ఇటీవల కాకినాడలోని మెక్లారిన్ మైదానంలో జరిగిన ప్రీక్రిస్మస్ వేడుకల్లో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో 140 రోజుల సమయం ఉందని, తదుపరి సీఎం ఎవరనేది తెలిసిపోతుందన్నారు. రాష్ట్రానికి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉండాలని, అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలనేది తన కోరిక అని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నేను, కన్నబాబు ఎమ్మెల్యేలుగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉండడానికి మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దేవుడి బలమే కారణం’ అని ద్వారంపూడి అన్నారు. స్వేచ్ఛగా ఉండాలన్నా, ప్రార్థనలు చేసుకోవాలన్నా జగన్ సీఎంగా ఉండాలని వేడుకల్లో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చనేది పాస్టర్లు అందరికీ తెలుసునని, రానున్న రోజుల్లో క్రైస్తవవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
jagan mohan reddy
అనంతపురం జిల్లా పామిడి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ పథకాలను, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట అమలు చేయడంతో ఆకర్షితులై గత 40 సంవత్సరాలుగా టిడిపి పార్టీలో ఉంటున్న సుమారు 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పామిడి పట్టణంలోని 4,5,9,18,19 వార్డులందు పామిడి స్టేషన్ మరియు కొత్తపల్లికి చెందిన వంద టీడీపీ కుటుంబాలు గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టిడిపి పార్టీలో ఉంటూ పార్టీకి ఊడిగం చేశామని కానీ మమ్మల్ని పార్టీ పట్టించుకోలేదన్నారు. దీంతో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో గురజాల శాసనసభ్యులు కాసు.మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చామని, అందులో భాగంగానే దాచేపల్లి పట్టణంలో కూడా సుమారు రెండువేల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వాటితో పాటు డిసెంబర్ 10వ తేదీన దాచేపల్లి పట్టణంలో మరో పదహారు వందల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి కులాయివేసి త్రాగునీరు అందిస్తున్నామని, ఇప్పటికే హెల్త్ సెంటర్లు నిర్మించామని వారు తెలిపారు. వీటితోపాటు కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇవన్నీ పూర్తి చేసి దాచేపల్లిని ఒక ఉన్నత పట్టణంగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు.
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథరాజు ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిటిడి నిధుల దారిమళ్లించ డాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఇసుక దోపిడీ, సర్పంచుల దుర్వినియోగం, మద్యం కుంభకోణాల పై గణాంకాలతో సహా నిరూపిస్తున్న తమ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ నకిలీ మద్యంతో దశలవారీగా ప్రజలను చంపేస్తున్నారన్నారని ఆరోపించారు. పెండింగ్ కేసులపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సీజేఐకు లేఖ రాయడంతో బెయిల్ పై ఉన్న రాజకీయ కేసులపై త్వరలోనే ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారణ జరగనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందనీ హెచ్చరించారు.
మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. నాలుగు రోజుల క్రితం కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నుంచి ప్రారంభించిన పాదయాత్ర బుధవారం ప్రొద్దుటూరు చేరుకుంది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడుగా ఉన్న గుంటూరు జిల్లా వాసి కట్టెపోగు బసవరావు ఆ పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చెపట్టారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. మళ్లీ 2024లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని 2000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగే ఈ పాదయాత్ర మూడు నెలలు కొనసాగు తుందని ఆయన చెప్పారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని కలిసిన అనంతరం 5వ రోజు పాదయాత్ర ప్రొద్దుటూరు పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఆయనకు మద్దతుగా ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, రాజుపాలెం మండలం వైసిపి అధ్యక్షుడు రాజారాం రెడ్డి వైసిపి నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.
Read Also..
రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలోని ప్రధాన రహదారి పై ఏర్పడ్డ గుంతల వద్ద జనసేన మరియు టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జనసేన మరియు టీడీపీ నాయకులు రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో మోటార్ సైకిళ్లను పడేసి వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిన అసమర్థ సీఎం జగన్‌ను సాగనంపేందుకు సమయం దగ్గర పడిందని వారు తెలిపారు. అసమర్థుడైన పాలకునికి రాష్ట్రం అప్పగిస్తే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలంతా గమని స్తున్నారన్నారు. ఏ మూలకు వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. సైకో ప్రభుత్వాన్ని పారదోలి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సీఎం జగన్ అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మద్యం అమ్మకాలు, నిషేధంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది చనిపోయారు. చంద్రబాబు హయాంలో మద్యంపై కేవలం 50 వేల కోట్లు ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ధరలు పెంచడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గుతాయని చెప్పారు కానీ ఎక్కడ తగ్గలేదు. మద్యనిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఊరూవాడా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు సీఎం చేతులు మీదుగా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల భవిష్యత్ కు భరోసాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు. పులికాట్ ముఖద్వారం పూడికతీత కు 142 కోట్లు ఖర్చుచేసామన్నారు. మత్స్యకారుల ఆరాధ్యదైవం మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 21న జరిగే సభలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ భూములకు శాశ్వత హక్కు పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలను బస్సులలో తరలించారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. స్థానిక కాలేజీల నుండి విద్యార్థులు తరలించారు. ఏలూరు జిల్లాలోని పలు విద్యాసంస్థలకు సెలవులకు ప్రకటించి స్కూల్ బస్సులలో విద్యార్థులను ప్రజలను తరలించారు. విసన్నపేటకు చెందిన పలువురు వృద్ధులు ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళుతుండగా తమను బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తామని నమ్మబలికి అధికారులు సీఎం సభకు తీసుకొచ్చారని ఆ వృద్ధుడు ఆరోపిస్తున్నాడు.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎం హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని, రెండు పార్టీల అధినేతల నుండి వచ్చే ప్రధాన అంశాలను ప్రజలలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని నాయకులు అన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 11 ను రెండు పార్టీలు కలిసికట్టుగా ప్రజలలో తీసుకువెళ్లి రాబోయే 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకువస్తామని అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేకా.ఈశ్వరయ్య మాట్లాడుతూ చింతలపూడి ఎస్సి నియోజకవర్గం, కానీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా చింతలపూడి నియోజకవర్గానికి ఇవ్వకుండా వైయస్సార్ ప్రభుత్వం చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా చేసిందని రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి కలసి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతలపూడి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల. నాగేశ్వరరావు, చింతలపూడి టిడిపి మాజీ కన్వీనర్ జగ్గవరపు. ముత్తారెడ్డి, చింతలపూడి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చీదరాల. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.