అనకాపల్లి జిల్లా, కంటతడి పెట్టుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్. నాకు టిక్కెట్ దక్కలేదని కొన్ని పత్రికలు ఛానళ్ళు రాస్తున్నాయి. అమర్ పనైపోయింది అంటు ప్రచారం చేస్తున్నారు. చిన్న వయస్సు నుండే కష్టాలు చూసిన వాడిని ఇలాంటి వార్తలు వల్ల నేను దిగజారిపోను. అన్నింటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది అది వైసీపీ కార్యకర్త పోస్టు అది ఉంటే చాలు ఇంకేమి అవసరం లేదు. మీతో పాటు కార్యకర్త గా జెండా మోయడానికి సిద్దం ఉన్నా. వీధివీధుల్లో కార్యకర్త గా తిరుగుతా. రాష్ట్రవ్యాప్తంగా ఓ ముఠా తయారైంది. వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం అధికారం వచ్చాక కొంత మందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళు పార్టీలో ఉండటం కంటే వెళ్లడమే మంచిది. నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు. కార్పోరేటర్ గా ఎమ్మెల్యేగా మంత్రి పని చేసా అది చాలు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు భరత్ కు సహకరించాలి.
devotional news
బ్రహ్మ లింగేశ్వర స్వామిభారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్రకలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి.ఆ ఆలయంలో బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం ఉన్నందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంతం బలి ఘట్టంగా పేరుగాంచింది. బ్రహ్మచే ప్రతిష్టింపబడిన ఈ శివలింగానికి ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతాయి. బ్రహ్మ లింగేశ్వర స్వామి హిరణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహ రూపంలో భూమిని చేరుకునే పయనించడం వల్ల ఆ సమయంలో బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తి కోరగా వరాహ రూపంలో ఉన్న విష్ణు. ఈ మార్గం గుండా నదిని ఏర్పడటంతో వరహానది గా పేరుగాంచి నట్లు చెబుతున్నారు. ఈనది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ, ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మ లింగేశ్వర స్వామిబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు, పైకప్పులు సైతం రాతితో నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈదేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు. సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగు వైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురం దేవాలయ నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు. బ్రహ్మ లింగేశ్వర స్వామిఇక్కడి ఆలయం త్రిశూల పర్వతంపై ఉంది. సమీపంలో విభూతి గనులు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది.దేవాలయానికి గల ఆస్తులు నిత్య ధూప, దీప, నైవేద్యాలను సమకూర్చుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. బ్రహ్మ లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, ఏకవార అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. బ్రహ్మ లింగేశ్వర స్వామి ఈ శివలింగానికి ప్రతి సోమవారం భక్తులు వచ్చి అభిషేకాలు చేయించుకున్నారు. అలాగే ప్రతి ఏటా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్న పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆయా పర్వదినాల్లో లక్షలాదిమంది ఉత్సవాలలో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఆ దగ్గర భీమేశ్వరాలయం, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయం క్రీ.శ. మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణేలు. బ్రహ్మ లింగేశ్వర స్వామి తొట్టతొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది.లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేది.మొదట ఇక్కడ కుమార స్వామి గుడి, పూజ ఉండేవిట. అప్పట్లో చౌడేశ్వరి, గణపేశ్వర ఆలయం నిర్మించారు. తర్వాత భీమేశ్వరాలయం. ఈ భీమేశ్వరాలయం క్రీ.శ. రెండవ శతాబ్ది కి చెందినది. ఈ గుడికి జీర్ణోద్ధరణ ప్రక్రియ నిమిత్తం బాగు చేస్తుంది. రెండువేల ఏళ్ల సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి.
విశాఖ జిల్లా పెందుర్తిలో వెలుగులోకి పోలీస్ దాష్టికాలు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే మహిళపై లాఠీ తో కసాయితత్వం చాటుకున్న ASI మురారి. ASI మురారి పేరు చేబితేనే బయబ్రాంతులకు గురౌతున్న చిరువ్యాపారులు ఐ యాం పోలీస్ తాట తీస్తా అంటూ చిరువ్యాపారులపై బండబూతులు. ASI వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత మహిళ. గాయాల బాధను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ, మహిళతో పాటు పలువురిపై విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసిన ASI మురారి. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన.
ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్‌లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతున్నారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడ్డాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం అమ్మవారి ఆలయం. మరి భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతనఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం. ఈ ఆలయం ముండేశ్వరి అనే పర్వతం మీద వుంటుంది. ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా పూజిస్తారు. దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చు. దుర్గా దేవి వైష్ణవి రూపంలోఇక్కడ ముండేశ్వరి మాత దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహన మహీషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. దీనిని 100ఏడి లో నిర్మించారు. అంతకంటే ముందు దానిని 105 ఏడి లో నిర్మించి ఉంటారని దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. ఈ ఆలయం నగరశైలిలో నిర్మించబడి వుంది. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4ముఖాలతో వుంటాడు. రెండు రాతితో చేసిన పాత్ర ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి. ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా వున్నాయి. ఆ కాలం నుండి ఇక్కడ పూజాదికాలనేవి కొనసాగుతూ రావడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలు మారినా పూజ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
అమరావతి, ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి రానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ అధికారులు ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలు, అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితా, ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను అధికారులు పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈసీ నుండి ఆదేశాలు.
అమరావతి, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, వైసీపీ అరకులోయ నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రస్తుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని నియమించడంతో అరకులోయ లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు. ఎంపీ మాధవి బిసి కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని, ఎస్టి కాదని, ఎస్టీకి చెందిన స్థానికేతరుడు కు అరకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని వైసీపీ శ్రేణులు ర్యాలీ, మానవహారం.
శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.
మల్లంపేట ,ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఈ నెల 2న భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని ఫిర్యాదు. తాను ఉదయం 10 గంటలకు పనిమీద మియాపూర్ కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చిన అతనికి భార్యా పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించిన భర్త. ఈ రోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఇంతియాజ్ మహ్మద్. ఫిర్యాదు స్వీకరించిన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.