సామాజిక న్యాయమే తన ఎజెండా అని జగనన్న మరోసారి నిరూపించుకున్నారని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేటలో టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్యయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, పిరియా విజయ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎల్లప్పుడూ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని అంకితభావంతో వారి సంక్షేమం కోసం తపిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో కూడా వారందరికీ పెద్దపీట వేయాలనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా బీసీలనే నియమించి బీసీల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారని తెలిపారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదేవిధంగా సిఎం జగన్ సామాజిక సమతూకాన్ని పాటించనున్నారన్నారు. ఎల్లప్పుడూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను ఉపయోగించుకుని అందలాలెక్కే చంద్రబాబునాయుడు తన అవసరం తీరాక వారిని తొక్కేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ నిర్దేశాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేసి శతశాతం ఫలితాలు సాధిస్తామన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నేటి వరకూ ప్రజలకోసం రూ 4 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించామన్నారు. ప్రతి ఇంటా అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏమిటో అంతా కళ్ళముందే అందరికీ కనిపిస్తోందని పేర్కొన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Jaganmohan Reddy
పట్టణంలోని యాదవ్ బజార్ లో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ – జగనన్న వాక్ వే ను నిర్మించారు. పాత బస్టాండ్ సమీపంలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో ఆధునికరించిన బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు. నేను వైసిపి పెనమలూరు అభ్యర్థిని నా మీద ఎవరు పోటీ చేసినా నేను సిద్ధమేనని, పెడన నియోజకవర్గ ఉప్పాల రాముకు నేను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. కేశినేని నాని మా పార్టీలోకి వస్తాను అనడంతో అతన్ని పార్టీలోకి ఆహ్వానించామని, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించామని ఆయన అక్కడ గెలవబోతున్నారని అన్నారు. నా నియోజకవర్గం మైలవరం 2009లో రాజశేఖర్ రెడ్డి గారు పెడనలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2014లో జగన్మోహన్ రెడ్డి మైలవరం నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2019లో మరల పెడన నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు మళ్ళి అక్కడ పోటీ చేశాను. ఇప్పుడు పెనమలూరులో పోటీ చేయమంటున్నారు అలానే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తాను. జగన్ ఎలా చెప్తే అలా నేను పని చేస్తానని, ఆయన మాటను నేను శిరసా వహిస్తానని ఆయన అన్నారు.
ప్రకాశం జిల్లా దరిశి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల పందాలు కార్యక్రమంను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి మెరుగు నాగార్జున ప్రారంభించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో న్యూ క్యాటగిరి, సీనియర్ విభాగం పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం ఇవి రెండు కళ్లలా భావించి ఏ ముఖ్యమంత్రి పరిపాలించనంత సుభిక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. మీకు సంక్షేమ పథకాలు అందితేనే మాకు ఓటు వేయండి అని ధైర్యంగా మీ ముందుకు వస్తున్నాం అన్నారు. ప్రతిపక్షాలు పొత్తుల్లో భాగంగా రెండు మూడు కండువాలు వేసుకొని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దర్శి నియోజకవర్గంలో మరోసారి బూచేపల్లినీ సమన్వయకర్తగా అవకాశం ఇస్తారని మీరు మరోసారి ఆదరించి గెలిపించాలని మంత్రి అన్నారు. దరిశి లో బూచేపల్లి గెలిస్తే రాష్ట్రంలో జగనన్న గెలుస్తాడని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాది మహల్ లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని షాదీ మహల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అజీజీయ షాది మహల్ లో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ మాట్లాడారు. వైసీపీ పాలనలో ముస్లిం మైనారిటీల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసిపికి తొత్తుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా కొన్ని మైనారిటీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బేల్ రద్దు కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి తొత్తుగా మారాడని మండిపడ్డారు. పార్లమెంటులో మైనారిటీల వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందేందుకు వైసిపి ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి మైనారిటీలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధం తండ్రి కొడుకుల బంధం అని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడంలోనే వైసిపికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు. కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం నాడు పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో సమ్మెలో ఉన్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం మంగళవారం నాటి ఉదయం తిరుపతి నగరంలో జరిగింది. పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్యకర్తలు, నాయకులతో పాటు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన నాలుగు కాళ్ల మండపం వద్దకు చేరుకునేటప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రదర్శనను నిలిపివేయాలని ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు. దీంతో అంగన్వాడీలు, కార్మిక సంఘాల నేతలు నాలుగు కాళ్ల మండపం వద్ద బైఠాయించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మగ పోలీసులతో అరెస్టు చేయటానికి పోలీసులు సంకోచిస్తూ తటపటాయించారు. ముందుకు పోనివ్వకుండా అరెస్టులు చేయకుండా నడిరోడ్డుపై కూర్చోబెట్టడాన్ని సహించలేని కార్మిక సంఘాల నేతలు తాము ప్రదర్శనని చేపడుతున్నామని ప్రకటించి ముందుకెళ్లారు. తూర్పు పోలీస్ స్టేషన్ డిఎస్పీ అందరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో పోలీసుల నడుమ భారీ సంఖ్యలో అంగన్వాడీలను తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియుల నేతలు కందారపు మురళి, కె. రాధాకృష్ణ, ఆర్. హరికృష్ణలు ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. 29 రోజులుగా సమ్మె సాగిస్తుంటే కనీసం సమస్యల పరిష్కారానికి చర్చించకపోగా ఎస్మాను ప్రయోగించి అంగన్వాడీ మహిళలను అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం ఆనవాయితీగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తక్షణం కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం ఖాయమని నేతలు హెచ్చరించారు. తూర్పు పోలీస్ స్టేషన్ అంగన్వాడీ మహిళలతో నిండిపోయింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. అంగన్వాడీల పోరాటానికి శుక్రవారం మాజీమంత్రి, టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. అంగన్వాడీల నిరసన శిబిరాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో లబ్ది కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఎన్నికల హామీను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఐదేళ్ల సమయం లో అంగన్వాడీల సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాని సీఎం ఎన్నికల్లో బయటకు రావడం తప్పనిసరి అని తెలిసి అంగన్వాడీలు బయటకు వచ్చారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, జగనన్న కాలనీ పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకదాని ఆరోపించారు. దోపిడీని ఆపితే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించవచ్చునన్నారు. ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, రైతుల్లో అసంతృప్తి వచ్చిందన్నారు. అంగన్వాడీలు, మున్సిపల్, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సహకరించకుండా ఐదేళ్లు పాలన చేశారా అని ప్రశ్నించారు. అంగన్వాడీలను తొలగించే హక్కు ఎవరికి లేదన్నారు. అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఒక్కసారి మోస పోవడం సహజం రెండోసారి మోసపోకుండా వైసీపీకు బుద్ది చెప్పాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకూ అందరూ కలిసి పని చేస్తామని, ఎవరికి అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అయితే అధిష్టానం నిర్ణయం మేరకూ అందరు కలిసి పని చేస్తామని, రాబోయే ఎన్నికల్లో తానూ పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు, అతని టీం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని, మాతో చంద్రబాబుకు ఏం పనో అర్ధం కావడం లేదని, చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కాకుండా కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నావో, లోకేష్ ఎందుకు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, చంద్రబాబు హామీ ఇచ్చిన నెరవేర్చక పోవడం వల్లే ప్రజల్లోకి వెళ్ళలేక పోతున్నారని, పవన్ ను మళ్ళీ కలిసి చంద్రబాబు ఎన్నికల్లోకి వెళ్తున్నారే గానీ మాకు ఏ పార్టీతో పని లేదని, మంత్రి గుడివాడ అమర్నాథ్ వేరే చోట పని చేయబోతున్నారే గానీ, మా పార్టీలో అమర్నాథ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఏపి మంత్రి మెరుగు నాగార్జున తెలియజేశారు.
బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 22వ రోజు అంగన్వాడీలు రోడ్డుపై దున్నపోతు కు మెమోరాండం ఇచ్చి వినూత్న నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. దున్నపోతు మేము ఇచ్చిన మెమోరాండమ్ స్వీకరించి మాపై కృప చూపిందని, ఈ గుడ్డి ప్రభుత్వం 22 రోజులుగా అంగన్వాడీ అక్కచెల్లెళ్లు ఇల్లు వాకిళ్లు వదిలి రోడ్డుపై కూర్చొని ధర్నాలు చేస్తుంటే దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ఉందని ఇకనైనా మా డిమాండ్లు నెరవేరుస్తారని ఆశిస్తున్నామని వారు అన్నారు. లక్ష అరు వేల పై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 22 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల పట్ల దయ చూపి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
బాపట్లలో 15వ రోజు అంగన్వాడిలు రోడ్డుపై నల్ల బెలూన్లతో వారి నిరసనను తెలియజేసారు. సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు. మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 15వ రోజు అంగన్వాడీలు నల్ల బెలూన్లతో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బెలూన్లు పాత బస్టాండ్ సెంటర్ లో వదిలి నిరసన తెలిపారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అని వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 15 రోజుల నుండి మేము సమ్మెలు, దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల పట్ల దయ చూపి వారి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. 10వ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. జనసేన మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు నిరసనలో పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కేసాడు. రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెవిలో పూలు పెట్టి వాళ్లకు జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ చేతగాని పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల అంగన్వాడీలు రోడ్డెక్కి వాళ్ళని దీనస్థితికి తీసుకువచ్చారు. ఎవరైతే నీకు ఓటు వేసి గెలిపించారో వాళ్లే రేపు తిరిగి నిన్ను ఇంటికి పంపుతారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోతే తగు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి ప్రభుత్వం రాగానే అంగన్వాడీలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.





Total views : 90719