హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లను పంపడంతో పాటు ప్రతిపాదిత మార్గాల్లో భూసేకరణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం 2 వేల 787 కోట్లు కేటాయించారు. 24 వేల 269 కోట్లతో రెండో దశ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్చెరు, ఎల్బీ నగర్-హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేర విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్రం కేంద్రానికి పంపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్‌లను సైతం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రెండోదశ ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. ఆర్జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ , జేబీఎస్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట మొత్తం 86.1 కి.మీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 ప్రాజెక్టుకు మొత్తం 19 వేల 579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఫేజ్ 2 ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రెండో దశ మెట్రో విస్తరణలో కిలో మీటరుకు నిర్మాణ అంచనా వ్యయం 318 కోట్లుగా ఉంది. పరిస్థితుల ప్రకారం ఇందులో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని డీపీఆర్‌లో పేర్కొన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ఎలివేటెడ్ మెట్రో, డిజైన్, ఇన్నోవేషన్‌తో హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో మెట్రో రెండో దశ పనులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లకు భూసేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. కేంద్రం నుంచి అనుమతులతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేలోపు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకోసమే 2 వేల 787 కోట్లు కేటాయించింది. మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
hyderabad metro train journey
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు కనెక్షన్ విషయంలో ముఖ్యమైన మలుపు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ప్లాన్ చేసిన ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపేశారు. పాత బాలాపూర్, ఫలక్నామా గుండా ఓల్డ్ సిటీ మీదుగా కొత్త మార్గం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ప్రయోజితమే ప్రధానం:
ఆలేరు-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య 31 కిలోమీటర్ల పొడవు, రూ. 6250 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చింది. దీని ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా రైలు వెళ్లనుంది. అయితే, ఈ మార్గం ప్రజలకు ఎంతో ఉపయోగం కలిగించదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం చేకూరుస్తుందని రేవంత్ భావించారు. అందుకే ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గం పరిశీలించాలని నిర్ణయించారు.
ఓల్డ్ సిటీకి కనెక్షన్:
పాత నగర ప్రజలకు ఎయిర్‌పోర్ట్‌కు సులువైన కనెక్షన్ కల్పించే దిశగా కొత్త మార్గం ప్రతిపాదన ఉంది. ఎల్బీ నగర్, ఫలక్నామా నుంచి చంద్రాయణగూట, ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు రైలు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఓల్డ్ సిటీలోని లక్షలాది మంది ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. అదే కాకుండా, ఐటీ కారిడార్ ప్రాంతంలో కూడా స్టేషన్లు ఏర్పాటు చేస్తే మెరుగుపడుతుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.
పరిశీలన అనంతరం నిర్ణయం:
కొత్త మార్గం పరిశీలన జరుగుతుంది. ప్రయాణికుల అవసరాలు, ట్రాఫిక్ పరిస్థితులు, ఖర్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్గం ఖరారు చేయనున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో విషయంలో సమగ్ర పరిశీలన జరిగి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే రైలు మార్గం ఏర్పాటు కావాలని హైదరాబాద్ వాసులు ఆశిస్తున్నారు.





Total views : 90284