జిలాల్లో నకిలి గల్ఫ్ ఏజెంట్ల మోసలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో గతంలో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగిందని,నకిలీ గల్ఫ్ ఏజెంట్లు తీరు మార్చుకోకపోతూ ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని,గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.ఈ మేరకు శనివారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారిని మోసం చేసే ఏజెంట్ల పై జిల్లా పోలీస్ ప్రత్యేక నజర్.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా నుంచి ఉపాది నిమిత్తం గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలన్నారు.ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు చేపడతాం అని , జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపాజిల్లా నుండి ఉపాధి కోసం వెళ్ళే వారి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని, నకిలీ వీసాలు ఇచ్చి ,పాస్ పోర్ట్ లు దగ్గర ఉంచుకొని ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఏజెంట్ల పై జిలాల్లో గత సంవత్సరం 34 కేసులలో 38 మందిని అరెస్ట్ చేసి 09 మందిని జైలుకి తరలించడం జరిగిందని, ఈ సంవత్సరం 34 కేసులలో 58 మందిని అరెస్ట్ చేసి ఇద్దరిని జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు.ఉపాధి కోసం గల్ఫ్ వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, గల్ఫ్ దేశాలకు వెళ్ళు వారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించి, వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా సూచించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకొనుటకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 8712656411 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించవచ్చని సూచించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.