తూర్పుగోదావరి జిల్లా, గోకవరం రాముల వారి కళ్యాణానికి సిద్ధమైన కోటి తలంబ్రాల పంట ఏటా భద్రాద్రి రాముని కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల పంట కోత వినూత్నంగా సాగింది. వానర్లు వేషధారణతో రైతులు తలంబ్రాలు పంటను కోతల కోశారు. తలంబ్రాలకు అవసరమైన పంటను వానర్లే స్వయంగా పండించుకుని కోతలు కోయడం. చూపరులను ఆకట్టుకుంటుంది. గోటితో వలిచే కోటి తలంబ్రాల పంట కోతలు. గోటితో ఒలిచే కోటి తలంబ్రాల పంటకు పంచామృతాభిషేకం జరిగింది. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో శ్రీరామ భక్తులు వానర వేషధారణలతో రాముని పంట కోత కోశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు తన తల్లి పొలంలో 13 ఏళ్లుగా ఈ పంట పండిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తుల ఆలయంలో పూజించి తీసుకువచ్చిన ధాన్యాన్ని వరి నారువేసి, నాట్లు వేసి, పంట పండిస్తున్నారు. ఈ. పంటపై వచ్చిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రామ భక్తులకు పంపించి గోటితో ఒలిచి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. ఈ. తలంబ్రాలను భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలకు శ్రీరామనవమి పర్వదినం రోజున కోటి తలంబ్రాల కోసం పంపించడమే కాకుండా అయోధ్య రామునికి సైతం పంపించి అక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వానర వేషధారణలో పంట కోత కోయడం నిర్వహించారు. వరి కంకులకు పంచామృతాభిషేకం నిర్వహించి, పొలంలో ఉన్న రాముని ఆలయం వద్ద మహిళలతో శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. వానర వేషధారణలతో ఉన్న రైతులు , కూలీలు రాముని పంట కోత కోశారు. ఆధ్యాత్మిక చింతనతో కొనసాగిన కోటి తలంబ్రాల పంట కోత అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ, కోటి గోటి తలంబ్రాల కోసం పండించిన ఈ ధాన్యాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 800 కేజీల ధాన్యాన్ని రామభక్తులతో గోటితో ఒలిపించి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. భద్రాచలం ఒంటిమిట్ట రామాలయాలే కాకుండా అయోధ్య రామలయానికి లోక కళ్యాణం కోసం తీసుకువెళ్లి స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో మహిళలు, రైతులు పాల్గొన్నారు.
east godavari
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం. కాకినాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న బొగ్గు లారీని వెనుక నుండి డీకొన్న ఐసర్ వ్యాన్. ఒరిస్సా నుంచి 65 మంది వలస కూలీలతో కృష్ణాజిల్లా వెళుతున్న ఐసర్ వ్యాన్ ఈ ప్రమాదంలో పది మంది కి గాయాలు, ముగ్గురు పరిస్థితి విషయం క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు ముగ్గురుని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి తరలింపు. సంఘటన స్థలము చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన దేవరపల్లి పోలీసులు…
ఏపీలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను బీజేపీ, జనసేన నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో ఇసుక సరఫరా దోచుకో, దాచుకో అనే తీరుగా మారిందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ సంస్థ ముసుగులో ఇసుక దందా కొనసాగుతోందని విమర్శించారు. ఇసుక దందా సొమ్మంతా తాడేపల్లికి చేరుతోందని ధ్వజమెత్తారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు చేపట్టవద్దని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు మే నెలతో పూర్తి అయ్యాయని, అయినా ఇష్టానుసార ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని పురందేశ్వరి మండిపడ్డారు.
ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.





Total views : 90644