేయడం ఒక శక్తివంతమైన పూజా విధానం. ఇది శివుడి అనుగ్రహం, మోక్షం, ఆరోగ్యం, సంపద మరియు కష్టాలను తొలగించడానికి సహాయపడుతుంది.
చీట్ మీల్ : ఇది ఒక నిర్దిష్ట ఆహారం లేదా ఆహారాల సమితి, ఇది ఒక నిర్దిష్ట ఆహార ప్రణాళిక యొక్క సాధారణ నియమాలను ఉల్లంఘిస్తుంది. ఇది తరచుగా బరువు తగ్గడం లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తులచే ఉపయోగించబడుతుంది.
చీట్ మీల్లు అనేక కారణాల వల్ల ప్రయోజనకరంగా ఉంటాయి. మొదట, అవి బరువు తగ్గడ ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గడం చాలా కష్టం మరియు నిరాశకు గురవుతుంది. చీట్ మీల్లు మీరు మీ ఆహార ప్రణాళికను అనుసరించడంలో కొనసాగడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి పునరుత్తేజకరంగా ఉండటానికి సహాయపడతాయి.
రెండవది, చీట్ మీల్లు మీరు ఆనందించే ఆహారాన్ని తినాలి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు తరచుగా మీకు ఇష్టమైన ఆహారాలను తినడం మానుకోవాలి. చీట్ మీల్లు మీరు ఆనందించే ఆహారాన్ని తినాడానికి మరియు మీ ఆహార ప్రణాళికను అనుసరించడానికి మరింత సంతోషంగా ఉండటానికి సహాయపడతాయి.
చీట్ మీల్లు కూడా మీ మెటబాలిజంను పెంచడంలో సహాయపడతాయి. మీరు తరచుగా ఒకే రకమైన ఆహారాన్ని తింటే, మీ మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. చీట్ మీల్లు మీ మెటబాలిజాన్ని పెంచడానికి మరియు మీరు మరింత కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి.
చీట్ మీల్లను సురక్షితంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
- మీ చీట్ మీల్‌ను మీ ఆహార ప్రణాళిక యొక్క మొత్తం కేలరీలలో 10% లేదా తక్కువగా ఉంచండి.
- మీరు తినే ఆహారం యొక్క నాణ్యతను పరిగణనలోకి తీసుకోండి. ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోండి, వీటిలో ప్రోటీన్, పండ్లు మరియు కూరగాయలు ఉంటాయి.
- మీ చీట్ మీల్‌ను మధ్యలో లేదా మీ ఆహార ప్రణాళిక యొక్క చివరిలో ఉంచండి. ఇది మీరు మీ ఆహార ప్రణాళికను అనుసరించడం కష్టతరం చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది.
చీట్ మీల్లు బరువు తగ్గడం లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంలో మీకు సహాయపడే ఒక శక్తివంతమైన సాధనం కావచ్చు. అయితే, వాటిని సురక్షితంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచడానికి కొన్ని చిట్కాలను అనుసరించడం.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో రెండవ రౌండ్ పూర్తయ్యేవరకు BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ కు రెండవ రౌండ్ లో బీఆర్ఎస్ 5228 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి కి 1399 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి ఆదం సంతోష్ కు 2615 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు BRS అభ్యర్థి పద్మారావు 6544 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం
12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కు ఐదు ప్రాంతాల్లో ఏర్పాట్లు
1- వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో 5 నియోజకవర్గాల లెక్కింపు -వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం 23 టేబుల్స్ ఏర్పాటు.
14 టేబుల్ లలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 9 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 రౌండ్ లలో లెక్కింపు పూర్తవుతుంది.
పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా మూడు టేబుల్స్ లో పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు జరగనుంది.
2- ములుగు కలెక్టర్ కార్యాలయం అవరణలో ములుగు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 22 రౌండ్ల తర్వాత తుది ఫలితం వస్తుంది.
3- భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియం పక్కన ఉన్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 23 రౌండ్ల లో లెక్కింపు పూర్తవుతుంది.
4- జనగామ పెంబర్తి వీబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
(జనగామ, స్టేషన్గన్పూర్, పాలకుర్తి)
ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్ ఏర్పాటు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు, మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
5- మహబూబాద్ టౌన్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల భవనంలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.





Total views : 196554